Easter eggs: ఈస్టర్ ఎగ్స్ అంటే ఏంటి? ఆరోజు రంగు రంగుల గుడ్లు ఎందుకు ఉపయోగిస్తారు?-what is the meaning of easter eggs why its use in easter festival ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Easter Eggs: ఈస్టర్ ఎగ్స్ అంటే ఏంటి? ఆరోజు రంగు రంగుల గుడ్లు ఎందుకు ఉపయోగిస్తారు?

Easter eggs: ఈస్టర్ ఎగ్స్ అంటే ఏంటి? ఆరోజు రంగు రంగుల గుడ్లు ఎందుకు ఉపయోగిస్తారు?

Gunti Soundarya HT Telugu
Mar 31, 2024 06:00 AM IST

Easter eggs: అనేక దేశాలలో ఈస్టర్ ఎగ్స్ విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్నాయి. ఈస్టర్ ఎగ్స్ తో రకరకాల ఆటలు ఆడుతూ ఉంటారు. అసలు ఈ ఈస్టర్ ఎగ్స్ అంటే ఏంటి? ఈ సంప్రదాయం ఎప్పటి నుంచి వచ్చిందో తెలుసుకుందాం.

ఈస్టర్ ఎగ్స్ అంటే ఏంటి?
ఈస్టర్ ఎగ్స్ అంటే ఏంటి? (pixabay)

Easter eggs: లోక రక్షకుడైన యేసు శిలువ వేసిన రోజుని గుడ్ ఫ్రైడే గా జరుపుకుంటారు. ఆయన మరణాన్ని జయించి తిరిగి లేచిన రోజున పునరుత్థాన పండుగ అంటారు. దీన్ని ఈస్టర్ అంటారు. ఈస్టర్ అనే పదం వసంత రుతువు ప్రారంభాన్ని సూచించే జర్మన్ భాషా పదం. ఈస్టర్ అనేది నూతన జీవితానికి ఒక గుర్తుగా భావిస్తారు. మానవులు చేసే పాపాలను కల్వరి కొండ వరకు మోసుకొని పోయి శిలువ మీద శ్రమ నొంది తనని తాను బలిగా అర్పించుకుని మూడోవ దినాన సజీవుడిగా వచ్చాడు. రెండవ శతాబ్దం నుంచి క్రైస్తవ సంఘం ఈస్టర్ ని పాటిస్తుందని చరిత్రకారులు చెబుతున్నారు.

ఈస్టర్ ఎగ్స్ అంటే ఏంటి?

ఈస్టర్ సందర్భంగా వివిధ దేశాలలో కోడిగుడ్లను రకరకాల రంగులతో అలంకరించి పెడతారు. చూసేందుకు ఎంతో ఆకర్షణీయంగా ఈ కోడిగుడ్లు ఉంటాయి. ఈస్ట్ అనే పదం ఈస్టర్ వచ్చిందని కొందరు చెబుతారు. పురాతన కాలంలో ఐరోప, మధ్య ప్రాచీ దేశాల్లో వసంతకాలం సమయంలో ఈ పండుగ జరుపుకుంటారు. పిల్లలు కలగాలని కోరుకుంటూ ఈ ఈస్టర్ ఎగ్స్ ఒకరికొకరు ఇచ్చుకుంటారు. పునరుత్పత్తికి వీటిని చిహ్నంగా భావిస్తారు.

ఈస్టర్ కుందేలు తీసుకొచ్చిన ఈస్టర్ గుడ్లు కోసం వెతకడం అనేది అక్కడ ఆచరించే సంప్రదాయం. దీన్ని కేవలం చిన్నపిల్లల సరదాగా ఆడుకునే ఆటగా మాత్రమే పరిగణించరు. సంతాన ప్రాప్తి కోసం చేసే ఆచారంగా భావిస్తారు. గుడ్డు దొరికితే సంతోషం, సిరిసంపదలు, మంచి ఆరోగ్యం, రక్షణ తీసుకొస్తుందని నమ్ముతారు.

ఈస్టర్ ఎగ్స్ తినడం వల్ల అనేక రోగాల నుంచి విముక్తి కలుగుతుందని విశ్వసిస్తారు. కొంతమంది క్రైస్తవులు ప్రభువైన యేసు క్రీస్తు సమాధి నుంచి పునరుత్థానుడిగా తిరిగి లేచిన దానికి చిహ్నంగా ఈ ఈస్టర్ భావిస్తారు. శిలువ మీద ఆయన కార్చిన రక్తానికి గుర్తుగా ఎగ్స్ మీద ఎరుపు రంగు వేస్తారు. 

ఈస్టర్ ఎగ్స్ అందుకే తింటారు 

క్రైస్తవులు ఎక్కువగా ఉండే దేశాల్లో ఈస్టర్ ఎగ్స్ తో రకరకాల ఆటలు ఆడతారు. తల్లిదండ్రులు ఈస్టర్ గుడ్లు దాచిపెట్టగా పిల్లలు వాటిని వెతికి తీసుకురావడంతో ఈ ఆట చాలా సంతోషంగా సాగుతుంది. 

ఈస్టర్ కోసం గుడ్లను అలంకరించడం అనేది 13 వ శతాబ్దం నాటి సాంప్రదాయం. గతంలో లెంట్ సమయంలో గుడ్లు తినడం నిషేధం. మాంసాహారంతో పాటు పాలు, పాల ఉత్పత్తులు, గుడ్లు కూడా తీసుకునే వాళ్ళు కాదు. ప్రజలు ఉపవాసం ముగింపును సూచించేందుకు గుడ్లను పెయింటింగ్ చేసి అలంకరిస్తారు. వాటిని ఈస్టర్ రోజు తింటారు.

గుడ్డు కొత్త జీవితానికి చిహ్నంగా ఉంటుందని అందరూ నమ్ముతారు. ఇది పునరుత్పత్తికి చిహ్నం. మొదటగా కోడిగుడ్లకు బదులు ఆస్ట్రిచ్ గుడ్లు ఈస్టర్ గుడ్లుగా ఉపయోగించేవారు. ఈ ఆచారం పురాతన కాలం నాటి నుంచి వస్తుంది.  అయితే ఈ  సంప్రదాయాన్ని మొదటగా మెసపటోమియా కి చెందిన క్రైస్తవులు పాటించారు.  క్రీస్తు సిలువలో కార్చిన రక్తాన్ని స్మరించుకుంటూ తమ గుడ్లకు ఎరుపు రంగు వేసేవారు. అది క్రమేపీ ఇతర రంగులతో కూడా మారిపోయింది. చిన్న చిన్న చెట్ల కొమ్మలను ఈస్టర్ గుడ్డు చెట్లుగా అలంకరించడం 1990 నుండి యునైటెడ్ స్టేట్స్ లో ఒక ప్రసిద్ధ ఆచారంగా మారింది. 

ఈస్టర్ రోజు అనేక ప్రాంతాల్లో ఈస్టర్ ఎగ్స్ తో సరదాగా ఉండే ఆటలు ఆడతారు. గుడ్లు మాత్రమే కాకుండా ఈస్టర్ బన్నీస్(కుందేలు), బేబీ కోడి పిల్లలు, లిల్లీ పువ్వులు కూడా పునర్జన్మకు చిహ్నాలుగా భావిస్తారు. కుందేలుకు ప్రాధాన్యత ఇవ్వడానికి కారణం అవి వేగంగా పునరుత్పత్తి చేస్తాయని అంటారు. ఈ ఈస్టర్ ఎగ్స్ దొరికితే సంతానం ప్రాప్తి పొందుతారని నమ్ముతారు. 

 

టాపిక్