Coffee Mask: చర్మానికి ఇన్‌స్టెంట్ మెరుపు కావాలా? ఓసారి కాఫీ మాస్క్ ప్రయత్నించండి-want an instant skin glow try a coffee mask ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coffee Mask: చర్మానికి ఇన్‌స్టెంట్ మెరుపు కావాలా? ఓసారి కాఫీ మాస్క్ ప్రయత్నించండి

Coffee Mask: చర్మానికి ఇన్‌స్టెంట్ మెరుపు కావాలా? ఓసారి కాఫీ మాస్క్ ప్రయత్నించండి

Haritha Chappa HT Telugu
Apr 05, 2024 10:56 AM IST

Coffee Mask: విందులకు, వేడుకలకు వెళ్లే ముందు ఇన్ స్టెంట్ మెరుపు కోసం ప్రయత్నిస్తారు ఎంతోమంది మహిళలు. అలాంటి వారికి మంచి పరిష్కారం కాఫీ మాస్క్. ఇది అప్పటికప్పుడు మీ ముఖానికి మెరుపును అందిస్తుంది

కాఫీ మాస్క్
కాఫీ మాస్క్ (Pixabay)

Coffee Mask: ముఖంలో ఇన్‌స్టెంట్ మెరుపు కోసం ప్రయత్నించే వాళ్ళు ఎంతోమంది. పెళ్లిళ్లు, వేడుకల సమయంలో అప్పటికప్పుడు చర్మానికి మెరుపు తెచ్చే పనులను ప్రయత్నిస్తూ ఉంటారు. అలాంటి సమయంలో కాఫీ మాస్క్ ప్రయత్నించండి. కాఫీ మాస్క్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎంతో వైరల్ గా మారింది. ఈ కాఫీ మాస్క్ ముఖంపై ఇన్స్టెంట్ గా మెరుపును అందిస్తుంది. ఈ కాఫీ మాస్క్‌లో టమోటోను కూడా ఉపయోగిస్తాం. కాబట్టి అది కూడా వెంటనే ప్రకాశవంతమైన మెరుపు ఇస్తుంది.

కాఫీ మాస్క్‌తో ఉపయోగాలు

కాఫీ పొడి టేస్టీ పానీయమే కాదు, ఇది చర్మానికి కూడా ఎన్నో ప్రయోజనాలను అందిస్తుంది. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కాబట్టి ముఖానికి రాయడం వల్ల అకాల వృద్ధాప్య స్థాయిలు కనబడకుండా చేస్తుంది. శరీరానికి హాని కలిగించే ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు సహాయపడుతుంది. ఇందులో ఉండే కెఫీన్ కంటెంట్ రక్తనాళాలు ఉబ్బకుండా చూస్తుంది. దీనివల్ల చర్మ ఆరోగ్యం మెరుపుతో కనిపిస్తుంది. కాఫీలో మృత కణాలను తొలగించే గుణం ఉంది. కాబట్టి చర్మం మెరిసిపోతుంది.

ఇక దీనిలో టమోటాలను కూడా వినియోగిస్తాము. టమోటాల్లో విటమిన్లు, పోషకాలు ఎక్కువ. ఎప్పుడైతే చర్మానికి దీన్ని అప్లై చేస్తామో... ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, లైకోపీన్ వంటివి చర్మానికి మెరుపు తెచ్చేందుకు సహాయపడతాయి. అలాగే చర్మంలో కోలాజిన్ ఉత్పత్తిని ప్రోత్సహిస్తాయి. దీనివల్ల చర్మం సాగకుండా దృఢంగా ఉంటుంది. అలాగే PH స్థాయిలను కూడా సమతల్యం చేస్తుంది. అదనపు నూనెలు ఉత్పత్తి కాకుండా అడ్డుకుంటుంది. జిడ్డు, మొటిమలు వంటివి రాకుండా కాపాడుతుంది.

దీనిలో బియ్యప్పిండిని కూడా వినియోగిస్తాము. దశాబ్దాలుగా బియ్యప్పిండి, చర్మసంరక్షణకు వినియోగిస్తున్నారు. బియ్యప్పిండిలో కూడా మృత కణాలను తొలగించే శక్తి ఉంటుంది. ఈ కాఫీ ఫేస్ ప్యాక్ లో కాఫీ పొడి, బియ్యం పిండి టమోటో.. మూడూ ఉపయోగిస్తాము. కాబట్టి చర్మం మెరవడం ఖాయం.

కాఫీ మాస్క్ ఎలా చేయాలి?

ఒక టేబుల్ స్పూన్ కాఫీ పొడి, ఒక స్పూను టమాటో గుజ్జు, ఒక స్పూను బియ్యం పొడి తీసుకోవాలి. ఒక గిన్నెలో ఈ మూడింటిని వేసి బాగా కలపాలి. ముఖాన్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని ప్యాక్ లాగా వేసుకోవాలి. కంటి చుట్టూ వెయ్యకపోవడమే మంచిది. కనీసం పావుగంట నుంచి 20 నిమిషాల పాటు ఈ మాస్క్ అలానే ఉంచాలి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో చర్మాన్ని శుభ్రం చేసుకోవాలి. తర్వాత సీరమ్ ని ముఖానికి అప్లై చేసుకుంటే ముఖం మెరుస్తుంది.

కాఫీ, టమోటో, బియ్యంపిండి ఈ మూడింటి కలయిక చర్మాన్ని తక్షణమే మెరిపించే శక్తిని కలిగి ఉంటాయి. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. తరచూ ఫేస్ మాస్క్ వేసుకుంటే చర్మం హైడ్రేటెడ్ గా మారి అందంగా కనిపిస్తుంది.

టాపిక్