ఏ రోగాన్ని దారి చేరనివ్వకుండా శరీరాన్ని రక్షించే ఆహారాలు..

Pixabay

By Sharath Chitturi
Oct 31, 2023

Hindustan Times
Telugu

మనం తినే ఆహారాల బట్టే మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. అందుకే ఏం తింటున్నాము అనేది చాలా ముఖ్యం. రోజూ ఆకుకూరలు తింటే.. అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

Pixabay

ఆకుకూరల్లో విటమిన్​ ఏ, విటమిన్​ సీ, ఐరన్​, కాల్షియం, పొటాషియం వంటివి పుష్కలంగా లభిస్తాయి.

Pixabay

కంటి చూపు, చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే శక్తి ఆకుకూరల సొంతం. ఆకు కూరలతో జీర్ణక్రియ ప్రక్రియ మెరుగుపడుతుంది.

Pixabay

తక్కువ కేలరీలతోనే అధిక మొత్తంలో పోషకాలు ఇవ్వడం.. ఆకుకూరల్లో ఉన్న విశిష్టత!

Pixabay

పాలకూర, తోటకూర, మెంతికూర వంటి ఆకుకూరలు మీ డైట్​లో కచ్చితంగా ఉండాల్సిందే.

Pixabay

ఆకుకూరలతో పప్పులు మాత్రమే చేసుకోవడం కాకుండా.. సలాడ్​ వంటివి కూడా ట్రై చేస్తే, రుచితో పాటు ఆరోగ్యం పొందొచ్చు.

Pixabay

కొన్ని ఆకుకూరలతో సూప్​ కూడా చేసుకోవచ్చు. వీటిని బ్రేక్​ఫాస్ట్​ లేదా, డిన్నర్​కి తీసుకోవచ్చు. లో-కేలరీ డైట్​ మెయిన్​టైన్​ చేస్తున్నట్టే!

Pixabay

శరీరంలో ఐరన్ సరిపడా ఉండటం ఎంతో ముఖ్యం. ఇది పుష్కలంగా లభించే కూరగాయలు కొన్ని ఉన్నాయి

pexels