Optical Illusion: ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 24 సంఖ్య తిరగబడి ఉంది, ఒకచోట మాత్రం సరిగ్గా ఉంది, ఎక్కడుందో కనిపెట్టండి-in the given optical illusion number 24 is reversed but one place is correct find where ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Optical Illusion: ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 24 సంఖ్య తిరగబడి ఉంది, ఒకచోట మాత్రం సరిగ్గా ఉంది, ఎక్కడుందో కనిపెట్టండి

Optical Illusion: ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో 24 సంఖ్య తిరగబడి ఉంది, ఒకచోట మాత్రం సరిగ్గా ఉంది, ఎక్కడుందో కనిపెట్టండి

Haritha Chappa HT Telugu
Jun 03, 2024 08:30 AM IST

Optical Illusion: ఆప్టికల్ ఇల్యుషన్లంటే మీకు ఇష్టమా? అయితే అలాంటి మరొక ఆప్టికల్ ఇల్యూషన్ తో మీ ముందుకు వచ్చాము. దీన్ని సాధిస్తే మీరు చాలా తెలివైన వారని అర్థం.

ఆప్టికల్ ఇల్యూషన్
ఆప్టికల్ ఇల్యూషన్

Optical Illusion: నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్లు చాలా ఆసక్తికరంగా ఉంటాయి. అలాంటి నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్ తో మరొకసారి మీ ముందుకు వచ్చాము. దీన్ని మీరు 10 సెకన్లలో చేధిస్తే చాలు. మీ చూపు సూపర్ అని, మీ మెదడు అద్భుతంగా పనిచేస్తుందని ఒప్పుకోవచ్చు. ఇక్కడ ఇచ్చిన ఆప్టికల్ ఇల్యూషన్లో ప్రతి చోటా 24 అనే సంఖ్య ఉంది. అది ప్రతిచోటా తిరగబడి ఉంది. కానీ ఒకచోట మాత్రం సరైన దిశలో రాసి ఉంది. ఆ 24 సంఖ్య సరిగ్గా ఎక్కడ రాసి ఉందో కనిపెట్టాలి. ఎక్కువ సమయం ఇస్తే మీరే కాదు, చిన్నపిల్లలు కూడా కనిపెట్టేస్తారు. అందుకే మేము మీకు ఇచ్చే సమయం కేవలం 10 సెకన్లు.

ఆప్టికల్ ఇల్యూషన్ జవాబు

పది సెకన్లలో మీరు ఆన్సర్ కనిపెడితే మీరు మామూలు వ్యక్తులు కాదు. మీ మెదడు, మీ కంటి చూపు సమన్వయంతో అద్భుతంగా పనిచేస్తున్నాయని అర్థం. మీరు చాలా తెలివైన వారని కూడా అర్థం చేసుకోవాలి. మీ మెదడుకు పదును పెడితే మరిన్ని సమస్యలను పరిష్కరించగలరు. ఇక జవాబు విషయానికి వస్తే చివరి నుంచి నాలుగో లైన్లో ఉంది 24 అనే అంకె. దీన్ని పది సెకన్లలో కనిపెట్టిన వారికి కంగ్రాట్స్. కనిపెట్టలేని వారి కోసమే మేము ఇక్కడ జవాబును ఇచ్చాము.

ఈ ఆప్టికల్ ఇల్యూషన్లను పెద్దవాళ్లకంటే పిల్లలు ఛేదించడం చాలా అవసరం. ఎందుకంటే వారి మెదడు అభివృద్ధి చెందుతున్న దశలో ఉంటుంది. ఆ దశలో ఇలాంటి పజిల్స్ ఇవ్వడం వల్ల మెదడు మరింత చురుగ్గా పనిచేస్తుంది. వారి కంటి చూపు, మెదడు సమన్వయంగా పనిచేస్తేనే సమస్యలను పరిష్కరించే సామర్థ్యం పెరుగుతుంది. జీవితంలో ఎదురయ్యే సమస్యలకు పరిష్కారాలను ఆలోచించాలంటే ముందుగా మెదడు సిద్ధంగా ఉండాలి. ఇలాంటి పజిల్స్ ను సాధించడం ద్వారా మెదడును సిద్ధం చేయవచ్చు.

పిల్లలకు భవిష్యత్తులో కూడా సమస్యలు ఎదురైనప్పుడు వాటికి సరైన పరిష్కారాలను అందించే ఆలోచనా శక్తి, నైపుణ్యం దొరుకుతుంది. కాబట్టి ఇలాంటి ఆప్టికల్ ఇల్యూషన్లను పిల్లలకి ఇచ్చి ప్రాక్టీసు చేయిస్తూ ఉండండి. ఇది వారికి ఎంతో మంచిది. మానసికంగా కూడా వారు చురుగ్గా మారతారు. నిత్యం టీవీలు, ఫోన్లు ఇచ్చే కన్నా ఇలాంటి పజిల్స్ ఇవ్వడం వల్ల వారి చదువుకు కూడా ఎంతో ఉపయోగపడుతుంది.

ఆప్టికల్ ఇల్యూషన్లలో ఎన్నో రకాలు ఉన్నాయి. వాటిలో నెంబర్ ఆప్టికల్ ఇల్యూషన్ ఒకటి. ఏమైనా ఆప్టికల్ ఇల్యూషన్ల చరిత్ర విషయంలో కాస్త గందరగోళం నెలకొని ఉంది. వాటి పుట్టిల్లును గ్రీసు దేశం గా చెప్పుకుంటారు. అక్కడ మాత్రమే పురాతన ఆలయాలపై వీటి చిత్రాలు కనిపించాయి. మిగతా చోట్ల ఎక్కడా కూడా అంత పురాతన చిత్రాలు లభించలేదు. దీంతో మొదట గ్రీకు దేశంలోనే వీటిని సృష్టించి ఉంటారని భావిస్తున్నారు.

Whats_app_banner