వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇంట్లో దోమలు స్వైర విహారం చేస్తాయి. దోమల వల్ల డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్ వంటి జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఇంట్లో దోమలు చేరకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. నిజానికి దోమలు అందరినీ కుట్టేందుకు ఇష్టపడవు. నలుగురు మనుషులు ఉన్న చోట ఒకరు లేదా ఇద్దరు మనుషులనే ఎక్కువగా కరుస్తూ ఉంటాయి. దోమలు తమను ఎక్కువగా ఇబ్బంది పెడుతున్నాయని కొందరు బాధపడుతుంటారు. కొంతమంది నిజంగా దోమలను అయస్కాంతాల్లా ఆకర్షిస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. దోమలు ఇతరులకన్నా మిమ్మల్ని ఎక్కువగా కరవడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. వేయడానికి ఇక్కడ 5 కారణాలు ఉన్నాయి.
అధిక శరీర ఉష్ణోగ్రత ఉన్నవారిపై దోమలు తరచుగా వాలుతాయని అంటారు. ఆడ దోమలు కూడా వేడికి ఆకర్షితులవుతాయి. కాస్త వేడి తగిలితే చాలు దోమలు ఆవైపు ఎగురుకుంటూ వెళతాయి. మీ శరీరం వెచ్చగా ఉంటే దోమలు మిమ్మల్ని కరిచే అవకాశం ఎక్కువ.
బ్లడ్ గ్రూపులు కూడా దోమలను ఆకర్షిస్తాయి. ఈ రక్తవర్గం దోమలకు నచ్చినది అయితే వెంటనే అది మీ వెనుక తిరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ‘O’ బ్లడ్ గ్రూప్ ఉన్నవారి రక్తంపై దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయని కొన్ని నివేదికలు చెబుతున్నాయి. అలాంటి వారిని దోమలు ఎక్కువగా కుట్ట అవకాశం ఉంది.
శరీర నుంచి దుర్వాసన, చెమట వాసన వల్ల అధికంగా వచ్చినా కూడా దోమలు ప్రభావితమవుతాయి. మీ చర్మం శుభ్రంగా ఉంటే దోమలు తక్కువ ఆకర్షితమవుతాయి. మీ చర్మంపై చెమట వల్ల బ్యాక్టీరియా చేరుతుంది. ఆ బ్యాక్టిరియా వాసన కొడుతుంది. ఆ వాసనకు దోమలు ఎక్కువగా ఆకర్షితులవుతాయి. కాబట్టి మీ శరీరం నుంచి దుర్వాసన రాకుండా, చెమట వాసన రాకుండా చూసుకుంటే దోమ కాటు బారిన తక్కువ పడే అవకాశం ఉంది.
కార్బన్ డయాక్సైడ్ వాసన కూడా దోమలను వేగంగా మనుషుల వైపు ఆకర్షిస్తుంది. ఆడ దోమలు తమ సెన్సింగ్ అవయవం నుండి కార్బన్ డయాక్సైడ్ వాసనను గుర్తించడం ద్వారా మానవ శరీరానికి ఆకర్షితమవుతాయి. దోమకాటుకు ఇది కూడా ఒక కారణం. యూరల్ యాసిడ్, లాక్టిక్ యాసిడ్, అమ్మోనియా వాసన కూడా దోమలను ఆకర్షిస్తుందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.
ఎంతో మందికి బీర్ తాగే అలవాటు ఉంది. బీర్ తాగిన తర్వాత చెమటలో ఇథనాల్ విడుదలవుతుంది. దాని వాసన దోమలను ఆకర్షిస్తాయి. అందుకే బీర్ అధికంగా తాగేవారిని దోమలు అధికంగా కుట్టే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి.
టాపిక్