Ooru Peru Bhairavakona Twitter Review: ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ.. మరో విరూపాక్ష మూవీ!
Ooru Peru Bhairavakona Movie Twitter Review In Telugu: యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరవకోన. ఇప్పటికే వాలంటైన్స్ డే సందర్భంగా స్పెషల్ ప్రీమియర్స్ పడిన ఈ మూవీ నేడు విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఊరు పేరు భైరవకోన ట్విట్టర్ రివ్యూ చూస్తే..
Ooru Peru Bhairavakona Audience Review: డైరెక్టర్ వీఐ ఆనంద్, హీరో సందీప్ కిషన్ కాంబినేషన్‌లో వస్తోన్న న్యూ మూవీ ఊరు పేరు భైరవ కోన. ఫాంటసీ అడ్వెంచరస్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కిన ఉరు పేరు భైరవకోనను హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా నిర్మించగా.. ఎకె ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర సమర్పించారు. బాలాజీ గుత్తా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఇందులో కావ్య థాపర్, వర్ష బొల్లమ హీరోయన్స్‌గా నటించారు.
ఊరు పేరు భైరవకోన మూవీ శుక్రవారం అంటే ఫిబ్రవరి 16న విడుదల కానుంది. కానీ, ఇదివరకు రెండు రోజుల ముందే వాలంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న ఊరు పేరు భైరవకోన స్పెషల్ ప్రీమియర్ షోలు పడ్డాయి. ఈ ప్రీమియర్ షోస్ చూసిన ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. దీంతో సక్సెస్ మీట్ కూడా నిర్వహించిన ఊరు పేరు భైరవకోన మూవీ టీమ్ ఫిబ్రవరి 16న పెద్ద ఎత్తున సినిమాను విడుదల చేశారు. దీంతో ట్విట్టర్‌లో ఊరు పేరు భైరవకోనపై రివ్యూలు మొదలయ్యాయి.
"ఊరు పేరు భైరవకోన సినిమాను డైరెక్టర్ వీఐ ఆనంద్ బాగా రాసుకుని, బాగా ఎగ్జిగ్యూట్ చేశాడు. ఇంటర్వెల్ సీన్ అదిరిపోయింది. స్టోరీ, మ్యూజిక్, విజువల్స్, కామెడీ సినిమాకు ప్రధాన బలాలు. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సందీప్ కిషన్ అన్నకు కంగ్రాచ్యులేషన్స్. వర్ష బొల్లమ తన నటనతో అందరి మనసులను దొంగలించింది" అని ఒక నెటిజన్ ఊరు పేరు భైరవకోన మూవీపై రివ్యూ ఇచ్చాడు.
"అన్ని అంశాలు కలగలిపిన గుడ్ థ్రిల్లర్ మూవీ ఊరు పేరు భైరోవకోన. రివ్యూస్ ఎందుకు ఇలా ఇస్తున్నారో అర్థం కావట్లేదు. ప్రతి సన్నివేశంలో సందీప్ కిషన్ జీవించేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్లలో. వారి పాత్రల్లో హీరోయిన్స్ చాలా బాగా చేశారు. ఇలాంటి యూనిక్ స్టోరీని చెప్పడంలో, డైరెక్షన్‌లో డైరెక్టర్ వీఐ ఆనంద్ జెమ్ అని చెప్పొచ్చు" అని రాసుకొచ్చిన ఓ నెటిజన్ సినిమాకు 3.25 రేటింగ్ ఇచ్చాడు.
ఊరు పేరు భైరవకోన సినిమా చాలా బాగుంది. సందీప్ కిషన్‌కి ఇది కమ్ బ్యాక్ హిట్ అని చెప్పొచ్చు. సందీప్ కిషన్ చాలా బాగా నటించాడు. ఇది అతనికి ఒక బెస్ట్ మూవీ. లవ్ స్టోరీ అనుకున్నాం కానీ, హర్రర్ ప్లస్ లవ్ స్టోరీ. సందీప్ కిషన్‌కు మంచి హిట్ అని ఆడియెన్స్ చెబుతున్నారు. మరికొంతమంది విరూపాక్ష మూవీ తరహాలో సినిమా ఉందని అంటున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ చాలా సినిమాల్లో చూసినట్లు ఉందని, ఎండ్‌లో ట్విస్ట్‌లు అదిరిపోయాయని అంటున్నారు.