Telugu News  /  Lifestyle  /  Know All About Sattvic Diet And Its Health Benefits
Sattvic diet
Sattvic diet (Unsplash)

Sattvic Diet | సాత్విక ఆహారం తినేవారు అలా ఉంటారు!

26 May 2022, 15:54 ISTHT Telugu Desk
26 May 2022, 15:54 IST

భగవద్గీత ప్రకారం మూడు రకాల ఆహారాలు ఉన్నాయి. మానసికంగా, శారీరకంగా ఎల్లప్పుడు ఆరోగ్యకరంగా ఉండాలంటే స్వాత్విక ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.

సాత్విక భోజనం అంటే ఆయుర్వేదంలో సూచించినట్లుగా తీసుకునే ఆహారం. సాత్విక్ అనే పదం సత్వ అనే సంస్కృత పదం నుండి ఉద్భవించింది. దీనికి స్వచ్ఛత, ఆరోగ్యం, శ్రేయస్సు అనే అర్థాలు ఉన్నాయి.  తినే ఆహారం వారి ఆలోచనలు, స్వభావం, మానసిక స్థితితో వాటు వారి శ్రేయస్సుపై కూడా నేరుగా ప్రభావం చూపుతుంది అని భగవద్గీతలో సూచించడం జరిగింది.

ట్రెండింగ్ వార్తలు

కాబట్టి తాజాదనంతో నిండిన, పోషక విలువలు కలిగిన, రుచికరంగా ఉండే పూర్తి శాఖాహారం తినటం అలవాటు చేసుకోవాలి. అప్పుడే అది సాత్విక భోజనం అనిపించుకుంటుంది. 

భగవద్గీతలో శ్రీకృష్ణుడు అర్జునుడికి మూడు గుణాల ఆధారంగా ఆహార ప్రాధాన్యతను గురించి కూడా వివరించినట్లు ఉంది. త్యాగం, కాఠిన్యం, దాతృత్వం వైపు మొగ్గు చూపే విషయంలో కూడా ఆహారం ప్రభావం చూపుతుంది. ఒత్తిడి లేకుండా ఆనందకరమైన, ఆరోగ్యకరమైన జీవితానికి సాత్విక ఆహారం తినాలని సూచించడమైనది.

మొత్తంగా గుణాల ఆధారంగా మూడు రకాల ఆహార పదార్థాలు ఉన్నాయి. మరి ఆ మూడు రకాల ఆహారాలు ఏంటి, వేటిని తింటే మనిషిపై ఎలాంటి ప్రభావం ఉంటుందో ఇక్కడ తెలుసుకోండి.

మూడు రకాల ఆహార పదార్థాలు ఇవే:

సాత్విక ఆహారం

ఇది స్వచ్ఛమైన శాఖాహార ఆహారం. ఇందులో కాలానుగుణ తాజా పండ్లు, తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పప్పులు, మొలకలు, పలుకులు, విత్తనాలు, తేనె, తాజా మూలికలు ఉంటాయి. ఇది మనస్సును స్వచ్ఛంగా, శరీరాన్ని సమతుల్యంగా ఉంటుంది. సాత్విక ఆహారాన్ని భుజించేవారు ప్రేమ, కృతజ్ఞత, అవగాహనతో ఉంటారు. వారిలో ప్రశాంతత కనిపిస్తుంది, నిర్మలమైన చిరునవ్వు, స్నేహశీలి, శక్తి, ఉత్సాహం, ఆరోగ్యం, ఆశ, ఆకాంక్షలు, సృజనాత్మకత ఇలా సమతుల్య వ్యక్తిత్వంతో నిండి ఉంటారు.

తమాసిక్ ఆహారం

 ఇందులో ప్రధానంగా మళ్లీ వేడిచేసిన ఆహారాలు, రసాయనికంగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, గుడ్లు, మాంసం, ఆల్కహాల్, సిగరెట్లు మొదలైనవి ఉంటాయి. తామసిక్ ఆహారాన్ని భుజించే వారు నిస్తేజంగా, ఊహకు అందని విధంగా, ఎలాంటి ప్రేరణ లేకుండా, బద్ధకంగా, అజాగ్రత్తగా, నీరసంగా ఉంటారు. వీరికి మధుమేహం, ఊబకాయం, కాలేయ వ్యాధి వంటి అనారోగ్యాలను అనుభవిస్తారు.

రజాసిక్ ఆహారం

రజాసిక్ ఆహారంలో ప్రధానంగా మసాలా దినుసులు, ఉల్లి, వెల్లుల్లి, ఇతర సుగంధ ద్రవ్యాలు , డీప్ ఫ్రైడ్ ఫుడ్స్, కాఫీ, టీ, రిఫైన్డ్ ఫుడ్ ఐటమ్స్, షుగర్ ఫుడ్స్, చాక్లెట్‌లు వంటి సుసంపన్నమైన రుచి ఉండే ఆహారాలు ఉంటాయి. ఇలాంటి ఆహారాలను భుజిస్తే తక్షణ శక్తి లభిస్తుంది కానీ ఆ శక్తి వెంటనే ఖర్చయిపోతుంది. శరీర సమతుల్యతను భంగపరుస్తుంది. బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉంటుంది. ఎప్పుడూ తినడానికి ఆత్రుత ప్రదర్శిస్తారు. కోపంగా ఉంటారు, అవిశ్రాంతంగా, ఆందోళనగా ఉంటారు.

టాపిక్