Black Thread : అంబానీ ఫ్యామిలీలోని మహిళలు చేతికి నల్లతాడు ఎందుకు కట్టుకుంటారు?-why ambani family ladies tie black thread to wrist know reasons ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Black Thread : అంబానీ ఫ్యామిలీలోని మహిళలు చేతికి నల్లతాడు ఎందుకు కట్టుకుంటారు?

Black Thread : అంబానీ ఫ్యామిలీలోని మహిళలు చేతికి నల్లతాడు ఎందుకు కట్టుకుంటారు?

Anand Sai HT Telugu
Mar 23, 2024 07:30 PM IST

Ambani Family Ladies Wear Black Thread : కోట్లాది రూపాయలు విలువ చేసే నగలు ధరిస్తారు ముఖేష్ అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు. అయితే వారి చేతికి నల్ల తాడులు కట్టుకుంటారు. ఈ విషయం ఎప్పుడైనా ఆలోచించారా..?

నీతా అంబానీ
నీతా అంబానీ (AFP)

భారతదేశంలోనే అత్యంత ధనవంతుల్లో ముకేశ్ అంబానీ నంబర్ వన్ అని అందరికీ తెలిసిందే. ఆయన కుటుంబం ఎప్పుడూ ఏదో ఒక కారణంతో వార్తల్లో ఉంటారు. ఇటీవల అంబానీ కుమారుడు అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ప్రీ వెడ్డింగ్ వేడుక జామ్‌నగర్‌లో చాలా అట్టహాసంగా జరిగింది. దేశం మెుత్తం కొన్ని రోజులు ఈ విషయం గురించే మాట్లాడింది.

ఈ కార్యక్రమంలో అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు కోట్లాది రూపాయల విలువైన దుస్తులు, ఆభరణాలను ధరించారు. వారు ధరించిన నగలపైనే అందరి చూపు పడింది అని చెప్పొచ్చు. అయితే చాలా తక్కువ మంది కళ్ళు వారి చేతులకు కట్టుకున్న నల్ల తాడుపై పడిందేమో. అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు చేతులకు నల్ల తాడులు ఎందుకు కట్టుకుంటారో చాలా తక్కువ మందికి తెలుసు. వజ్రాలు, గాజులు వేసినా చేతికి నల్ల తాడు కట్టడానికి కారణం ఏంటో ఇప్పుడు చూద్దాం.

నల్ల తాడు కచ్చితంగా విజయాన్ని అందించడమే కాకుండా చెడు దృష్టి నుండి రక్షిస్తుందని నమ్ముతారు. అంతేకాకుండా వ్యాధులను దూరం చేస్తుందని కొందరికి నమ్మకం. అందుకే అంబానీ కుటుంబానికి చెందిన మహిళలు తమ చేతులకు నల్ల తాడును కట్టుకుంటారని కొందరు అంటుంటారు. వీటిని ధరించకుండా ఇంటి నుంచి బయటకు వెళ్లరు.

ఇషా అంబానీ పాశ్చాత్య దుస్తులను ధరించినప్పటికీ ఎల్లప్పుడూ తన చేతికి నల్ల తాడును ధరిస్తుంది. అంబానీ కుటుంబానికి కొత్త కోడలు అయిన రాధిక చేతికి కూడా ఇకపై నల్ల తాడు రానుంది.

ఈ నల్లతాడు కట్టుకునే విషయం అనేది ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అమ్మాయిలు, అబ్బాయిలు చేతికి, కాళ్లకు నల్లతాడు కట్టుకోవడం కనిపిస్తూ ఉంటుంది. మార్కెట్లో కూడా నల్లతాడును డిజైన్ చేసి మరి అమ్ముతున్నారు. ఒకప్పుడు చిన్న పిల్లలకు మాత్రమే ఈ నల్లతాడును కట్టేవారు. దిష్టి తగలకుండా రెండు కాళ్లకు లేదా రెండు చేతులకు ఇలాంటివి కట్టడం చూశాం. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది.

నల్లతాడు కట్టుకోవడం వెనక చాలానే విషయాలు ఉన్నాయి. చేతికి నల్లతాడు కట్టుకుంటే కాశీ తాడు అని చెబుతుండేవారు. ఇప్పుడదే ట్రెండ్ అయింది. నల్లతాడును కాలికి కట్టుకుంటే నెగటివ్ ఎనర్జీ పోతుందని చెబుతారు. అందుకే చిన్నపిల్లలకు కడతారని అంటారు. దృష్టి దోషం నుంచి కాపాడేందుకు నల్లతాడు ఉపయోగపడుతుందని అంటుంటారు.

చేతికి నల్లతాడు కట్టుకుంటే రెండు లేదా నాలుగు, ఆరు, ఎనిమిది సార్లు.. తిప్పి అనగా.. రెండు నుంచి ఎనిమిది వరుసల వరకూ తిప్పి కట్టుకోవచ్చని చెబుతారు. అంటే సరి సంఖ్యలో వరుసలు రావాలని అర్థం. అయితే ఈ నల్లతాడును అంబానీ ఫ్యామిలీ మహిళలు కట్టుకోవడం కూడా చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. ఎవరి నమ్మకం వారిది.

టాపిక్