Ooru Peru Bhairavakona Review: ఊరు పేరు భైరవకోన రివ్యూ.. గరుడ పురాణంలో మిస్సయిన 4 పేజీల కథ ఎలా ఉందంటే?
Ooru Peru Bhairavakona Movie Review: ఎన్నో పరాజయాలతో సతమతం అవుతున్న సందీప్ కిషన్ లేటెస్ట్‌గా మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఊరు పేరు భైరవకోన. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమాతో హిట్ కొట్టాడా లేదా అనేది ఊరు పేరు భైరవకోన రివ్యూలో తెలుసుకుందాం.
టైటిల్: ఊరు పేరు భైరవకోన
నటీనటులు: సందీప్ కిషన్ కావ్య థాపర్, వర్ష బొల్లమ్మ, వెన్నెల కిశోర్, హర్ష చెముడు (వైవా హర్ష), వడివుక్కరసి, పి రవిశంకర్ తదితరులు
స్క్రీన్ ప్లే, దర్శకత్వం: వీఐ ఆనంద్
ప్రొడక్షన్: హాస్య మూవీస్, ఏకే ఎంటర్టైన్‌మెంట్
నిర్మాతలు: అనిల్ సుంకర, రాజేష్ దండా
సంగీతం: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: రాజ్ తోట
ఎడిటింగ్: చోటా కే ప్రసాద్
రిలీజ్ డేట్: ఫిబ్రవరి 16, 2024
Ooru Peru Bhairavakona Review Telugu: యంగ్ హీరో సందీప్ కిషన్ లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ అండ్ ఫాంటసీ అడ్వెంచరస్ మూవీ ఊరు పేరు భైరవకోన. సాంగ్స్, టీజర్, ట్రైలర్ ద్వారా మంచి బజ్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాకు ఇప్పటికే ఫిబ్రవరి 14న పెయిడ్ ప్రీమియర్ షోలు పడ్డాయి. అవి చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ వచ్చింది. ఇక ఇవాళ అంటే ఫిబ్రవరి 16న థియేటర్‌లలో విడుదలైంది ఈ మూవీ. చాలా కాలంగా హిట్స్ లేని సందీప్ కిషన్ ఎన్నో ఆశలు పెట్టుకున్న మూవీ ఊరు పేరు భైరవకోన మూవీ రివ్యూలోకి వెళితే..
కథ:
బసవలింగం (సందీప్ కిషన్) స్టంట్ మ్యాన్‌గా పని చేస్తుంటాడు. అనుకోని పరిస్థితుల్లో పోలీసుల నుంచి తప్పించుకోడానికి భైరవకోన ఊరిలోకి వెళ్తారు. అయితే భైరవకోనలోకి వెళ్లడం తప్పా ప్రాణాలతో బయటకు వచ్చిన వారు ఉండరు. అలాంటి గ్రామంలోకి బసవ, తన ఫ్రెండ్ జాన్ (వైవా హర్ష)తోపాటు మరో అమ్మాయి అగ్రహారం గీత (కావ్య థాపర్) వెళ్తారు. ఆ గ్రామంలో వారికి అనుకోకుండా పరిచయమైన భూమి (వర్ష బొల్లమ్మ)ని చూసి ప్రేమలో పడతాడు బసవ.
ట్విస్టులు
భైరవకోనలోకి ప్రవేశించిన బసవ, జాన్, గీతలకు ఎదురైన పరిస్థితులు ఏంటీ? ఆ ఊరు ప్రత్యేక ఏంటీ? అక్కడ కనిపించే మనుషులు ఎవరు? భైరవకోనలో ఈ ముగ్గురి జీవితాలు ఎలాంటి మలుపు తిరిగాయి? గరుడ పురాణంలో మిస్ అయిన నాలుగు పేజీల కథ ఏంటీ? భూమి పాత్ర ఏంటీ? ఆమె కోసం బసవ ఏం చేశాడు? బసవ తన ఫ్రెండ్స్ ప్రాణాలతో బయట పడ్డారా? అనే విషయాలు తెలియాలంటే ఊరు పేరు భైరవకోన సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
ఊరు పేరు భైరవకోన సినిమా గురించి చెప్పుకోవాలంటే ముందుగా డైరెక్టర్ వీఐ ఆనంద్ గురించి మాట్లాడుకోవాలి. ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం వంటి సూపర్ నేచురల్ అంశాలతో సినిమాలు తెరకెక్కించి మంచి హిట్స్ అందుకున్నారు. అలాంటి అంశాలతో వచ్చిన ఊరు పేరు భైరవకోన మూవీ ట్రైలర్, టీజర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. కానీ, ఆ అంచనాలను పూర్తి స్థాయిలో అందుకోవడంలో డైరెక్టర్ విఫలం అయ్యారని చెప్పొచ్చు.
ప్లస్ పాయింట్స్
అకాలంగా చనిపోయిన వారి ఆత్మలు ద్వేషంతో రగిలిపోతూ పగ తీర్చుకునేందుకు ఎదురుచూస్తుంటే ఎలా ఉంటుంది అనే కాన్సెప్టుతో భైరవకోన తెరెకక్కింది. ఎమోషనల్ హారర్ రివేంజ్ డ్రామాగా వచ్చిన ఊరు పేరు భైరవకోన కోర్ పాయింట్ బాగుంది. సినిమాలో ఎమోషనల్, భయపెట్టించే సీన్స్, లవ్ ట్రాక్, రివేంజ్ డ్రామా అంశాలతో కొన్ని చోట్ల చాలా వరకు బాగుంది. ముఖ్యంగా బసవ, భూమికి సంబంధించిన లవ్ అండ్ ఎమోషనల్ ట్రాక్ ఆకట్టుకుంది.
సిల్లీగా అనిపించే సీన్స్
అయితే, కల్పిక కథతో తెరకెక్కిన భైరవకోన అబ్బురపరిచడంలో ఫెయిల్ అయింది. ఒక ఫాంటసీ సినిమాకు కావాల్సిన హైలెట్ అంశాలు చిత్రీకరించడంలో విఫలం అయ్యారు. దెయ్యాలు, ఆత్మల వంటి కాన్సెప్టుతో వచ్చిన తెలుగు ప్రేక్షకులకు రొటీన్ సీన్స్, హారర్ ఎఫెక్ట్స్ రెగ్యులర్‌గా అనిపించడమే కాకుండా బోర్ కొట్టిస్తాయి. హీరోయిన్ మరణం కాస్తా సిల్లీగా అనిపిస్తుంది. కథ, కాన్సెప్ట్ బాగున్నప్పటికీ ప్రేక్షకులను ఎంగేజ్ చేయడంలో సక్సెస్ కాలేదనే చెప్పాలి.
ఫైనల్‌గా చెప్పాలంటే?
హిట్ కోసం పరితపిస్తున్న సందీప్ కిషన్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. లవ్ అండ్ ఎమోషనల్ సీన్లలో ఆకట్టుకున్నాడు. అలాగే వర్ష బొల్లమ్మ కూడా తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. కావ్య థాపర్ తన రోల్ బాగానే చేసింది. వెన్నెల కిశోర్, వైవా హర్ష తమ కామెడీతో నవ్వించారు. సినిమాటోగ్రఫీ, మ్యూజిక్ పర్వాలేదు. ఫైనల్‌గా చెప్పాలంటే సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన మూవీలో ఇంప్రెస్ చేసే అంశాలు ఉన్న పూర్తి స్థాయిలో ఆకట్టుకోలేదనే చెప్పాలి.