Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు-try drinking fenugreek water on an empty stomach diabetes will be controlled within a month ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Diabetes And Methi Water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Diabetes and Methi water: ఖాళీ పొట్టతో మెంతి నీళ్లు తాగి చూడండి, నెలలోనే మ్యాజిక్ చూస్తారు

Haritha Chappa HT Telugu
May 16, 2024 04:30 PM IST

Diabetes: మెంతి గింజల నీరు రక్తంలో చక్కెరను అదుపులో ఉంచేందుకు సహకరిస్తాయి. ఇవి బరువు తగ్గడాన్ని ప్రోత్సహిస్తాయి. మీ జీవక్రియను వేగవంతం చేయడానికి మెంతి గింజలు నీరు ఉపయోగపడతాయి.

మెంతిగింజల నీరు
మెంతిగింజల నీరు (Shutterstock)

మధుమేహం, అధిక బరువు , మలబద్దకం వంటి ఆరోగ్య సమస్యలతో ఎక్కువ మంది బాధపడుతున్నారు. వీటన్నింటినీ తగ్గించుకోవాలంటే ప్రతిరోజూ ఒక గ్లాసు మెంతి గింజల నీటిని తాగితే మంచిది. ఒక స్పూన్ మెంతులను గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టి ఉదయాన్నే వాటిని తీసుకోవడం వల్ల మీ జీవక్రియ వేగవంతం అవుతుంది. రక్తంలో చక్కెర, కొలెస్ట్రాల్ స్థాయిలు నియంత్రణలో ఉండేలా ఇది ఉపయోగపడుతుంది.

అలాగే గ్లాసు నీటిలో ఒక స్పూను మెంతులను వేసి బాగా మరిగించి, వడకట్టి ఆ నీటిని తాగితే మంచిది. ఖాళీ పొట్టతో ఈ నీటిని తాగడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కనిపిస్తాయి. మెంతి గింజల్లో గ్లూకోమన్నన్ ఫైబర్ ఉంటుంది. దీన్ని తినడం వల్ల చక్కెరను పేగు శోషించుకోవడం నెమ్మదిగా జరుగుతుంది. మెంతులు చర్మం, శ్లేష్మ పొరలపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. మెంతి గింజలను అందాన్ని పెంచుకోవడం కోసం ఉపయోగించవచ్చు. వీటిని పురాతన కాలం నుంచి హెయిర్ ప్యాక్ లు, ఫేస్ ప్యాక్ లుగా కూడా ఉపయోగిస్తున్నారు.

ఖాళీ పొట్టతో మెంతి నీరు తాగితే…

మెంతి గింజల నీటిని పరగడుపున తాగడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి.

1. జీర్ణక్రియకు సహాయపడుతుంది: మెంతులలో కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది జీర్ణవ్యవస్థలో ఆహార కదలికను ప్రోత్సహిస్తాయి. మలబద్దకాన్ని నివారిస్తాయి.

2. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది: మెంతి గింజలు ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. మెంతి గింజల నీటిని క్రమం తప్పకుండా తాగడం వల్ల డయాబెటిస్ ఉన్నవారికి ప్రయోజనకరంగా ఉంటుంది.

3. కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తుంది: మెంతుల్లో ఉండే కరిగే ఫైబర్… కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. తద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

4. బరువు తగ్గడానికి మద్దతు ఇస్తుంది: మెంతి నీటిలో ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. ఇది కేలరీలను అధికంగా తీసుకోకుండా తగ్గించేలా చేస్తుంది.

5. చర్మ ఆరోగ్యానికి: మెంతి పొడిలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీనిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. మొటిమలు లేదా మచ్చలను తగ్గించడానికి సహాయపడతాయి.

6. రోగనిరోధక శక్తికి: మెంతుల్లో విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి. శరీరం అంటువ్యాధులతో పోరాడటానికి సహాయపడతాయి.

7. మంటను తగ్గిస్తుంది: మెంతులు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరంలో మంటను తగ్గించడానికి ఉపయోగపడతాయి. ఆర్థరైటిస్ వల్ల కీళ్ల నొప్పులు రాకుండా అడ్డుకుంటాయి.

8. గుండె ఆరోగ్యానికి: మెంతి నీటిని క్రమం తప్పకుండా తీసుకుంటే కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీని వల్ల హృదయనాళ పనితీరుకు తోడ్పడుతుంది. గుండె ఆరోగ్యానికి మెంతి నీరు ఎంతో సహాయపడుతుంది.

9. నెలసరిలో: మెంతి గింజలు రుతు చక్రాలను నియంత్రించడంలో సహాయపడతాయి. నెలసరి సమయంలో వచ్చే తిమ్మిరి, నొప్పి, పొట్ట ఉబ్బరం వంటి లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి.

10. జుట్టు పెరుగుదలకు: మెంతుల్లో… ప్రోటీన్, నికోటినిక్ ఆమ్లం అధికంగా ఉంటాయి. ఇవి జుట్టు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. మెంతి గింజల నీటిని తాగడం వల్ల జుట్టు పెరుగుదల బావుంటుంది. జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది.

మెంతి గింజల నీటిని ఎలా తయారు చేయాలి?

మెంతులను ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూన్ మెంతులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే ఆ నీటిని వడకట్టి ఖాళీ కడుపుతో తాగాలి. ఇలా నెల రోజులు తాగితే మంచి ఫలితాలు కనిపిస్తాయి.

Whats_app_banner