Ooru Peru Bhairavakona OTT Streaming: నేషనల్ వైడ్‍గా ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతున్న సందీప్ కిషన్ సినిమా: వివరాలివే-sundep kishan varsha bollamma ooru peru bhairavakona trending top on amazon prime video ott platform ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ooru Peru Bhairavakona Ott Streaming: నేషనల్ వైడ్‍గా ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతున్న సందీప్ కిషన్ సినిమా: వివరాలివే

Ooru Peru Bhairavakona OTT Streaming: నేషనల్ వైడ్‍గా ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతున్న సందీప్ కిషన్ సినిమా: వివరాలివే

Chatakonda Krishna Prakash HT Telugu
Mar 09, 2024 06:46 PM IST

Ooru Peru Bhairavakona OTT Streaming: ఊరు పేరు భైరవకోన సినిమా ఓటీటీలోనూ ఆదరణ దక్కించుకుంటోంది. ఏకంగా నేషనల్ వైడ్‍లో ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చేసింది.

నేషనల్ వైడ్‍లో ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతున్న సందీప్ కిషన్ సినిమా: వివరాలివే
నేషనల్ వైడ్‍లో ఓటీటీలో టాప్‍లో ట్రెండ్ అవుతున్న సందీప్ కిషన్ సినిమా: వివరాలివే

Ooru Peru Bhairavakona OTT Streaming: ఫ్యాంటసీ థ్రిల్లర్ మూవీగా వచ్చిన ఊరు పేరు భైరవకోన బాక్సాఫీస్ వద్ద మంచి పర్ఫార్మెన్స్ చేసింది. సందీప్ కిషన్ హీరోగా నటించిన ఈ చిత్రం మోస్తరు విజయాన్ని దక్కించుకుంది. ఫిబ్రవరి 16వ తేదీన ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. వీఐ ఆనంద్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. హఠాత్తుగా ఓటీటీలోకి వచ్చిన ఊరు పేరు భైరవకోన అక్కడ కూడా సత్తాచాటుతోంది.

ఊరు పేరు భైరవకోన మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి శుక్రవారం (మార్చి 8) సడెన్‍గా వచ్చింది. ముందస్తుగా ప్రకటన లేకుండానే హఠాత్తుగా ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టింది. థియేటర్లలో రిలీజైన నాలుగు వారాల్లోనే ఈ చిత్రం ఓటీటీలో వచ్చింది.

ట్రెండింగ్‍లో టాప్

ఊరు పేరు భైరవకోన చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలోకి సడెన్‍గానే వచ్చినా.. భారీ ఆదరణ దక్కించుకుంటోంది. తెలుగు ఆడియోలో మాత్రమే ఈ చిత్రం స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి వచ్చింది. అయినా.. భారీగా వ్యూస్ వస్తుండటంతో నేషనల్ వైడ్‍ ట్రెండింగ్‍లో నంబర్ వన్ స్థానానికి ఈ చిత్రం దూసుకొచ్చింది. తెలుగులో మాత్రమే స్ట్రీమింగ్‍కు వచ్చినా.. 24 గంటల్లోనే ప్రైమ్ వీడియోలో ఇండియా ట్రెండింగ్‍లో ఈ చిత్రం టాప్‍కు చేరింది.

ఫ్యాంటసీ థ్రిల్లర్‌గా వచ్చిన ఊరు పేరు భైరవకోనలో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉన్నాయి. ఈ మూవీని ఆసక్తికరంగా తెరకెక్కించడంతో దర్శకుడు వీఐ ఆనంద్ సఫలీకృతుడయ్యాయి. ఈ మూవీకి మౌత్ టాక్ కూడా పాజిటివ్‍గానే వచ్చింది. దీంతో తొలివారంలో మంచి వసూళ్లను సాధించింది. అయితే, ఆ తర్వాత నెమ్మదించింది. మొత్తంగా సుమారు ఈ చిత్రానికి రూ.27కోట్ల వరకు గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

ఊరు పేరు భైరవకోన సినిమాలో సందీప్ కిషన్ సరసన హర్ష బొల్లమ్మ హీరోయిన్‍గా నటించారు. కావ్య థాపర్, కావ్య థాపర్, వెన్నెల కిశోర్, వైవా హర్ష, రవిశంకర్, వడివుక్కరసి కీరోల్స్ చేశారు. భాను భోగవరపు ఈ చిత్రానికి కథ అందించారు. ఈ మూవీకి శేఖర్ చంద్ర సంగీతం అందించగా.. రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేశారు. రాజేశ్ దండా, బాలాజీ గుత్తా ఈ మూవీని నిర్మించారు. ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్ సమర్పించింది.

ఊరు పేరు భైరవకోన కథ

ఊరు పేరు భైరవకోన సినిమా ఓ రహస్యమైన గ్రామం, ఆత్మల చుట్టూ ఉంటుంది. కొన్ని ట్విస్టులు కూడా ఈ చిత్రం ఆకట్టుకుంది. సినిమాల్లో డూప్‍గా పని చేసే బసవ లింగం (సందీప్ కిషన్).. ఓ ఇంట్లో నగలను చోరీ చేస్తాడు. ఆ తర్వాత పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో భైరవకోనలో అడుగుపెడతాడు. కార్తీకమాసంలో రాత్రివేళల్లో ఈ గ్రామం తలుపు తెరుచుకుంటాయి. బసవ వెంట జాన్ (హర్ష చెముడు), గీత (కావ్య థాపర్) ఉంటారు. భైరవకోనలో ఏదో రహస్యం ఉన్నట్టు వారు గుర్తిస్తారు. అసలు బసవ ఎందుకు దొంగతనం చేశాడు? అతడి జీవితంలోకి గీత (వర్ష బొల్లమ్మ) ఎలా వచ్చింది? ఆ ఊరి నుంచి ఆ ముగ్గురు బయటపడ్డారా? అనే విషయాలు ఊరు పేరు భైరవకోన మూవీలో ఉంటాయి. ఈ చిత్రంలో కొన్ని మలుపులు సర్‌ప్రైజ్ చేస్తాయి.

Whats_app_banner