Ragi Carrot Roti : రాగి క్యారెట్ రోటి.. అల్పాహారంలోకి ఆరోగ్యకరమైనది
Ragi Carrot Roti : రాగి క్యారెట్ రోటి ఎప్పుడైనా ఇది తిన్నారా? ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. దీనితో ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.
ఎల్లప్పుడూ ఉదయం ఇడ్లీ, దోసెను తయారు చేస్తారా? ఇడ్లీ, దోసె తిని బోర్ కొట్టిందా? ఇంట్లో రాగుల పిండి, క్యారెట్ ఉంటే దానితో రాగి రోటి చేసి తినండి. ఈ రాగి క్యారెట్ రుచికరమైనది, పోషకమైనది కూడా. శరీరానికి ఎన్నో ప్రయోజనాలు అందిస్తుంది. ఆరోగ్యానికి అనేక రకాలుగా ఉపయోగాలు ఉన్నాయి. చేయడం కూడా చాలా ఈజీ. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ముఖ్యంగా దీనికి సైడ్ డిష్ అవసరం లేదు.
రాగి క్యారెట్ రోజు ఎలా చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా? రాగి క్యారెట్ రెసిపీ తయారుచేసే పద్ధతి కింది విధంగా ఉంది.
రాగి క్యారెట్ రోటికి కావాల్సిన పదార్థాలు
రాగుల పిండి - 1 కప్పు, నూనె - 2 tsp, ఆవాలు - 1/4 tsp, జీలకర్ర - 1/2 tsp, ఉల్లిపాయ - 1 (సన్నగా తరిగినవి), పచ్చిమిర్చి - 2 (సన్నగా తరిగినవి), కరివేపాకు - 1 కట్ట (సన్నగా తరిగినవి), పెద్ద క్యారెట్ - 1 (తురిమినది), కొత్తిమీర - కొద్దిగా (సన్నగా తరిగినది), ఉప్పు - రుచి ప్రకారం, నీరు - అవసరం మేరకు
రాగి క్యారెట్ రోటి తయారీ విధానం
ముందుగా గ్యాస్ మీద ఓ గిన్నె పెట్టి అందులో రాగుల పిండి వేసి కొద్దిగా వేయించాలి.
తర్వాత మరో గిన్నెలోకి తీసుకోవాలి.
ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టి అందులో నూనె పోసి వేడయ్యాక ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు వేయాలి.
అనంతరం అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయను వేసి, కొద్దిగా ఉప్పు చల్లి వేగించాలి.
తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసి కాసేపు వేయించాలి.
ఇప్పుడు అందులో క్యారెట్ తురుము వేసి క్యారెట్ రంగు మారే వరకు వేయించి, కొత్తిమీర చల్లి ఒకసారి వేయించాలి.
ఆ తర్వాత రాగుల పిండితో బాగా కలుపుతూ, కొద్దికొద్దిగా నీళ్లు పోసి ముద్దలా చేసుకోవాలి.
తర్వాత మెత్తగా నూరిన పిండిని రోల్ చేసి ప్లేటులో పెట్టుకోవాలి.
అనంతరం అరటి ఆకు లేదా పాల కవర్ తీసుకుని దానికి నూనె రాసి బాల్ లా చుట్టి రోటిలా చేసుకోవాలి.
చివరగా గ్యాస్ మీద పెనం పెట్టి వేడి అయ్యాక కాస్త నూనె రాసుకోవాలి. తర్వాత తయారు చేసిన రోటిని పెనంపై పెట్టి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే రుచికరమైన రాగి క్యారెట్ రోటి రెడీ.