Ooru Peru Bhairavakona: సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన సందీప్‌కిషన్ ఊరుపేరు భైరవకోన - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఏదంటే?
Ooru Peru Bhairavakona: సందీప్‌కిషన్ ఊరు పేరు భైరవకోన మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
Ooru Peru Bhairavakona: సందీప్‌కిషన్ ( Sundeep Kishan) ఊరు పేరు భైరవకోన మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా సైలెంట్‌గా ఈ హారర్ మూవీని ఓటీటీలో రిలీజ్ చేశారు. శుక్రవారం నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో (Amazon Prime Video) ఈ హారర్ మూవీ స్ట్రీమింగ్ అవుతోంది. ఫిబ్రవరి 16న ఊరు పేరు భైరవకోన థియేటర్లలో రిలీజైంది. నెట రోజుటు కూడా కాకముందే ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. థియేట్రికల్ రిలీజ్‌కు ముందే ఊరు పేరు భైరవకోన మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం.
టైగర్ తర్వాత...
ఫాంటసీ హారర్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఊరు పేరు భైరవకోన సినిమాకు వీఐ ఆనంద్ దర్శకత్వం వహించాడు. టైగర్ తర్వాత సందీప్‌కిషన్, వీఐ ఆనంద్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా మంచి వసూళ్లను రాబట్టింది. పదికోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన ఈమూవీ ఇరవై కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్నది. నిర్మాతలకు లాభాలను తెచ్చిపెట్టింది. ఊరు పేరు భైరవకోన సినిమాలో వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్ హీరోయిన్లుగా నటించారు. ఈ మిడ్ రేంజ్ మూవీకి అనిల్ సుంకర ప్రజెంటర్‌గా వ్యవహరించాడు.
ఊరు పేరు భైరవ కోన కథ ఇదే...
భైరవకోన ఊళ్లో అడుగుపెట్టిన వాళ్లు ఎవరూ ప్రాణాలతో బయటకు వచ్చిన దాఖలాలు ఉండవు. ఓ దొంగతనం చేసి పోలీసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో బసవతో (సందీప్ కిషన్)పాటు అతడి స్నేహితులు గీత, జాన్ భైరవకోనలో అడుగుపెడతారు. అక్కడ వారికి ఎలాంటి అనూహ్య పరిస్థితులు ఎదురయ్యాయి? ప్రేమించిన భూమి (వర్ష బొల్లమ్మ) కోసం బసవ ఎందుకు దొంగగా మారాడు? గరుణ పురాణంలో మిస్సయిన నాలుగు పేజీలతో భైరవకోనకు ఉన్న సంబంధం ఏమిటి? బసవ, గీత, జాన్ భైరవ కోన నుంచి ప్రాణాలతో బయటపడ్డారా? లేదా? అన్నదే ఈ మూవీ కథ.
వీఐ ఆనంద్ రాసుకున్న పాయింట్‌తో పాటు అతడి టేకింగ్, కామెడీ, హారర్ అంశాలు బాగున్నాయంటూ థియేటర్ రిలీజ్ టైమ్‌లో కామెంట్స్ వినిపించాయి. ఈ సినిమాలోని పాటలు మ్యూజిక్ లవర్స్‌ను ఆకట్టుకున్నాయి. ఊరు పేరు భైరవకోనకు శేఖర్‌చంద్ర మ్యూజిక్ అందించాడు.
పలుమార్లు వాయిదా...
ఊరు పేరు భైరవ కోన సినిమా షూటింగ్ చాలా రోజుల క్రితమే పూర్తయింది. అనివార్య కారణాల వల్ల రిలీజ్ పలుమార్లు వాయిదాపడింది. ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని అనుకున్నా...అదే రోజు రవితేజ ఈగల్, రజనీకాంత్ లాల్‌సలామ్ ప్రేక్షకుల ముందుకు రావడంతో ఊరు పేరు భైరవకోన రిలీజ్‌ను వారం వాయిదావేశారు. ఊరు పేరు భైరవకోనలో వెన్నెలకిషోర్, వైవా హర్ష, రవిశంకర్ కీలక పాత్రలు పోషించారు.
ధనుష్‌తో సెకండ్ టైమ్....
ఈ ఏడాది సంక్రాంతికి రిలీజైన ధనుష్ కెప్టెన్ మిల్లర్‌లో సందీప్‌కిషన్ కీలక పాత్రలో నటించాడు. బ్రిటీష్ ఆర్మీలో పనిచేసే యువకుడి పాత్ర చేశాడు. కెప్టెన్ మిల్లర్ తర్వాత మరోసారి ధనుష్, సందీప్‌కిషన్ ఓ తమిళ మూవీ రాబోతోంది. ధనుష్ దర్శకత్వం వహిస్తూ హీరోగా నటిస్తోన్న రాయన్‌లో సందీప్‌కిషన్ ఓ డిఫరెంట్ రోల్ చేస్తున్నాడు.