Green Peas Idli: గ్రీన్ పీస్ ఇడ్లీ ట్రై చేయండి, ఈ ఆకుపచ్చని ఇడ్లీ చాలా టేస్టీ,టమోటా చట్నీతో అదిరిపోతుంది-green peas idli recipe in telugu know how to make this breakfast ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Green Peas Idli: గ్రీన్ పీస్ ఇడ్లీ ట్రై చేయండి, ఈ ఆకుపచ్చని ఇడ్లీ చాలా టేస్టీ,టమోటా చట్నీతో అదిరిపోతుంది

Green Peas Idli: గ్రీన్ పీస్ ఇడ్లీ ట్రై చేయండి, ఈ ఆకుపచ్చని ఇడ్లీ చాలా టేస్టీ,టమోటా చట్నీతో అదిరిపోతుంది

Haritha Chappa HT Telugu
Mar 30, 2024 06:00 AM IST

Green Peas Idli: సౌత్ ఇండియన్ టిఫిన్లలో ఇడ్లీ ఒకటి. ప్రతి ఇంట్లో వారానికి కనీసం రెండు మూడు సార్లయినా ఇడ్లీ ఉండాల్సిందే. సాదా ఇడ్లీతో పాటు, సాంబార్ ఇడ్లీ, బటన్ ఇడ్లీ ఇలా రకరకాల ఇడ్లీలు ఉన్నాయి.

గ్రీన్ పీస్ ఇడ్లీ రెసిపీ
గ్రీన్ పీస్ ఇడ్లీ రెసిపీ (Youtube)

Green Peas Idli: ఇడ్లీ అంటే మీకు ఇష్టమా? ఒకసారి గ్రీన్ పీస్ ఇడ్లీ ట్రై చేయండి. ఆకుపచ్చగా ఉండే ఇడ్లీ చాలా టేస్టీగా ఉంటుంది. కొబ్బరి చట్నీతో తింటే ఆ రుచే వేరు. అలాగే ఇవి టమాటో చట్నీతో కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ ఇడ్లీలు అన్ని ఆరోగ్యానికి మేలు చేసేవే వినియోగించాము. కాబట్టి శరీరానికి ఎన్నో పోషకాలు అందుతాయి. మరి కొన్ని రోజుల్లో పచ్చి బఠానీల సీజన్ ముగిసిపోతుంది. కాబట్టి ఈలోపే పచ్చి బఠానీలు కనిపిస్తే కొని ఇంటికి తెచ్చుకోండి. ఈ ఇడ్లీలను ప్రయత్నించండి.

గ్రీన్ పీస్ ఇడ్లీ రెసిపీకి కావలసిన పదార్థాలు

పచ్చి బఠానీలు - 200 గ్రాములు

రవ్వ - 200 గ్రాములు

అల్లం - చిన్న ముక్క

పచ్చిమిర్చి - రెండు

కరివేపాకులు - గుప్పెడు

ఆవాలు - ఒక స్పూను

పెరుగు - 200 గ్రాములు

మినప్పప్పు - ఒక స్పూను

నూనె - సరిపడా

ఉప్పు - రుచికి సరిపడా

పచ్చి బఠానీ ఇడ్లీ రెసిపీ

1. పచ్చి బఠానీలు మిక్సీ జార్లో వేసి రుబ్బుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి, అల్లం, కొద్దిగా నీరు కూడా వేసి మెత్తగా రుబ్బాలి.

2. ఈ మిశ్రమాన్ని తీసి ఒక గిన్నెలో వేసుకోవాలి. మరొక గిన్నెలో రవ్వ, పెరుగు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.

3. ఇందులోనే ముందుగా రుబ్బుకున్న పచ్చిమిర్చి పచ్చి బఠానీల మిశ్రమాన్ని కూడా వేసి బాగా కలపాలి.

4. రుచికి సరిపడా ఉప్పును వేసుకోవాలి. పావుగంటసేపు అలా వదిలేయాలి.

5. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి... నూనె వేడెక్కాక ఆవాలు, మినప్పప్పు వేసి చిటపటలాడించాలి.

6. తర్వాత కరివేపాకులు కూడా వేసి వేయించాలి.

7. ఆ మొత్తం మిశ్రమాన్ని ఇడ్లీ పిండిలో కలుపుకోవాలి.

8. ఇప్పుడు ఇడ్లీ స్టాండ్ తీసుకొని కాస్త నూనె రాసుకుని ఇడ్లీలను వేసుకోవాలి.

9. ఆవిరి మీద ఉడికిస్తే పావుగంటలో గ్రీన్ పీస్ ఇడ్లీ రెడీ అయిపోతుంది.

10. ఇది చాలా టేస్టీగా ఉంటాయి. వీటిని కొబ్బరి చట్నీతో తిన్నా లేక టమాటో చట్నీతో తిన్నా రుచి అదిరిపోతుంది.

పచ్చిబఠానీలు సీజనల్‌గా దొరికేవి. కాబట్టి ఏ సీజన్లో దొరికే ఆహారాన్ని ఆ సీజన్లో కచ్చితంగా తినాలి. కొన్ని రోజుల్లో ఈ సీజన్ ముగిసిపోతుంది. కాబట్టి ఈలోపే వీటిని కొని ఇంట్లో పెట్టుకోవడం మంచిది.

పచ్చి బఠానీలు తినడం వల్ల శరీరంలో కొలెస్ట్రాల్ తగ్గుతుంది. గుండెపోటు, రక్తపోటు వంటి వ్యాధులు వచ్చే అవకాశం కూడా తక్కువగా ఉంటుంది. డయాబెటిస్ ఉన్నవారు పచ్చిబఠానీలను కచ్చితంగా తినాలి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతాయి. వీటిలో ప్రోటీన్, ఫైబర్ అధికంగా ఉంటుంది. కాబట్టి తక్కువ తింటే పొట్ట నిండినట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇతర ఆహారాలు తినరు. పచ్చిబఠానీలతో ఇలా సులువుగా బరువు తగ్గొచ్చు. ఇందులో అవసరమైన జింక్, రాగి, మాంగనీస్, ఇనుము పుష్కలంగా ఉంటాయి.

పచ్చ బఠానీలతో ఎప్పుడూ ఒకేలాంటి ఆహారాలను చేసుకునే కన్నా ఇలా డిఫరెంట్‌గా గ్రీన్ పీస్ ఇడ్లీ వంటివి ట్రై చేయండి. బరువు తగ్గడానికి కూడా ఈ రెసిపీ ఎంతో ఉపయోగపడుతుంది. పచ్చిబఠానీలు చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. వృద్ధాప్య ఛాయలు రాకుండా అడ్డుకుంటాయి. చర్మంపై గీతలు, ముడతలు పడకుండా కాపాడుతాయి.

టాపిక్