Canada job vacancies : కెనడాలో ఉద్యోగాలే.. ఉద్యోగాలు- భారతీయులకు మంచి ఛాన్స్!
Canada job vacancies : కెనడాలో జాబ్ వేకెన్సీలు నెల నెలకు విపరీతంగా పెరుగుతున్నాయి. ఫలితంగా భారతీయులకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాయి!
Canada job vacancies : కెనడాలో ప్రస్తుతం ఉద్యోగాల జాతర నడుస్తున్నట్టు కనిపిస్తోంది! ఆ దేశంలో జాబ్ వేకెన్సీ.. నెల నెలా పెరుగుతూ పోతోంది. తాజాగా.. జూన్‌కు సంబంధించిన కెనడా జాబ్ వేకెన్సీ డేటా విడుదలైంది. జూన్ నెలలో అది 3.2శాతం పెరింది. మే నెలతో పోల్చుకుంటే.. కెనడాలో ఉద్యోగ ఖాళీలు 32,200 పెరిగాయి.
భారతీయులు.. ఉద్యోగాల కోసం వివిధ దేశాలను పరిశీలిస్తూ ఉంటారు. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో మంచి ఉద్యోగాలు లభిస్తుంటాయి. అయితే.. ఇటీవలి కాలం కెనడాకు కూడా మంచి డిమాండ్ పెరుగుతోంది. అక్కడ అవసరాలకు తగ్గట్టు మ్యాన్‌పవర్ లేకపోవడం కూడా కలిసి వచ్చే విషయం. అందువల్ల.. కెనడాలో ఉద్యోగాలు.. భారతీయులకు మంచి అవకాశం అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తం మీద.. జూన్ నెలకు.. కెనడాలో జాబ్ వేకెన్సీ రేటు 5.9శాతానికి పెరిగింది. గతేడాది ఇదే జూన్‌తో పోల్చుకుంటే.. ఇది 1శాతం ఎక్కువగా ఉంది.
కెనడా జాబ్ వేకెన్సీ.. ఈ రంగాల్లో ఎక్కువగా!
Canada jobs for Indians : తాజా గణాంకాల ప్రకారం.. హెల్త్ కేర్- సోషల్ అసిస్టెన్స్ రంగాల్లో అధికంగా ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి. గతేడాది జూన్‌తో పోల్చుకుంటే.. ఈ రంగంలో జాబ్ వేకెన్సీ 40.8శాతం పెరిగింది. మొత్తం మీద ఈ రంగంలో 1,49,700 ఖాళీలు ఉన్నాయి.
అకామడేషన్, ఫుడ్ సెక్టార్లో 1,71,700 జాబ్ వేకెన్సీలు ఉన్నాయి.
రీటైల్ ట్రేడ్ సెక్టార్లో.. ఈ ఏడాది మేతో పోల్చుకుంటే జూన్‌లో 15,200 ఖాళీలు పెరిగాయి. అంటే.. ఈ రంగంలో 15.3శాతం ఉద్యోగ అవకాశాలు ఉన్నట్టు. మొత్తం మీద ఈ రంగంలో 1,14,400 జాబ్ వేకెన్సీలు ఉన్నాయి.
జూన్‌లో కెనడా జాబ్ వేకెన్సీలు..
- నిర్మాణం:- 89,200 జాబ్ వేకెన్సీలు.
- మేన్యుఫ్యాక్చరింగ్:- 82,800 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
- List of Canada job vacancies : ప్రొఫెషనల్, సైన్స్, టెక్నికల్ సర్వీసెస్- 72,200 జాబ్ వేకెన్సీలు.
- ట్రాన్స్‌పోర్టేషన్ అండ్ వేర్‌హౌజింగ్:- 49,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
- ఫైనాన్స్ అండ్ ఇన్ష్యూరెన్స్:- 41,200 జాబ్ వేకెన్సీలు.
Canada Immigration news : జూన్ నెలలో.. కెనడాలో నిరుద్యోగులు- జాబ్ వేకెన్సీ రేటు మరింత పడిపోయింది. తాజా డేటా ప్రకారం.. కెనడాలో ప్రతీ ఉద్యోగానికి కేవలం ఒక నిరుద్యోగ వ్యక్తి మాత్రమే ఉండటం గమనార్హం.
ఉద్యోగాల ఖాళీలు విపరీతంగా ఉండటంతో.. ఇమ్మిగ్రేషన్‌పై కెనడా ఆశలు పెట్టుకుంది. తమ దేశంలోకి వచ్చే వారికి పీఆర్ ఇస్తామంటూ చెబుతోంది. 2022-2024 మధ్యలో 4,30,000- 4,50,000 పీఆర్లు ఆమోదిస్తామని అక్కడి ప్రభుత్వం ప్రకటించింది.
కెనడాలో పరిస్థితి ఇలా..
కెనడాలో పరిస్థితి ఇతర దేశాలతో పోల్చుకుంటే భిన్నంగా ఉంది. అక్కడ చాలా మంది పని చేయడానికి ఇష్టపడటం లేదు! అదే సమయంలో 55ఏళ్లు పైబడిన వారు.. తొందరగా రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తున్నారు. ఓ సర్వే ప్రకారం.. 1946-1964లో జన్మించిన వారిలో.. దాదాపు 90లక్షలకుపైగా మంది ఈ దశాబ్దంలో రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
Canada jobs : కెనడాలో జనాభా కూడా తగ్గుముఖం పడుతోంది! 2020లో.. సంతానోత్పతి రేటు.. అత్యంత కనిష్ఠానికి చేరింది. ఓ మహిళకు సగటున 1.4మంది పిల్లలు పుడుతున్నారు.
ఈ పరిణామాలతో కెనడాలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయులకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాయి.
సంబంధిత కథనం