Optical Illusion: మీ మెదడుకు ఇదే మా సవాల్, ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో 65 ఎక్కడుందో పది సెకన్లలో చెప్పండి-this is our challenge to your brain tell me in ten seconds where 65 is in this optical illusion ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: మీ మెదడుకు ఇదే మా సవాల్, ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో 65 ఎక్కడుందో పది సెకన్లలో చెప్పండి

Optical Illusion: మీ మెదడుకు ఇదే మా సవాల్, ఈ ఆప్టికల్ ఇల్యూషన్లో 65 ఎక్కడుందో పది సెకన్లలో చెప్పండి

Haritha Chappa HT Telugu
Jun 16, 2024 08:11 PM IST

Optical Illusion: ఆప్టికల్ ఇల్యూషన్లు ఆసక్తిగా ఉంటాయి. అలాంటి నెంబర్ ఆర్టికల్ ఇల్యూషన్ ఇది. ఇందులో దాక్కున్న ఒకే ఒక నెంబర్ 10 సెకన్లలో కనిపెట్టి చెప్పాలి.

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: మీరు తెలివైనవారా? అయితే ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లలో త్వరగా చేధించి చెప్పండి. ఈ ఆప్టికల్ ఇల్యూషన్ చూడగానే మీకు 55 సంఖ్య నిండిపోయి కనిపిస్తుంది. ఆ 55 సంఖ్యల మధ్యలో ఒక చోట మాత్రం 65 సంఖ్య ఇరుక్కుని ఉంది. అది ఎక్కడ ఉందో కనిపెట్టడమే మీ పని. మీరు 10 సెకన్లలో 65 సంఖ్య ఎక్కడుందో కనిపెడితే మీ మెదడు అద్భుతంగా పనిచేస్తున్నట్టే. అరగంట సమయం తీసుకుంటే ఎవరైనా కనిపెట్టేస్తారు. అప్పుడే మీ మెదడు అందరికన్నా చురుగ్గా పనిచేస్తుందని అర్థం. ఇంకెందుకు ఆలస్యం మొదలుపెట్టండి.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

ఈ ఆప్టికల్ ఇల్యూషన్ జవాబును కనిపెట్టేందుకు పది సెకన్ల సమయం దాటిపోతే మీ మెదడు అంతా చురుగ్గా లేదని అర్థం చేసుకోండి. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను సాధన చేయడం ప్రారంభించండి. ఇక జవాబు విషయానికొస్తే ఈ ఆప్టికల్ ఇల్యూషన్లలో కింద నుంచి రెండో అడ్డు వరుసలో చూడండి. ఒకచోట 65 అనే సంఖ్య ఉంది. దీన్ని కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. మీ మెదడు, మీ కంటి చూపు అదుర్స్ అనే చెప్పొచ్చు. రెండూ కలిసి సమర్థంగా పనిచేస్తున్నాయని ఒప్పుకోవచ్చు. ఇక కనిపెట్టలేని వారు ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లు ప్రతిరోజు సాధన చేస్తే మీ మెదడు చురుగ్గా మారుతుంది.

ఆప్టికల్ ఇల్యూషన్లు ఎన్నో రకాలు ఉన్నాయి. కానీ నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఇది ఎదురుగానే జవాబు కనబడుతున్నా... కనిపెట్టలేని పరిస్థితి. ఈజీగా కనిపిస్తున్నా కష్టమైన సమస్య. అందుకే ఇది ఎక్కువ ఆసక్తిని పెంచుతాయి. జవాబు తనలోనే దాచుకున్న ఈ ఆప్టికల్ ఇల్యూషన్ కాసేపు మెదడుకు, కంటిచూపుకు సవాల్ విసురుతుంది. ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను సాధనం చేయడం వల్ల మెదడు పవర్ పెరుగుతుంది. కంటి చూపు, మెదడు కలిసి పనిచేసే సమర్థత పెరిగి జీవితంలో ఎదురైన సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. కాబట్టి పిల్లలకు ఇలాంటివి ఇచ్చి వారిని సాధించమని చెప్పండి. జీవితంలో ఎదురయ్యే సవాళ్లను చూసి వారు భయపడకుండా ఎదుగుతారు. మొదటిసారి మాత్రం గ్రీకు దేశంలో కనిపించాయని అంటారు. విదేశాల్లో ఎంతోమంది చిత్రకారులు ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను చిత్రీకరించడం ద్వారా ఉపాధి పొందుతున్నారు. సోషల్ మీడియాలో ఇవి ఎన్నోసార్లు వైరల్ గా మారుతూ వస్తున్నాయి.

Whats_app_banner