పెరుగులో చియా సీడ్స్ కలిపి తింటే ఏమవుతుంది..! ఈ విషయాలు తెలుసుకోండి

By Maheshwaram Mahendra Chary
Jun 30, 2024

Hindustan Times
Telugu

చియా గింజల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది. మరోవైపు పెరుగులో అధిక ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది. ఈ రెండింటి కలిపి తినటం ద్వారా  బరువును నియంత్రించవచ్చు

image credit to unsplash

చియా సీడ్స్ జీర్ణక్రియకు మంచి తోడ్పాటునిస్తాయి. ఆరోగ్యకరమైన ప్రేగులను ప్రోత్సహిస్తుంది. ప్రోబయోటిక్స్ ఉన్న పెరుగుతో కలిపినప్పుడు... ఇది ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థకు మద్దతుగా నిలుస్తుంది.

image credit to unsplash

పెరుగు మరియు చియా గింజలు రక్తంలోని చక్కెరను నియంత్రించడంలో సహాయపడవచ్చు.

image credit to unsplash

చియా విత్తనాల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. వీటిని పెరుగులో చేర్చి తినటం ద్వారా మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. 

image credit to unsplash

చియా గింజలు యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంటాయి. పెరుగుతో కలిపి తినటం వల్ల గుండె మరియు మెదడు ఆరోగ్యానికి తోడ్పడతాయి.

image credit to unsplash

చియా గింజలు మరియు పెరుగు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఫలితంగా అనారోగ్యం బారిన పడకుండా ఉండొచ్చు.

image credit to unsplash

కాల్షియం, మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన పోషకాలను అధికంగా ఉన్న చియా విత్తనాలు మంచి ఎముక ఖనిజ సాంద్రతను నిర్వహించడానికి సహాయపడతాయి. పెరుగుతో కలిపి చియా గింజలను తినటం ద్వారా... ఎముకలు మరింత బలోపేతంగా తయారవుతాయి.

image credit to unsplash

అల్సర్లు ఉంటే కచ్చితంగా తినకూడని ఆహారాలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకోండి

pexels