Summer Seeds : వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి-these seeds work effectively to keep the body cool in summer flax seeds chia seeds fenugreek and coriander seeds ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Summer Seeds : వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి

Summer Seeds : వేసవిలో శరీరాన్ని కూల్‌గా ఉంచేందుకు ఈ గింజలు ఎఫెక్టివ్‌గా పని చేస్తాయి

Anand Sai HT Telugu
Apr 05, 2024 02:00 PM IST

Summer Seeds For Cool : వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా అవసరం. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. అందుకోసం కొన్ని గింజలు తినాలి.

వేసవిలో తీసుకోవాల్సిన గింజలు
వేసవిలో తీసుకోవాల్సిన గింజలు (Unsplash)

ఈ ఏడాది ఎండలు విపరీతంగా ఉంటాయి. ఎండ వేడిమి మరింత పెరిగే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అన్ని కాలాల్లో తిన్నట్టుగా వేసవిలో ఆహారం తినకూడదు. వేసవిలో ఆహారం మార్చుకోవాలి, శరీరంలో నీటిశాతం ఉండేలా, శరీరాన్ని చల్లగా ఉంచే ఆహారపదార్థాల పట్ల ఎక్కువ దృష్టి పెట్టాలి. ముఖ్యంగా వేసవిలో ప్రతిరోజూ కొన్ని రకాల విత్తనాలు తింటే ఆరోగ్యంగా ఉంటారు.

జీలకర్ర

జీలకర్ర శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. వేసవి వంటల్లో తప్పకుండా వాడండి. ఇది శరీరంలో ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది, వాపు సమస్యను తగ్గిస్తుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. జీర్ణక్రియకు చాలా మేలు చేస్తుంది. ఉబ్బరం, పొత్తికడుపు తిమ్మిరి వంటి సాధారణ వేసవి సమస్యల నుండి ఉపశమనం పొందవచ్చు. 1 టేబుల్ స్పూన్ జీలకర్రను నీటిలో వేసి మరిగించి ఆ నీటిని తాగాలి.

చియ విత్తనాలు

చియా విత్తనాలు కూడా వేసవికి చాలా మంచివి. అవి ఫైబర్ కలిగి ఉంటాయి. జీర్ణక్రియకు చాలా సహాయకారిగా ఉంటాయి. అలాగే, చియా విత్తనాలు శరీరంలో నీటి శాతాన్ని మెయింటెయిన్ చేయడంలో సహాయపడతాయి. ఈ గింజలో ఒమేగా 3 ఫ్యాట్ ఉన్నందున దీనిని జ్యూస్ లో వేసుకుని తాగితే వేసవిలో చాలా మేలు చేస్తుంది.

అవిసె గింజలు

అవిసె గింజలు చాలా మంచిది. ముఖ్యంగా శాకాహారులు దీనిని తప్పకుండా తీసుకోవాలి. తద్వారా ఒమేగా 3 కొవ్వుల లోపం రాకుండా ఉంటుంది. ఇది జుట్టు, చర్మ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియకు సహాయపడుతుంది. అలాగే శరీరంలోని మలినాలను తొలగించి శరీర ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

సోంపు గింజలు

సోంపు శరీరాన్ని చల్లగా ఉంచడంలో కూడా సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత కాస్త సోంపును నోటిలో వేసుకుంటే జీర్ణక్రియకు చాలా మంచిది. అలాగే శరీరాన్ని చల్లగా ఉంచుకునేందుకు నీటిలో వేసి మరిగించి తాగడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

గసగసాలు

గసగసాలు వేసవిలో తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఇది శరీరం నుండి అధిక వేడిని తొలగిస్తుంది. ఆయుర్వేదం, ఇంటి నివారణలలో ఉపయోగించబడుతుంది. గసగసాలలో ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఇది అధిక శరీర ఉష్ణోగ్రతను తొలగిస్తుంది. కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం కూడా కలిగి ఉంటుంది. మీరు దీన్ని స్మూతీస్, సలాడ్లు, డెజర్ట్‌లలో కూడా ఉపయోగించవచ్చు.

కొత్తిమీర ప్రయోజనాలు

కొత్తిమీర ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. బెల్లంతో కొత్తిమీర కలిపి తాగడం చాలా మంచిది. ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది. వేసవిలో దీన్ని ఎక్కువగా వాడండి. ఇవి మీ ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తుంది.

మెంతి గింజలు

మెంతి గింజ శరీరాన్ని చల్లబరుస్తుంది. అనేక ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. ఇది తీవ్రమైన వేడిలో ఉపయోగిస్తే శరీరానికి చాలా మంచిది. రాత్రిపూట మెంతులను ఉడకబెట్టి, ఉదయం తాగడం చాలా మంచిది. ఇది మధుమేహాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది. మెంతులను వంటలో వాడండి. ఈ మెంతి గింజల వినియోగం ఉష్ణోగ్రత కారణంగా కడుపు నొప్పిని తగ్గిస్తుంది. మూత్ర నాళాల ఇన్ఫెక్షన్‌ను నివారించడంలో సాయపడుతుంది.

Whats_app_banner