Canada covid rules : కెనడా వెళుతున్నారా? కొత్త కొవిడ్ ‘రూల్స్’ తెలుసుకోండి..
Canada covid rules latest news : విదేశాల నుంచి కెనడాకు వస్తున్న వారి కోసం కొవిడ్ రూల్స్‌లో భారీ మార్పులు చేసింది అక్కడి ప్రభుత్వం. టీకాలు అవసరం లేదని, విమానాల్లో మాస్కులు వేసుకోవాల్సిన పనిలేదని స్పష్టం చేసింది.
Canada covid rules : విదేశీ పర్యటకుల కోసం ప్రస్తుతం అమల్లో ఉన్న కొవిడ్ రూల్స్‌కి గుడ్ బై చెప్పేసింది కెనడా! ప్రయాణికులు కచ్చితంగా కొవిడ్ టీకాలు తీసుకోవాల్సిన అవసరం లేదని వెల్లడించింది. అంతేకాకుండా.. విమానాల్లో మాస్కులు ధరించాలన్న నియమానికి కూడా కెనడా ప్రభుత్వం స్వస్తి పలికేసింది. ఈ కొత్త కొవిడ్ రూల్స్ అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి.
"లక్షలాది మంది కెనడా వాసులు టీకాలు తీసుకున్నారు. వారి మద్దతుతోనే ఈ రూల్స్‌ని తీసుకొస్తున్నాము. దేశంలో వ్యాక్సినేషన్ రేటు ఎక్కువగా ఉంది. హాస్పిటాలిటీ రేటు, మరణాల రేటు తక్కువగా ఉంది. బూస్టర్ల సంఖ్య కూడా అధికంగానే ఉంది. దేశంలో ఒమిక్రాన్ తీవ్రత కూడా తగ్గుముఖం పట్టడం కూడా మరో కారణం," అని ఓ ప్రకటన విడుదల చేసింది ప్రభుత్వం.
Canada new covid rules for foreigners : ప్రస్తుతం.. టీకాలు తీసుకోని వారు.. ఎయిర్‌పోర్టులో పరీక్షలు చేయించుకోవడంతో పాటు 14రోజుల క్వారంటైన్లో ఉండాల్సి వస్తోంది.
ఇక తాజా రూల్స్ అమల్లోకి వస్తే.. విమానాశ్రాల్లో కొవిడ్ టెస్టింగ్‌లు కూడా ఉండవు. అరైవ్కాన్ అనే యాప్‌లో సమాచారాన్ని చెప్పాల్సిన పని కూడా ఉండదు. యాప్ సరిగ్గా పనిచేయడం లేదని, విమానాలు ఆలస్యమవుతున్నాయని ఆరోపణలు వెలువడుతున్న నేపథ్యంలో.. ఈ యాప్‌ను కూడా ప్రభుత్వం పక్కన పెట్టేసింది.
Canada covid rules latest news : ఇక ఓడల్లో ప్రయాణించి కెనడాకు వస్తున్న వారికి.. కొవిడ్ టెస్టుల ఫలితాలు ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెప్పింది.
కెనడాలో ఇటీవల ఉద్యోగ అవకాశాలు భారీగా పెరిగాయి. ఫలితంగా ఆ దేశానికి వెళ్లేందుకు భారత్‌తో సహా అనేక మంది దేశస్థులు సన్నద్ధమవుతున్నారు. కొత్త కొవిడ్ రూల్స్ గురించి వారు తెలుసుకోవడం ఎంతో అవసరం.
అమెరికా మాత్రం..
US covid mandate : ఈ తరహా నిబంధనలు ప్రస్తుతం బ్రిటన్‌లో అమల్లో ఉన్నాయి. బ్రిటన్‌కు వెళుతున్న వారు.. టీకాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. టెస్టులు చేయించుకోవాల్సిన పని లేదు.
కానీ అమెరికాలో మాత్రం టీకాలు, టెస్టులు కచ్చితంగా ఉండాలి. విదేశాల నుంచి వచ్చిన వారు టీకాలు తీసుకుని ఉండాలన్న నిబంధన అమెరికాలో ఇంకా కొనసాగుతోంది. దీనిని ఇప్పట్లో తొలగించే సూచనలు కనిపించడం లేదు.
సంబంధిత కథనం