Foods For Skin : ఇవి సన్‌స్క్రీన్‌లా ఉపయోగపడతాయి.. చర్మాన్ని కాపాడుతాయి
Foods For Skin In Summer : కొన్ని ఆహారాలు మీ చర్మాన్ని కాపాడుతాయి. వేసవిలోనూ చర్మం మెరిసిపోయేలా చేస్తాయి. వాటిని కచ్చితంగా తీసుకోవాలి.
వేసవి కాలం వచ్చిందంటే సూర్యరశ్మి వల్ల చర్మంపై దుష్ప్రభావాలతో అందరికీ భయం. మనలో చాలామంది సూర్యుని నుండి మనల్ని మనం రక్షించుకోవడానికి సన్‌స్క్రీన్‌పై ఆధారపడతారు. మండుతున్న ఎండ నుండి మనల్ని రక్షించుకోవడానికి మంచి లోషన్ లేదా జెల్ కలిగి ఉండటం చాలా అవసరం.
కొన్ని ఆహారాలు విపరీతమైన వేడిని నివారించడానికి, మీ చర్మాన్ని రక్షించడానికి సన్‌స్క్రీన్ లాగా పనిచేస్తాయి. ఎండ నుండి మిమ్మల్ని రక్షించడానికి ఉత్తమమైన ఆహారాలు ఏంటో మీరు తెలుసుకోవాలి. శరీరం ఎలా పనిచేస్తుందో నిర్ణయించడంలో మీ ఆహారం పెద్ద పాత్ర పోషిస్తుంది. వేసవిలో అధికంగా నీరు ఉండే ఆహారాన్ని తినడం వల్ల శరీరం సోడియం, పొటాషియం, మాంగనీస్‌ను నిర్వహించడంలో సహాయపడుతుంది. ఇది కోల్పోయిన ద్రవాలు, పోషకాలను తిరిగి నింపుతుంది. అలాగే, అధిక నీటి కంటెంట్ ఉన్న ఆహారాలు మీరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి, సూర్యుని రేడియేషన్‌ను నిరోధించడంలో సహాయపడతాయి. ఇది చర్మం రంగు పాలిపోవడాన్ని, ఇతర వేడి-సంబంధిత ఆరోగ్య ప్రమాదాలను నివారిస్తుంది.
నిమ్మరసంతో ఉపయోగాలు
నిమ్మరసం బయట ఉన్న తీవ్రమైన వేడిని తగ్గిస్తుంది. తక్షణమే చల్లబరుస్తుంది. అయితే నిమ్మరసం కూడా సహజమైన సన్‌స్క్రీన్ అని మీకు తెలుసా? నిమ్మకాయల్లో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి UV కిరణాలను నిరోధించడంలో సహాయపడతాయి. ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా చర్మాన్ని కాపాడతాయి. వేసవిలో నిమ్మరసం తాగాలి. చర్మానికి చాలా మంచిది.
పెరుగుతో చేసిన ఆహారాలు
పెరుగు, లస్సీ వంటి పానీయాలు.. పెరుగుతో చేసిన ఆహారాలు ఆహారం నుండి పోషకాలను గ్రహించడంలో సహాయపడతాయి. హానికరమైన సూర్య కిరణాల నుండి చర్మాన్ని కాపాడతాయి. ఇది ముడతలు, ఫైన్ లైన్లను నివారించడానికి సహాయపడుతుంది.
గ్రీన్ టీ కూడా ముఖ్యమే
మీరు బరువు తగ్గడానికి లేదా జీర్ణక్రియను మెరుగుపరచడానికి గ్రీన్ టీ తాగితే మీరు వేసవి కాలంలో దాని నుండి అదనపు ప్రయోజనాలను పొందవచ్చు. ఈ హెల్త్ డ్రింక్‌లో ఉండే పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ కారణంగా ఇది టాన్‌ను నివారించడంలో కూడా సహాయపడుతుంది. ఇది సూర్యకాంతి యొక్క ప్రతికూల ప్రభావాలను నివారించడానికి ఉపయోగపడుతుంది.
టొమాటోలు వేసవిలో తినాలి
టొమాటోలు సూర్యుడి నుంచి వచ్చే చర్మ సంబంధిత సమస్యలన్నింటికీ పరిష్కారం. టొమాటోస్‌లో లైకోపీన్ ఉంటుంది. ఇది UVA, UVB రేడియేషన్‌లను గ్రహిస్తుంది. సన్‌బర్న్ ప్రమాదాన్ని నివారిస్తుంది. అందుకే ఎండాకాలంలో టొమాటోలను మీ ఆహారంలో చేర్చుకోవచ్చు.
కలబంద జ్యూస్ తాగండి
కలబంద ఎల్లప్పుడూ సహజమైన మాయిశ్చరైజర్‌గా పిలువబడుతుంది. ఇది చర్మాన్ని పోషించడంలో, మృదువుగా చేయడానికి సహాయపడుతుంది. సూర్యరశ్మికి కూడా ఇంటి నివారణ. ఇది చర్మంలోని మలినాలను తొలగించి స్కిన్ టోన్ మెరుగుపరచడంలో సహాయపడుతుంది. కలబంద జ్యూస్ చేసుకుని ఎండాకాలం తాగితే మీరు ఉత్తమ ఫలితాలు చూడవచ్చు.