Chickpeas Dosa Recipe । బరువు తగ్గాలనుకునే వారి కోసం ప్రోటీన్ దోశ, ఇలా చేయండి!
Chickpeas Dosa Recipe: తెల్ల శనగలను పిండిగా మార్చి అందులో కొన్ని కూరగాయలు కలిపి దోశగా చేసుకోవచ్చు. ఇది బరువు తగ్గటానికి సరైన అల్పాహారం.
బరువు తగ్గాలనుకుంటున్నారా, ఎలాంటి అల్పాహారం తీసుకుంటే మంచిదని ఆలోచిస్తున్నారా? అయితే మీకు ఇష్టమైన దోశను తినవచ్చు. అయితే ఈ దోశను సాధారణంగా చేసే బియ్యం పిండితో కాకుండా ప్రోటీన్లు నిండిన కాయధాన్యాలతో చేసినది అయి ఉండాలి. ఎందుకంటే కాయధాన్యాలలో అధిక మొత్తంలో ప్రోటీన్లు ఉంటాయి, తక్కువ కొవ్వు పదార్ధాలను కలిగి ఉంటాయి. ఇవి మీ కడుపును చాలా సేపు నిండుగా ఉంచుతాయి, ఆకలిని నియంత్రిస్తాయి, బరువును అదుపులో ఉంచుతాయి.
మీకు ఇక్కడ తెల్ల శనగలు లేదా కాబూలీ శనగలతో చేసే దోశ రెసిపీని అందిస్తున్నాం. ఈ చిక్‌పీస్ పిండితో చేసే దోశలు మరింత ఆరోగ్యకరమైనవి. ఇది తక్కువ కేలరీలు, ఎక్కువ ప్రోటీన్లు కలిగిన అల్పాహారం. బరువుని నియంత్రించడమే కాకుండా కండరాల పెరుగుదలలో కూడా సహాయపడుతుంది. చిక్‌పీస్ దోశ రెసిపీని ఈ కింద ఉంది, ఇక్కడ అందించిన సూచనల ప్రకారం సులభంగా చేసుకోవచ్చు.
Chickpeas Dosa Recipe కోసం కావలసినవి
- 1 కప్పు చిక్‌పీస్ పిండి
- 1 స్పూన్ పసుపు
- 2 పచ్చిమిర్చి
- 1/2 స్పూన్ ఉప్పు
- 1/2 స్పూన్ నల్ల మిరియాల పొడి
- 3 స్ప్రింగ్ ఆనియన్
- 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్
- 1/2 tsp చిల్లీ ఫ్లేక్స్
- 1 క్యాప్సికమ్
- 1/2 కప్పు పచ్చి బఠానీలు
చిక్‌పీస్ దోశ తయారీ విధానం
- ముందుగా మిక్సర్ గిన్నెలో తెల్లశనగలు, పసుపు, ఉప్పు, మిరియాల పొడి, పచ్చిమిర్చి వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేయండి. పిండి చాలా ద్రవంగా కనిపించాలి. కొద్దిగా నెయ్యి కలిపితే మృదువుగా మారుతుంది.
- ఇప్పుడు క్యాప్సికమ్, స్ప్రింగ్ ఆనియన్లను ముక్కలుగా కోసి పిండిలో కలపండి, అందులోనే పచ్చిబఠానీలను కలపండి.
- ఇప్పుడు పాన్ వేడిచేయండి, బాగా వేడయ్యాక నూనె చిలకరించండి, ఆపైన పిండి వేసి గుండ్రంగా దోశను విస్తరించండి. అవసరం మేరకు నూనె కలపండి.
అంతే, పోషకాలు నిండిన ఆరోగ్యకరమైన చిక్‌పీస్ దోశ రెడీ. మీకు నచ్చిన చట్నీ అద్దుకొని తింటూ మీ అల్పాహారాన్ని ఆస్వాదించండి.
సంబంధిత కథనం