Sattvic Breakfast । పండగకు సరైన ఆరంభం.. అల్పాహారంగా సాత్విక ఆహారం!-this ugadi 2023 festival go for sattvic diet here is healthy barnyard millet dosa recipe ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Sattvic Breakfast । పండగకు సరైన ఆరంభం.. అల్పాహారంగా సాత్విక ఆహారం!

Sattvic Breakfast । పండగకు సరైన ఆరంభం.. అల్పాహారంగా సాత్విక ఆహారం!

HT Telugu Desk HT Telugu

Ugadi 2023 Sattvic Breakfast: పండగరోజున కూడా అదే రకమైన అల్పాహారం ఎందుకు? ఉగాది సందర్భంగా ఆరోగ్యకరమైన అల్పాహారం తినండి, రెసిపీని ఇక్కడ చూడండి.

Ugadi 2023 Sattvic Breakfast (freepik)

Ugadi 2023 Sattvic Breakfast: ఇది తెలుగు సంవత్సరాది ఉగాది. తెలుగు వారికి ఎంతో ప్రత్యేకమైన పండగ. ఈ శోభకృత నామ సంవత్సరం మొదటి రోజున మీరు చేసే మొదటి భోజనం ఎందుకు ప్రత్యేకంగా ఉండకూడదు? అందులోనూ దుర్గామాత భక్తులు ఈరోజు ఉపవాసం కూడా ఉంటారు. కాబట్టి సాధారణమైన అల్పాహారం సరిపోదు. బలమైన, ఆరోగ్యకరమైన అల్పాహారం అవసరం.

సిరి ధాన్యాలు ఎంతో మంచి పోషకాలను కలిగి ఉంటాయి. ఇందులో ఊదలు మీకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి. ఊదలతో చేసే దోశ రెసిపీని మీకు ఇక్కడ అందిస్తున్నాం. ఊదల్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది, చక్కెరలు తక్కువగా ఉంటాయి. కాబట్టి ఈ రకమైన మీ ఆకలిని అణిచివేసి, చాలా సేపు కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది. అంతేకాకుండా ఇది పండుగ వేళ తినాల్సిన ఒక మంచి సాత్వికాహారం కూడా. ఊదల దోశ ఎలా చేయాలో ఈ కింద సూచనలు చూడండి.

Barnyard Millet Dosa Recipe కోసం కావలసినవి

  • ½ కప్పు ఊదలు
  • ½ కప్పు రాజగిర పిండి
  • ½ కప్పు పుల్లని మజ్జిగ
  • 1 టేబుల్ స్పూన్ అల్లం-పచ్చిమిర్చి పేస్ట్
  • రుచికి తగినంత రాతి ఉప్పు
  • తగినంత నూనె

ఊదల దోశ తయారీ విధానం

  1. ముందుగా ఊదలను శుభ్రంగా కడిగి, ఒక గిన్నెలో కనీసం 2 గంటలు నానబెట్టండి. అనంతరం మిక్సీలో వేసి, కొన్ని నీళ్లు కలిపి ఒక మృదువైన మిశ్రమంగా మార్చండి.
  2. ఇప్పుడు ఊదల మిశ్రమంలో రాజగిర పిండి, మజ్జిగ, అల్లం-పచ్చిమిర్చి పేస్ట్ , రాక్ సాల్ట్ వేసి బాగా కలపాలి, ఆపై దీనిని రాత్రంతా పులియబెట్టండి. (అంత సమయం లేదనుకుంటే తక్షణమే పులియబెట్టే మార్గాలను ఎంచుకోండి)
  3. దోశల పిండిని సిద్ధం చేసుకున్నాక, ఒక నాన్-స్టిక్ తవాను వేడి చేసి, నూనెను గ్రీజు చేసి అనంతరం ఒక గరిటెతో కొద్దిగా మందపాటి దోశలను వేసుకోండి.
  4. దోశను రెండు వైపులా బంగారు గోధుమ రంగులోకి వచ్చే వరకు కాల్చండి.

అంతే, ఊదల దోశ రెడీ. మీకు నచ్చిన చట్నీతో ఈ ఆరోగ్యకరమైన దోశను ఆరగించండి.

సంబంధిత కథనం