Retro Walking Benefits : రెట్రో వాకింగ్​తో బరువు తగ్గొచ్చు.. మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు..-what is retro walking 5 unexpected retro walking benefits for health ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Retro Walking Benefits : రెట్రో వాకింగ్​తో బరువు తగ్గొచ్చు.. మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు..

Retro Walking Benefits : రెట్రో వాకింగ్​తో బరువు తగ్గొచ్చు.. మోకాళ్ల నొప్పులు తగ్గించుకోవచ్చు..

Geddam Vijaya Madhuri HT Telugu
Dec 03, 2022 09:15 AM IST

Retro Walking Health Benefits : రెట్రోవాకింగ్ గురించి చెప్పాలంటే.. ఓ రకంగా రివర్స్ వాకింగ్ అని చెప్పవచ్చు. రెట్రోవాకింగ్​లో అడుగు వెనుక మరో అడుగు వేస్తూ.. వెనక్కి నడుస్తారు. అయితే దీనివల్ల చాలా మంచి ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయని అంటున్నారు నిపుణులు. అవేంటో మీరు తెలుసుకుని.. రెట్రో వాకింగ్ చేసేయండి.

రెట్రో వాకింగ్ బెనిఫిట్స్
రెట్రో వాకింగ్ బెనిఫిట్స్

Retro Walking Health Benefits : రెట్రో వాకింగ్ వల్ల ఊహించని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు నిపుణులు. రివర్స్ వాకింగ్ బ్యాలెన్స్, ప్రొప్రియోసెప్షన్‌ను మెరుగుపరుస్తుందని అంతేకాకుండా మరెన్నో అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తుందని చెప్తున్నారు.

రెట్రో-వాకింగ్ అంటే ఒక అడుగు వెనుక మరొక అడుగు వేయండి. నిజం చెప్పాలంటే వెనుకకు నడవడం. మీరు రెట్రో వాక్ చేస్తున్నప్పుడు ఇతరులు చూస్తారని.. మీకు ఇబ్బందిగా ఉంటుందని ఫీల్ అవ్వకండి. దాని ప్రయోజనాలు తెలిస్తే.. వాళ్లు కూడా మీతో అడుగు వెనక్కి వేస్తారు. మరి రెట్రో-వాకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

సమన్వయం మెరుగుపడుతుంది..

రివర్స్ వాకింగ్‌లో మీరు మీ సాధారణ కదలికకు వ్యతిరేకంగా వెళ్లాలి. అంటే మీ శరీరానికి మెరుగైన సమన్వయం, బ్యాలెన్స్ అవసరం. మీరు వెనుక చూడకుండా.. నడుస్తూ ఉండడం వల్ల మీ శరీరంపై, చుట్టూ ఉన్న పరిస్థితులపై అవగాహన ఏర్పడుతుంది. మీ మనస్సు మిమ్మల్ని మెరుగ్గా నడిపించడంపై దృష్టి కేంద్రీకరిస్తుంది. ఇది కూడా ఒకరకమైన యోగా అనుకోవచ్చు.

ఇది మీ మనసు, శరీర సమన్వయాన్ని మెరుగుపరుస్తుంది. ఒత్తిడిని తగ్గిస్తుంది. మీ అవయవాలు, శరీరాన్ని ఇంకా మెరుగ్గా అర్థం చేసుకోవడంలో మీకు సహాయపడుతుంది.

మోకాళ్లపై ఒత్తిడి తగ్గిస్తుంది..

మీ మోకాళ్లలో ఆస్టియో ఆర్థరైటిస్ ఉన్న రోగులకు.. మోకాల నొప్పులు ఉన్నవారికి రెట్రో వాక్ మంచి ఉపశమనం అందిస్తుంది. బ్యాక్‌వర్డ్ లోకోమోషన్ నొప్పిని తగ్గించడానికి, కాలు బలాన్ని మెరుగుపరచడానికి ప్రయోజనకరంగా ఉంటుంది. రివర్స్ వాకింగ్ లేదా బ్యాక్‌వర్డ్ రన్నింగ్.. మోకాలి నొప్పిని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు కనుగొన్నాయి.

మీరు వెనుకకు నడిచినప్పుడు.. మీ క్వాడ్రిస్ప్స్ కార్యాచరణ తగ్గిపోతుంది. ఫలితంగా.. మోకాలి కీలు తక్కువ ఒత్తిడిని తీసుకుంటుంది. దీనివల్ల మోకాలి నొప్పి తీవ్రత తగ్గుతుంది.

ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది..

అవును రెట్రో వాకింగ్ ఎక్కువ కేలరీలను బర్న్ చేస్తుంది. దీనివల్ల మీరు త్వరగా బరువు తగ్గుతారు. ముందుకు నడవడం కంటే వెనుకకు నడవడం వల్ల నిమిషానికి 40% ఎక్కువ కేలరీలు ఖర్చవుతాయి. మీరు బరువు తగ్గాలనుకుంటే.. కచ్చితంగా దీనిని పాటించండి.

3.5 mph వద్ద చురుకైన సాధారణ నడక.. దాదాపు 4.3 METలు (జీవక్రియ సమానమైనవి).. అదే వేగంతో వెనుకకు నడవడం 6.0 METలు అని ఫిజికల్ యాక్టివిటీస్ సంగ్రహం పేర్కొంది. METలు ఎంత ఎక్కువగా ఉంటే.. మీ కేలరీల వ్యయం అంత ఎక్కువగా ఉంటుంది.

కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌ని మెరుగుపరుస్తుంది..

ముందుకు వెళ్లడం కంటే రివర్స్‌లో కదలడం వల్ల మీ గుండె వేగంగా పంపింగ్ అవుతుంది. కాబట్టి మీరు కార్డియో ఫిక్స్, జీవక్రియ బూస్ట్, తక్కువ వ్యవధిలో ఎక్కువ కేలరీలు బర్న్ చేస్తారని అర్థం.

వెనుకకు నడిచినా లేదా పరుగెత్తినా.. అది కార్డియోస్పిరేటరీ ఫిట్‌నెస్‌ను మెరుగుపరుస్తుంది. ఇది మీ శరీరంలో గణనీయమైన మార్పులు తీసుకువస్తుందని.. అధ్యయనం ధృవీకరించింది.

కాళ్లను స్ట్రాంగ్ చేస్తుంది..

మీ తక్కువ శ్రమతో.. కాలి కండరాలను బలోపేతం చేయాలి అనుకుంటే.. ఇది అత్యంత ప్రభావవంతమైనది. మీరు రెట్రో వాకింగ్ చేసినప్పుడు.. మీ క్వాడ్రిస్ప్స్‌కు విరుద్ధంగా మీ హామ్ స్ట్రింగ్‌లను వంచుతుంది. చాలా మంది కాళ్లు చాలా వీక్​గా ఉన్నాయని బాధపడుతూ ఉంటారు. అలాంటివారికి రెట్రో వాకింగ్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.

Whats_app_banner

సంబంధిత కథనం