Hyderabad News : కుల్లిన పదార్థాలతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ - నలుగురు అరెస్ట్
Hyderabad Crime News : నాసిరకం పదార్థాలతో అల్లం పేస్ట్ ను తయారు చేసి విక్రయిస్తున్న ముఠాను హైదరాబాద్ నగర పోలీసులు అరెస్ట్ చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు నలుగురిని రిమాండ్ కు తరలించారు.
Hyderabad Crime News : కుల్లిన పదార్థాలు ,నాసిరకం ముడి సరుకులతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుచేసి వాటిని ఎక్కువ రోజులు నిల్వ ఉంచేందుకు ప్రమాదకరమైన రసాయనాలు కలిపి తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు సరఫరా చేసి విక్రయిస్తున్న ముఠా గుట్టును హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాలోని నలుగురు నిందితులను పట్టుకొని వీరు నుంచి భారీ పరిమాణంలో నాసిరకం ముడి సరుకు స్వాధీనం చేసుకున్నట్లు డీసీపీ రశ్మి బుధవారం వెల్లడించారు.ఫుడ్ సేఫ్టీ నిబంధనల ప్రకారం ఏ ఆహార పదార్థాల ను కూడా ప్రిజర్వటివెస్ ఉపయోగించకూడదు అని ఆమె పేర్కొన్నారు.
గుజరాత్ రాష్ట్రానికి చెందిన రహీం అనే వ్యక్తి కొన్నేళ్ళ క్రితం బతుకుదెరువు కోసం హైదరాబాద్ నగరానికి వలస వచ్చి బేగంపేటలో స్థిరపడ్డాడు. ముడి సరుకులతో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి..… మొదట్లో డెక్కన్ ట్రాడర్స్ పేరుతో నిత్యవసర వస్తువులు వ్యాపారం చేస్తున్న ఇతను తరువాత తేలికగా డబ్బు సంపాదించాలని భావించాడు.అందుకోసం నాసిరకం మూడు సరుకులతో అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారుచేసి అధిక లాభాలకు విక్రయించలని నిర్ణయించుకున్నాడు. అందుకోసం రాజేందర్ నగర్ పరిధిలోని ఉప్పరపల్లి ఓ కార్కానా ఏర్పాటు చేశాడు.మార్కెట్లో తక్కువ ధరకు లభించే నాసిరకం అల్లం వెల్లుల్లి కొనుగోలు చేసి వాటిని ఉప్పరపల్లిలోని ఖర్కనలో ఏర్పాటు చేసిన మిషన్ ప్రాసెస్ ద్వారా పేస్టుగా మార్చి వాటికి సిట్రిక్ యాసిడ్ తో పాటు గుర్తుతెలియని పొడి కలుపుతూ ఆకర్షనీయమైన అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నాడు. అయితే వీటిని ఎక్కువ రోజులు నిలువ ఉంచడం కోసం సిట్రిక్ యాసిడ్ తో ప్రమాదకరమైన రిజర్వేటివ్ కలుపుతున్నాడు.వీటిని ప్యాక్ చేసి బేగంపేటకు చెందిన పాండురంగారావు వద్ద బేగం బజార్లో తెలంగాణ ఏజెన్సీ నిర్వహించే అజయ్ కుమార్ ,అఖిల్ నిఖిల్ ట్రేడర్స్ నిర్వాహకుడు ప్రదీప్ సంకులకు సరఫరా చేస్తున్నాడు. వీరు ఈ అల్లం వెల్లుల్లి పేస్టు నగరంలోని దుకాణాలతో పాటు ఇతర జిల్లాలు,మహారాష్ట్ర ,కర్ణాటక ,ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.
కొన్నాళ్ళుగా సాగుతున్న ఈ దందా పై నిఘా పెట్టిన సెంట్రల్ టాస్క్ఫోర్స్ పోలీసులు… బుధవారం ఇన్స్పెక్టర్ రాజు నాయక్ నేతృత్వంల ఎస్ఐలు నవీన్ కుమార్ కిరణ్ లు తమ బృందాలతో నిందుతుడు పాండురంగారావును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి రావడంతో మిగిలిన ముగ్గురు నిందితులను సైతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.అనంతరం వారి నుంచి 700 కేజీలు అల్లం వెల్లుల్లి పేస్ట్, 625 కేజీలు అల్లం ,100 కేజీల వెల్లుల్లి ,20 కేజీల రసాయనుల తదితర పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రెజర్వేటివ్స్ గా వాడుతున్న రసాయనలను గుర్తించడానికి నమూనాలను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు. ఇలాంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ వాడటం ఆరోగ్యానికి ప్రమాదకరమని పోలీసులు పేర్కొన్నారు.
రిపోర్టింగ్ - కేతిరెడ్డి తరుణ్, హైదరాబాద్ జిల్లా
సంబంధిత కథనం