Vitamin B12 deficiency: విటమిన్ బీ12 లోపంతో ఈ 4 వ్యాధులు-vitamin b12 deficiency 4 illnesses that can be caused due to low vitamin b12 ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  Lifestyle  /  Vitamin B12 Deficiency 4 Illnesses That Can Be Caused Due To Low Vitamin B12

Vitamin B12 deficiency: విటమిన్ బీ12 లోపంతో ఈ 4 వ్యాధులు

HT Telugu Desk HT Telugu
Nov 29, 2022 01:47 PM IST

Vitamin B12 deficiency: విటమిన్ బీ12 లోపంతో తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.

Vitamin B12 deficiency: వీగన్స్ అయితే పాల ఉత్పత్తులను విస్మరించొద్దు
Vitamin B12 deficiency: వీగన్స్ అయితే పాల ఉత్పత్తులను విస్మరించొద్దు (Unsplash)

విటమిన్ బీ12 లోపం శారీరకంగా, మానసికంగా, అలాగే నాడీ వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఆరోగ్యకరమైన ఎర్రరక్తకణాలు, నాడీ కణాలు, డీఎన్‌ఏ కోసం విటమిన్ బీ12 తప్పనిసరి. ఇది ప్రధానంగా జంతు ఉత్పత్తుల్లో లభిస్తుంది. మాంసం, పాల ఉత్పత్తులు, గుడ్లలో లభిస్తుంది. విటమిన్ బీ 12 లోపాన్ని నివారించేందుకు వెజిటేరియన్లయితే విటమిన్ బీ12 ఫార్టిఫైడ్ ఫుడ్ లేదా సప్లిమెంట్లపై ఆధారపడాల్సి ఉంటుంది. ముఖ్యంగా సీనియర్ సిటిజెన్లలో విటమిన్ బీ 12 లోపం ఎక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ విటమిన్ లోపం లేకుండా జాగ్రత్త పడాలి.

‘విటమిన్ బీ12 లోపం ఈ రోజుల్లో సాధారణమైపోయింది. చాలా మంది పాల ఉత్పత్తులకు దూరమవుతున్నారు. అలాగే శాఖాహారానికి పరిమితమవుతున్నారు. మన దేశంలో ఈ ట్రెండ్ ఎక్కువగా ఉంది. మాంసం, చేపలు, గుడ్లు, చీజ్ వంటి పాల ఉత్పత్తులకు దూరంగా ఉండే వీగన్స్‌లో విటమిన్ బీ12 లోపం కనిపిస్తోందని పలు సర్వేల్లో తేలింది..’ అని ఫోర్టిస్ హాస్పిటల్ సీనియర్ కన్సల్టెంట్ డాక్టర్ అనిల్ కుమార్ ఆనంద్ కుస్తగీ తెలిపారు. విటమిన్ బీ12 లోపం ఉన్నప్పుడు కనిపించే లక్షణాలు కూడా ఆయన వివరించారు.

Symptoms of Vitamin B12 deficiency: విటమిన్ బీ12 లోపం వల్ల కనిపించే లక్షణాలు

విటమిన్ బీ12 లోపం వల్ల బలహీనంగా కనిపించడం, శ్వాస ఆడకపోవడం, నోటిలో అల్సర్లు, లూజ్ మోషన్స్, వేళ్లపై మొటిమల్లా రావడం, మతిమరుపు, మూత్ర సంబంధిత ఇరిటేషన్, తరచుగా డిప్రెషన్‌లోకి వెళ్లడం, పనిపై ఏకాగ్రత లోపించడం, వెంట్రుకలు రాలిపోవడం వంటి లక్షణాలు కనిపిస్తాయి.

Vitamin B12 deficiency: విటమిన్ బీ12 లోపం వల్ల వచ్చే వ్యాధులు

heart diseases: గుండె జబ్బులు

కరోనరీ ఆర్టరీ డిసీజ్, పెరిఫెరల్ వాస్కులర్ డిసిజ్ వంటి పలు రకాల గుండె జబ్బులు విటమిన్ బీ12 లోపం వల్ల తలెత్తుతాయి. విటమిన్ బీ12 ఉన్న ఆహారం తీసుకోకపోవడం, లేక ఈ విటమిన్‌ను శోషించలేకపోవడం వల్ల ఈ వ్యాధులు తలెత్తుతాయి.

Neurological issues: నాడీ సంబంధిత సమస్యలు

వీక్‌నెస్, చేతులు, పాదాల్లో స్పర్శ తగ్గడం, డిమెన్షియా, రుచి తగ్గడం, కంటిచూపు తగ్గడం, మూత్ర సంబంధిత సమస్యలు ఏర్పడడం సంభవిస్తాయి.

Anaemia: రక్తహీనత

రక్తహీనతకు విటమిన్ బీ12 లోపం ప్రధాన కారణం. అయితే ఇంకా మరిన్ని పరీక్షలు నిర్వహించి కారణాలను కనుక్కోవచ్చు. విటమిన్ బీ12 ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా ఈ సమస్యను నివారించవచ్చు.

pregnancy issues: ప్రెగ్నెన్సీ సమస్యలు

ప్రతి మహిళ విటమిన్ బీ12 స్థాయిని చెక్ చేసుకోవాలి. లోపం ఉంటే కడుపులో పిండం ఎదుగుదలలో సమస్యలు ఏర్పడుతాయి.

Lifestyle changes: విటమిన్ బీ12 లోపం అరికట్టాలంటే

- వెజిటేరియన్లయితే తప్పనిసరిగా పాల ఉత్పత్తులు తీసుకోవాలి. వారికి బీ12 పొందేందుకు ఇదొక్కటే సోర్స్ అని గమనించాలి.

- మద్యపానం అలవాటు ఉన్న వారు మానుకోవాలి. లేదా ఇన్‌టేక్ తగ్గించాలి.

- వీగన్స్ తప్పనిసరిగా విటమిన్ బీ12 లెవెల్స్ చెక్ చేసుకోవాలి. తక్కువగా ఉన్నట్టు తేలితే వైద్యులు తగిన ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్లు సిఫారసు చేస్తారు.

WhatsApp channel