Job Vacancies : కెనడాలో 10 లక్షలకుపైగా ఉద్యోగాలు.. భారతీయులకు సువర్ణావకాశం!
Job Vacancies : కెనడాలో ఉద్యోగావకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. భారతీయులకు ఇదొక సువర్ణావకాశం!
Canada Job Vacancies : ఇతర దేశాలకు వెళ్లి, ఉద్యోగాలు సంపాదించి అక్కడే స్థిరపడాలి అని అనుకుంటున్న భారతీయులకు సువర్ణావకాశం! కెనడాలో ఇప్పటికే 10లక్షలకుపైగా ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. 2021 మే(3లక్షలు)తో పోల్చుకుంటే.. ఈ సంఖ్య మూడు రెట్లు ఎక్కువగా ఉండటం విశేషం.
మే 2022 వరకు దేశంలో ఉన్న పోస్టుల ఖాళీలపై ఓ సర్వే జరిగింది. సర్వే ప్రకారం.. దేశంలో పరిశ్రమలు పెరుగుతున్నాయి. ఉద్యోగుల అవసరం ఎక్కువగా ఉంది. పైగా.. దేశంలో నిరుద్యోగుల రేటు కూడా తక్కువగా ఉంది. అక్కడ పనిచేసే వారిలో చాలా మంది రిటైర్మెంట్ దశకు చేరుకుంటుండటంతో.. విదేశీయులకు డిమాండ్ పెరుగుతోంది. ఫలితంగా కెనడాలో జాబ్ వేకెన్సీ రేటు చాలా ఎక్కువగా ఉంది.
దేశ చరిత్రలోనే ఎన్నడూ లేనంతగా.. 2022లో పీఆర్(పర్మనెంట్ రెసిడెంట్స్)లను స్వాగతించేందుకు కెనడా సన్నద్ధమవుతోంది. 2022లో 4.3లక్షల పీఆర్‌లను మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. 2024 నాటికి ఆ సంఖ్యను 4.5లక్షలు దాటించాలని భావిస్తోంది.
Jobs in Canada : నిరుద్యోగం రేటు తక్కువగా ఉండటంతో ఇమ్మిగ్రేషన్ ద్వారా కెనడాకు వెళ్లిన వారికి ఉద్యోగాలు దొరికే అవకాశం కాస్త ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల.. కెనడాలో పీఆర్ అప్లై చేసుకునేందుకు, ఉద్యోగం సంపాదించుకునేందుకు ఇదొక సువర్ణావకాశం.
చాలా రాష్ట్రాల్లో ఎన్నడు లేని విధంగా ఉద్యోగాల ఖాళీలు ఉన్నట్టు మరో సర్వే పేర్కొంది.
ఆల్బర్ట, ఒంటారియోలో ఏప్రిల్ నాటికి.. ఒక్కో ఖాళీకి సగటు 1.1 మంది పోటీపడుతున్నారు. మార్చ్‌లో అది 1.2గా ఉండేది. ఇక గతేడాది అది 2.4గా ఉండటం గమనార్హం.
న్యూఫౌండ్‌ల్యాండ్, లబ్రెడోర్ వంటి ప్రాంతాల్లో.. ఒక్కో పోస్టుకు సగటున నలుగురు పోటీ పడుతున్నారు. భారత దేశంలో.. ఒక్కో పోస్టు కోసం పోటీ పడే వారి సంఖ్య వేలల్లో, లక్షల్లో ఉంటున్న విషయం తెలిసిందే!
ప్రొఫెషనల్స్, సైంటిఫిక్, టెక్నికల్ సర్వీసెస్, రవాణా, ఫైనాన్స్, బీమా, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో పోస్టులు ఎక్కువగా ఖాళీగా ఉన్నాయి.
రిటైర్మెంట్..
Canada jobs for Indians : కెనడాలో పరిస్థితి ఇతర దేశాలతో పోల్చుకుంటే భిన్నంగా ఉంది. అక్కడ చాలా మంది పని చేయడానికి ఇష్టపడటం లేదు! అదే సమయంలో 55ఏళ్లు పైబడిన వారు.. తొందరగా రిటైర్మెంట్ తీసుకోవాలని చూస్తున్నారు. ఓ సర్వే ప్రకారం.. 1946-1964లో జన్మించిన వారిలో.. దాదాపు 90లక్షలకుపైగా మంది ఈ దశాబ్దంలో రిటైర్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు.
కెనడాలో జనాభా కూడా తగ్గుముఖం పడుతోంది! 2020లో.. సంతానోత్పతి రేటు.. అత్యంత కనిష్ఠానికి చేరింది. ఓ మహిళకు సగటున 1.4మంది పిల్లలు పుడుతున్నారు.
ఈ పరిణామాలతో కెనడాలో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. విదేశీయులకు మంచి అవకాశాన్ని ఇస్తున్నాయి.
సంబంధిత కథనం