Glowing Skin: చర్మం మెరుపు కోసం నెల రోజుల పాటూ ఈ డైట్ ప్లాన్ చేయండి, ఫలితం మీకే కనిపిస్తుంది-follow this diet plan for a month for glowing skin and you will see the result ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Glowing Skin: చర్మం మెరుపు కోసం నెల రోజుల పాటూ ఈ డైట్ ప్లాన్ చేయండి, ఫలితం మీకే కనిపిస్తుంది

Glowing Skin: చర్మం మెరుపు కోసం నెల రోజుల పాటూ ఈ డైట్ ప్లాన్ చేయండి, ఫలితం మీకే కనిపిస్తుంది

Haritha Chappa HT Telugu
Jul 03, 2024 02:30 PM IST

Glowing Skin: క్రీమ్‌లు రాసుకున్నా, ఫేషియల్స్ చేయించుకున్నా చర్మం సహజసిద్ధంగా మెరవదు. చర్మం లోపలి నుంచి ఆరోగ్యంగా ఉంటేనే ముఖంపై మెరుపు రాదు. మీ చర్మాన్ని లోపల్నించి ప్రకాశవంతంగా మెరిసేలా చేసే డైట్ ప్లాన్ ఇక్కడ ఇచ్చాము.

చర్మానికి మెరుపును ఇచ్చే ఆహారం
చర్మానికి మెరుపును ఇచ్చే ఆహారం (shutterstock)

అందమైన, మెరిసే చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. మెరిసే చర్మాన్ని పొందాలంటే, దానిని జాగ్రత్తగా చూసుకోవడం చాలా ముఖ్యం. నేటి జీవితంలో కాలుష్యం వల్ల, జంక్ ఫుడ్ కారణంగా చర్మం పాలిపోయినట్టు మారుతుంది. కాంతిహీనంగా మారుతుంది. ఎన్నో చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. ముఖంపై మచ్చలు, మొటిమల సమస్య ఎక్కువ కనిపిస్తున్నాయి. ఖరీదైన ఉత్పత్తులు వాడినా వాటి వల్ల ఉపశమనం ఉండదు. మీరు కూడా చర్మ సంబంధిత సమస్యలతో బాధపడుతుంటే, ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం పొందాలనుకుంటే, మీ ఆహారంపై కొంచెం శ్రద్ధ వహించాలి. మీ ఆహారంలో కొన్ని రకాల ఆహారాలను తినడం ద్వారా ప్రకాశవంతమైన చర్మాన్ని పొందవచ్చు.

ఆకుకూరలు

ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. వీటిలో విటమిన్లు, మినరల్స్ అధికంగా ఉంటాయి. ఆకుకూరలు తినడం వల్ల శరీరంలో విటమిన్ లోపాలు రాకుండా ఉంటాయి. ఇది హైపర్ పిగ్మెంటేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ఆరోగ్యకరమైన, ప్రకాశవంతమైన చర్మం కోసం, ఆహారంలో ఆకుకూరలను చేర్చడం చాలా అవసరం. ఇది ముఖానికి మంచి మెరుపును అందిస్తుంది.

ముఖానికి ఎంత ఖరీదైన క్రీమ్ అప్లయ్ చేసినా ముఖంపై మెరుపు రాదు. సరైన మోతాదులో నీళ్లు తాగితేనే ముఖం మెరుస్తుంది. మీరు రోజంతా కనీసం 3 నుండి 4 లీటర్ల నీరు త్రాగాలి. నీరు తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్ గా ఉంటుంది. టాక్సిన్స్ శరీరం నుండి బయటకు వస్తాయి. ఇది చర్మం మెరిసేలా చేస్తుంది.

నిమ్మరసం, కలబంద రసంతో

నిమ్మరసం లేదా కలబంద రసంతో వంటివి తాగడం వల్ల చర్మం మెరిసిపోతుంది. లెమన్ వాటర్ తాగడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ బయటికి పోతాయి. ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. కలబంద రసాన్ని కూడా తాగడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

మెరిసే చర్మం కోసం పండ్లను డైలీ డైట్ లో చేర్చుకోవాలి. పండ్లలో ఉండే విటమిన్లు, అనేక పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా, మెరిసేలా చేస్తాయి. దీనితో పాటు, ఆహారంలో సలాడ్ ఖచ్చితంగా చేర్చండి. కీరా దోసకాయ, క్యారెట్, టమోటా, క్యాబేజీ, బీట్ రూట్‌ను సలాడ్ లో వాడండి. ఇవన్నీ అనేక విటమిన్లు, ఖనిజాలతో సమృద్ధిగా ఉంటాయి. ఇవి తినడం ద్వారా ఆరోగ్యానికి, చర్మానికి ప్రయోజనం చేకూరుస్తాయి.

హెల్తీ అండ్ గ్లోయింగ్ స్కిన్ పొందాలంటే డైట్ రొటీన్ ను సకాలంలో తినాలి. ప్రతిరోజూ ఉదయం నిర్ణీత సమయంలో ఆరోగ్యకరమైన అల్పాహారం తినండి. సరైన సమయానికి లంచ్ తినాలి. మధ్యాహ్న భోజనంలో ఆకుపచ్చ కూరగాయలు, సలాడ్లు, పెరుగు, పండ్లు ఉండేలా చూసుకోండి. బయట జంక్ ఫుడ్ తినడానికి బదులుగా ఆరోగ్యకరమైన స్నాక్స్, స్మూతీలను తినేందుకు ప్రయత్నించండి.

రోజూ కప్పు పెరుగు తినడం ద్వారా కూడా ఎన్నో చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. మజ్జిగ తాగడం వల్ల కూడా చర్మానికి ఎంతో మేలు జరుగుతుంది. బయటి నుంచి ఇంటికి వచ్చాక వెంటనే ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. మురికి ఎక్కువ కాలం చర్మంపై ఉంటే దురద వంటివి వస్తాయి.

Whats_app_banner