Vegetable Croquets Recipe | । క్రిస్పీగా, మృదువుగా ఉండే వెజ్ క్రాకెట్స్.. వీటి రుచి అదుర్స్!
Vegetable Croquets Recipe: వెజిటెబుల్ క్రాకెట్స్ బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రుచికరమైన స్నాక్స్. రెసిపీ ఈ కింద ఉంది.
సాయంత్రం వేళ స్నాక్స్ లేకపోయినా, పార్టీలో స్టార్టర్స్ లేకపోయినా ఏదో అసంపూర్ణంగా ఉన్నట్లు అనిపిస్తుంది. మీ మనసుకు ఏదైనా రుచికరంగా తినాలనిపించినపుడు స్నాక్స్- స్టార్టర్ కలయికలా అనిపించే ఒక రెసిపీని మీకు ఇప్పుడు తెలియజేయబోతున్నాం. బంగాళాదుంపలు, క్యారెట్, క్యాబేజీ, కాలీఫ్లవర్, బీన్స్ అన్నీ కలిపి చేసే ఈ స్నాక్స్ ఎంతో రుచికరంగా ఉంటుంది. ఈ చలికాలంలో చిరుతిళ్లు తినాలని కోరుకునే మీ మనస్సుని సంతృప్తి పరుస్తుంది.
మీరు వెజిటెబుల్ క్రాకెట్స్ ఎప్పుడైనా తిన్నారా? ఇదొక డీప్-ఫ్రైడ్ రోల్, అల్పాహారం లేదా ఫాస్ట్ ఫుడ్‌గా తీసుకుంటారు. మెయిన్ డిష్ లోకి సైడ్ డిష్ గా తీసుకున్నా అద్భుతంగా ఉంటుంది. దీనిని తయారు చేయడం చాలా సులభం. పండగ సందర్భంగా మీ ఇంటికి వచ్చే అతిథులకు టీ టైంలో ఈ క్రాకెట్స్ అందించి వారిని ఆనందపరచవచ్చు. మరి వెజిటెబుల్ క్రాకెట్స్ కోసం ఏమేం పదార్థాలు కావాలి, ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకోండి, వెజిటెబుల్ క్రాకెట్స్ రెసిపీ ఈ కింద ఉంది, ఇక్కడ సూచించినట్లుగా తయారు చేస్తే అదిరిపోయే స్నాక్స్ రెడీ.
Vegetable Croquets Recipe కోసం కావలసినవి
- బంగాళదుంపలు - 250 గ్రా
- క్యాబేజీ - 50 గ్రా
- కాలీఫ్లవర్ - 50 గ్రా
- క్యారెట్ - 50 గ్రా
- ఫ్రెంచ్ బీన్స్ - 50 గ్రా
- పచ్చిమిర్చి - 10 గ్రా
- అల్లం - 10 గ్రా
- ఉప్పు - 0.5 గ్రా
- ఎర్ర మిరపకాయ - 10 గ్రా
- గరం మసాలా - 10 గ్రా
- చాట్ మసాలా - 10 గ్రా
- కొత్తిమీర - 20 గ్రా
- బ్రెడ్ ముక్కలు - 100 గ్రా
- నూనె - 10 గ్రా
వెజ్ క్రాకెట్స్ తయారీ విధానం
- బంగాళాదుంపలను ఉడికించి మెత్తగా చేసుకోండి, ఆపైన మిగతా కూరగాయలను చాలా చిన్నని ముక్కలుగా కట్ చేసుకోండి.
- మెత్తని బంగాళాదుంప గుజ్జులో కట్ చేసిన కూరగాయలను, మసాలాలను కలిపి మీకు నచ్చిన ఆకృతిలో చిన్నచిన్న ముద్దలుగా చేసుకోండి.
- ఆపై బ్రెడ్ ముక్కల పొడిలో ముంచి, వేడివేడి నూనెలో బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి.
అంతే బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే రుచికరమైన వెజ్ క్రాకెట్స్ రెడీ. వేడివేడిగా తింటూ టీ తాగుతూ చల్లని సాయంత్రాన్ని ఆస్వాదించండి.
సంబంధిత కథనం