Walking Pneumonia Symptoms : వాకింగ్ న్యుమోనియా గురించి మీకు తెలుసా? రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..-walking pneumonia symptoms and treatments for winter ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Walking Pneumonia Symptoms : వాకింగ్ న్యుమోనియా గురించి మీకు తెలుసా? రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Walking Pneumonia Symptoms : వాకింగ్ న్యుమోనియా గురించి మీకు తెలుసా? రాకుండా ఈ జాగ్రత్తలు తీసుకోండి..

Geddam Vijaya Madhuri HT Telugu
Nov 12, 2022 04:04 PM IST

Walking Pneumonia Symptoms : సీజన్ మారడం వల్ల జలుబు, దగ్గు వంటి సమస్యలు వస్తూనే ఉంటాయి. అలానే వాకింగ్ న్యుమోనియా కూడా ఒకటి. ఇదేంటి కొత్తగా ఉంది అనుకుంటున్నారా? కొత్తదేమి కాదు కానీ దీని గురించి ఎక్కువమందికి తెలియకపోవడం వల్ల ఆ సమస్య ఇదేనని గుర్తించరు.

వాకింగ్ న్యుమోనియా లక్షణాలు
వాకింగ్ న్యుమోనియా లక్షణాలు

Walking Pneumonia Symptoms : వాకింగ్ న్యుమోనియా అనేది తీవ్రమైన వ్యాధి ఏమి కాదు. ఇది చాలా తక్కువ మోతాదులో శరీరంపై దద్దుర్లతో ప్రారంభం అవుతుంది. వాకింగ్ న్యుమోనియా వివిధ లక్షణాలతో ఉంటుంది. అనారోగ్యంతో ఉన్న రోగుల తుమ్ములు, దగ్గుల నుంచి ఇది వ్యాపిస్తుంది. ఇది మీ శరీరాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే.

కొవిడ్ లేదా మశూచి నుంచి కోలుకున్న రోగులు.. న్యుమోనియా పట్ల ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. అసలు ఈ వాకింగ్ న్యుమోనియా అంటే ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాధి గురించి జాగ్రత్తగా ఉండాలంటే, దాని లక్షణాలను తెలుసుకోవాలి అంటున్నారు.

వాకింగ్ న్యుమోనియా లక్షణాలు

ఛాతీ నొప్పి, తుమ్ములు, దగ్గు, తలనొప్పి, అలసట.. ఇవన్నీ వాకింగ్ న్యుమోనియా లక్షణాలే. అలాగే చలి, జ్వరం, గొంతు నొప్పి అన్నీ వాకింగ్ న్యుమోనియాకు విభిన్న లక్షణాలు.

ఈ వ్యాధి ఎలా ఉంటుంది?

ఈ వ్యాధి బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా వైరస్‌ల నుంచి వ్యాపిస్తుంది. కాబట్టి దగ్గర్లో ఉన్నవారు ఎవరైనా తుమ్మినా లేదా దగ్గినా జాగ్రత్తగా ఉండండి. మీ ముఖాన్ని ముసుగు లేదా రుమాలుతో కవర్ చేయండి. మీరు జాగ్రత్తలు తీసుకుంటే వాకింగ్ న్యుమోనియా సులభంగా శరీరంలోకి ప్రవేశించదు.

వాకింగ్ న్యుమోనియాకు చికిత్స

న్యుమోనియా చికిత్సకు అనేక రకాల యాంటీబయాటిక్స్ ఉంటాయి. అయితే వాటితో పాటు నీరు ఎక్కువగా తాగితే ఈ వ్యాధిని సులువుగా అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు.

Whats_app_banner

సంబంధిత కథనం