Benefits of Beer: బీర్ తక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిదే, కానీ కొందరికి మాత్రం పడదు
Benefits of Beer: యువతలో బీర్ అంటే ఒక క్రేజ్. స్టైల్‌గా బాటిల్ పట్టుకొని తెగ తాగేస్తూ ఉంటారు. అయితే వీటి గురించి ప్రతి ఒక్కరూ కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
Benefits of Beer: ప్రపంచంలో అత్యంత పురాతనమైన పానీయాలలో బీర్ ఒకటి. వేల సంవత్సరాలుగా దీన్ని తాగుతూనే ఉన్నారు. పురాతన నాగరికతల నుండి నేటి పబ్ కల్చర్ వరకు బీర్ పానీయం వేడుకల్లో కనిపిస్తూనే ఉంది. దీని రుచి, చల్లని లక్షణం వల్ల ఎంతోమంది దీన్ని తాగేందుకు ఇష్టపడుతున్నారు. అయితే బీర్‌ను మితంగా తాగడం వల్ల కొన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అదే అధిక వినియోగం అధికంగా తాగితే మాత్రం ఆరోగ్య సమస్యలు వస్తాయి. కానీ కొంతమందిలో బీర్ మితంగా తాగినా కూడా సరిపడదు. అలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి.
బీర్‌లో విటమిన్లు, ఖనిజాలు మన శరీరానికి అవసరమైన పోషకాలు కొన్ని ఉంటాయి. ఇది జీవక్రియకు కీలకమైన బి విటమిన్లను కలిగి ఉంటాయి. అలాగే మెగ్నీషియం, పొటాషియం కూడా దీనిలో నిండుగా ఉంటాయి. కాబట్టి బీర్‌ను తక్కువ మొత్తంలో తాగితే మన ఆరోగ్యానికి మేలే జరుగుతుంది.
బీర్ మితంగా తాగితే…
ఎవరైతే బీర్‌ను తక్కువ మొత్తంలో తాగుతారో వారికి గుండె సంబంధ వ్యాధులు రాకుండా ఉంటాయి. బీర్‌లో అధిక సాంద్రత కలిగిన లిపో ప్రోటీన్ మంచి కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. అంతేకాదు పాలీఫెనాల్స్ వంటి యాంటీ ఆక్సిడెంట్లను ఇది కలిగి ఉంటుంది. రక్తనాళాల పనితీరును మెరుగుపరుస్తుంది. గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
బీర్ ప్రతిరోజూ తక్కువ మొత్తంలో తాగే వారిలో ఎముకలు బలంగా ఉంటాయి. సిలికాన్ ఉండే బీర్‌ను తాగడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది. ఆర్థరైటిస్ వంటి వ్యాధుల బారిన పడకుండా తప్పించుకోవచ్చు. ఎముకలు బలంగా ఉంటాయి. కాబట్టి ఆర్థరైటిస్ రాకుండా ఉంటుంది. అలాగే మెదడుపై కూడా బీరు వినియోగం ప్రభావాన్ని చూపిస్తుంది. అభిజ్ఞా పనితీరును పెంచుతుంది. అల్జీమర్స్ వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. మెదడులో ఇన్ఫ్లమేషన్, ఆక్సికరణ ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది
బీర్ తాగడం వల్ల అందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. బీర్‌లో డైటరీ ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది పేగు కదలికలను ప్రోత్సహిస్తుంది. మలబద్ధకం వంటి సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. అలాగే యాంటీ మైక్రో బయల్ లక్షణాలు బీరులో ఉంటాయి. కాబట్టి ఇది హానికరమైన బ్యాక్టీరియాను శరీరంలో చేరకుండా కాపాడుతుంది. అలాగే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడే ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బీర్‌లో నీటి కంటెంట్ అధికంగా ఉంటుంది. కాబట్టి మూత్రపిండాలను హైడ్రేటెడ్‌గా ఉంచడానికి సహాయపడుతుంది. అలాగే వ్యర్ధాలను, విషాలను బయటకు పంపిస్తుంది. కిడ్నీలకు మంచి జరుగుతుందని బీర్‌ను అధికంగా తాగితే మాత్రం సమస్యలు మొదలైపోతాయి. ఒత్తిడి నుంచి బయట పడేసేందుకు బీర్ ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి బీర్‌ను చాలా మితంగా తక్కువ స్థాయిలో తాగితే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. ఎక్కువ తాగితే మాత్రం వ్యసనంగా మారి శరీరంపై హానికరమైన ప్రభావాలు కనిపిస్తాయి. ముఖ్యంగా కాలేయ సమస్యలు వస్తాయి.
బీర్ అతిగా తాగితే...
బీర్ అందరికీ పడాలని లేదు. కొంతమంది శరీరానికి బీర్ సరిపడకపోవచ్చు. అలాగే అధిక వినియోగం వల్ల కొంతమందిలో కొవ్వు కాలేయ వ్యాధి, హెపటైటిస్, సిర్రోసిస్ వంటి తీవ్రమైన కాలేయ వ్యాధులు రావచ్చు. బీర్ కూడా ఒకలాంటి ఆల్కహాలే. దీన్ని ఎంత పరిమితంగా తీసుకుంటే అంత మంచిది. బీర్ అధికంగా తాగితే బరువు త్వరగా పెరిగిపోతారు. దీనివల్ల ఊబకాయం బారిన పడతారు. ఊబకాయం వల్ల పొట్ట విపరీతంగా పెరుగుతుంది. దీనివల్ల మధుమేహం కూడా వచ్చే అవకాశం ఉంటుంది. గుండె జబ్బులు, కీళ్ల సమస్యలు వస్తాయి.
అధిక బీర్ వినియోగం అనేక రకాల క్యాన్సర్లను పెంచుతుంది. అన్నవాహిక క్యాన్సర్, కాలేయం క్యాన్సర్, నోటి క్యాన్సర్, గొంతు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బీర్‌ను ఎంత తక్కువగా తాగితే అంత మంచిది. బీర్‌ను అధికంగా తాగే వారిలో గుండె కొట్టుకునే వేగం మారిపోతుంది. స్ట్రోక్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. మెరుగైన గుండె ఆరోగ్యం కోసం, బలమైన ఎముకల కోసం, అభిజ్ఞా పనితీరు కోసం బీర్‌ను చాలా తక్కువగా తీసుకోండి. తాగిన తర్వాత కడుపు తిప్పినట్టు అనిపించినా, కళ్ళు తిరిగినట్టు అనిపించినా, ఆ పానీయాన్ని దూరం పెట్టడమే మంచిది. అందరూ అన్నింటినీ జీర్ణించుకోలేరు.
టాపిక్