India issues advisory to Indians in Canada| కెనడాలోని భారతీయులకు హెచ్చరిక-india issues advisory over sharp increase in hate crimes anti india activities in canada ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  India Issues Advisory To Indians In Canada| కెనడాలోని భారతీయులకు హెచ్చరిక

India issues advisory to Indians in Canada| కెనడాలోని భారతీయులకు హెచ్చరిక

HT Telugu Desk HT Telugu
Sep 23, 2022 10:34 PM IST

India issues advisory to Indians in Canada| విద్వేష నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కెనడాలో నివసిస్తున్న భారతీయులకు భారత ప్రభుత్వం సూచించింది.

ప్రతీకాత్మక చిత్రం
ప్రతీకాత్మక చిత్రం

India issues advisory to Indians in Canada| కెనడాలో నివసిస్తున్న భారతీయులకు, కెనడా వెళ్తున్న భారత పర్యటకులకు భారత విదేశాంగ శాఖ ఒక అడ్వైజరీని జారీ చేసింది. దేశంలో భారతీయులపై విద్వేష నేరాలు పెరుగుతున్నాయని, భారత వ్యతిరేక కార్యక్రమాలు పెరుగుతున్నాయని, అందువల్ల జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

India issues advisory to Indians in Canada| జాగ్రత్త..

కెనడాలో భారతీయులపై జరుగుతున్న దాడుల విషయాన్ని కెనడా ప్రభుత్వం ద‌ృష్టికి తీసుకువెళ్లామని భారత విదేశాంగ శాఖ వివరించింది. కెనడాలోని భారత దౌత్యాధికారులు కెనడా అధికారులతో కాంటాక్ట్ లో ఉన్నారని, ఈ నేరాలను సీరియస్ గా తీసుకోవాలని, దోషులకు సాధ్యమైనంత త్వరగా శిక్షపడేలా చూడాలని కోరామని తెలిపింది.

India issues advisory to Indians in Canada| విద్యార్థులు జాగ్రత్త..

కెనడాలోని భారత పౌరులు, అక్కడి విద్యా సంస్థల్లో చదువుకుటున్న భారతీయ విద్యార్థులు, కెనడా పర్యటనకు వెళ్లిన భారతీయులు జాగ్రత్తగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ముఖ్యంగా కెనడా వర్సిటీల్లో చదువుకుంటున్న విద్యార్థులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, అనవసర వివాదాల్లో తలదూర్చవద్దని సూచించింది. భారతీయ విద్యార్థులంతా ఒట్టావా, టొరంటో లేదా వాంకోవర్ ల లోని భారతీయ హై కమిషన్ కార్యాలయాల అధికారిక వెబ్ సైట్ల ద్వారా రిజిస్టర్ చేసుకోవాలని కోరింది. లేదా madad.gov.in వెబ్ సైట్ ద్వారా కూడా రిజిస్టర్ చేసుకోవచ్చని తెలిపింది. అలా, రిజిస్టర్ చేసుకోవడం వల్ల ఎమర్జెన్సీ పరిస్థితుల్లో త్వరగా కాంటాక్ట్ చేయడానికి వీలవుతుందని వెల్లడించింది.

India issues advisory to Indians in Canada| ఖలిస్తానీ రెఫరెండం

కెనడాలో ప్రారంభమైన ఖలిస్తానీ రెఫరెండం కార్యక్రమంపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అది తమకు ఆమోదనీయం కాదని, దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని స్పష్టం చేసింది. రాజకీయ ప్రేరేపిత కార్యక్రమాలు భారత్ కు మిత్ర దేశమైన కెనడాలో జరగడం సరికాదని పేర్కొంది. ఈ విషయాన్ని భారత ప్రభుత్వం కెనడా ప్రభుత్వ దృష్టికి కూడా తీసుకువెళ్లింది.

IPL_Entry_Point