Foods for kidney: కిడ్నీల కోసం ప్రతిరోజూ ఆ ఆహారాలను తినాల్సిందే, లేకుంటే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు-those foods should be eaten daily for the kidneys otherwise problems may arise in the future ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Foods For Kidney: కిడ్నీల కోసం ప్రతిరోజూ ఆ ఆహారాలను తినాల్సిందే, లేకుంటే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు

Foods for kidney: కిడ్నీల కోసం ప్రతిరోజూ ఆ ఆహారాలను తినాల్సిందే, లేకుంటే భవిష్యత్తులో సమస్యలు రావచ్చు

Haritha Chappa HT Telugu
Mar 28, 2024 12:30 PM IST

Foods for kidney: ఇప్పుడు ఎక్కువమందిలో కిడ్నీ సమస్యలు వస్తున్నాయి. అందుకే ముందుగానే వీటి కోసం కొన్ని ఆహారాలను తీసుకోవాలి. కిడ్నీలకు మేలు చేసే వీటిని ఈ ఆహారాలను సూపర్ ఫుడ్స్ అని పిలుస్తారు.

కిడ్నీల కోసం ఏం తినాలి?
కిడ్నీల కోసం ఏం తినాలి? (unsplash)

Foods for kidney: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండడం చాలా ముఖ్యం. శరీరంలో ప్రధాన అవయవాల్లో కిడ్నీలు ఒకటి. ఇవి చెడిపోయాయంటే సాధారణంగా జీవించడం చాలా కష్టతరంగా మారుతుంది. మన మూత్రపిండాలు ఆరోగ్యానికి అవసరమైన హార్మోన్లను ఉత్పత్తి చేసే అవయవాలు ఇవి. అలాగే శరీరంలో ఎలక్ట్రోలైట్లు సమతుల్యంగా ఉండేలా కాపాడతాయి. మన రక్తం నుండి వ్యర్ధాలను ఫిల్టర్ చేసి బయటికి పంపుతాయి. అలాంటి మూత్రపిండాలు దెబ్బతింటే ఎన్నో సమస్యలు రావచ్చు. కాబట్టి మూత్రపిండాల ఆరోగ్యాన్ని కాపాడే సూపర్ ఫుడ్స్ కొన్ని ఉన్నాయి. వీటిని రోజు వారీ ఆహారంలో భాగం చేసుకోవాలి.

నట్స్

బాదం, జీడిపప్పులు, వాల్ నట్స్, పిస్తా వంటివి రోజుకు గుప్పెడు తినేందుకు ప్రయత్నించండి. వీటిలో ఉండే ఎన్నో పోషకాలు కిడ్నీల ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. వీటన్నింటినీ కలిపి కేవలం గుప్పెడు తింటే చాలు, కిడ్నీలు తమ శక్తిని పెంచుకొని మరింత ఆరోగ్యంగా పనిచేస్తాయి.

ఆపిల్స్

ఆపిల్ పండ్లు ఎంతో మంచిది. ప్రతిరోజూ ఒక యాపిల్ పండు తింటే వైద్యుడిని కలవాల్సిన అవసరం కూడా ఉండదు. వీటిలో కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి ఉంటుంది. వీటిలో ఉండే పెప్టిన్ ఒక కరిగే ఫైబర్ ఉంటుంది. ఇది శరీరంలో హై బీపీని, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచుతుంది. మెదడు కణజాలాన్ని రక్షిస్తుంది. ఆపిల్‌ను తొక్కతో సహా తింటేనే ఎక్కువ లాభాలు కలుగుతాయి.

వెల్లుల్లి

వెల్లుల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు చాలా ఎక్కువ. ఇవి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. దీనిలో ఉండే అల్లిసిన్ మన మూత్రపిండాలకు ముఖ్యమైనది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అధిక కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. మూత్రపిండాల పనితీరును మెరుగుపరుస్తుంది.

బెల్ పెప్పర్స్

ఎరుపు పసుపు రంగులో ఉండే బెల్ పెప్పర్స్ అప్పుడప్పుడు ఆహారంలో భాగం చేసుకోవాలి. వీటిని క్యాప్సికమ్‌లు అని కూడా పిలుస్తారు. వీటిల్లో పొటాషియం తక్కువగా ఉంటుంది. బెల్ పేపర్స్ లో ఫైబర్, పోలిక్ యాసిడ్, విటమిన్ సి, విటమిన్ b6, విటమిన్ ఏ వంటివి అధికంగా ఉంటాయి. ఇవి అనేక రకాల క్యాన్సర్ల నుండి మనల్ని రక్షిస్తాయి.

కొవ్వు పట్టిన చేపలు

కొవ్వు నిండిన చేపలు తినడం వల్ల ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు శరీరానికి అందుతాయి. ఇది గుండెకు ఎంతో మేలు చేస్తాయి. సాల్మన్ వంటి చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలోని కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. అలాగే మూత్రపిండాల వ్యాధులు రాకుండా అడ్డుకుంటాయి. కాబట్టి పైన చెప్పిన అన్నింటిని మూత్రపిండాల ఆరోగ్యం కోసం తరచూ తింటూ ఉండండి.

Whats_app_banner