Summer Fruit Face Packs : వేసవిలో మెరిసే చర్మం కోసం కొన్ని ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయండి
Fruit Face Packs In Telugu : మెరిసే చర్మం కావాలని అందరూ కోరుకుంటారు. కానీ వేసవిలో సరైన చర్మ సంరక్షణ ఉంటేనే ఇది సాధ్యం. కొన్ని రకాల ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ మీ చర్మాన్ని అందంగా చేస్తాయి.
పండ్లు తినడం చర్మానికి చాలా ప్రయోజనాలు కలిగిస్తాయి. చర్మ ప్రయోజనాలు కేవలం తింటే మాత్రమే అనుకుంటే మీరు పొరబడినట్టే. విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, సహజ ఆమ్లాలు సమృద్ధిగా ఉండే పండ్లు మీ చర్మాన్ని కాంతివంతం చేస్తాయి. తాజా పండ్లను ఆస్వాదించడానికి వేసవి కాలం అనువైన కాలం. ఇది మన ఆరోగ్యానికి మాత్రమే కాకుండా మీ చర్మాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. పండ్ల చర్మ ప్రయోజనాలు తినడంతోపాటు కొన్ని రకాల ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకుంటే కూడా లభిస్తాయి.
ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ తయారు చేసి పెట్టుకోవడం వలన మీ మెుత్తం చర్మం బాగుంటుంది. మీ ముఖం మెరిసిపోతుంది. వేసవి వస్తే చాలా మంటి సన్ టాన్ సమస్యను ఎదుర్కొంటారు. దీని నుంచి బయటపడేందుకు మీ చర్మానికి ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ వాడుకోవచ్చు. మీ ఇంట్లో ఉండే ఈ నేచురల్ బ్యూటీ ప్రొడక్ట్స్ తయారు చేసుకోవచ్చు. కేవలం మీరు మార్కెట్లోకి వెళ్లి పండ్లు తెచ్చుకుంటే సరిపోతుంది. ఏయే పండ్లతో ఏమేం కలిపి ఫ్రూట్ ఫేస్ ప్యాక్స్ తయారు చేసుకోవచ్చో చూద్దాం..
కివీ, అవకాడో ఫేస్ ప్యాక్
కివీ, అవకాడో ఫేస్ ప్యాక్ ముఖాన్ని కాంతివంతంగా మార్చడంలో సహాయపడతాయి. రెండింటిలోనూ చర్మానికి అద్భుతాలు చేసే అనేక గుణాలు ఉన్నాయి. మీరు ఈ ప్యాక్‌ని యాంటీ ఏజింగ్ ఫేస్ ప్యాక్ అని కూడా పిలవవచ్చు. ఇందులో విటమిన్ ఎ, బి, సి ఉంటాయి. దీన్ని తయారు చేయడానికి కివీ, అవకాడో గుజ్జును తీసుకోండి. క్రీమీ పేస్ట్ పొందడానికి వాటిని కలిపి మెత్తగా చేయాలి. మీరు ఈ మిశ్రమానికి తేనెను జోడించవచ్చు. ముఖం, మెడపై అప్లై చేసి 20 నిమిషాల తర్వాత ప్యాక్‌ని తొలగించండి. చల్లటి నీటితో కడగండి.
బొప్పాయి, తేనె ఫేస్ ప్యాక్
బొప్పాయి విటమిన్లు, ఎంజైమ్‌ల పవర్‌హౌస్. ఇది మీ చర్మానికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి పండిన బొప్పాయిని మాష్ చేయండి. దానికి ఒక టేబుల్ స్పూన్ ఆర్గానిక్ తేనె కలపండి. బాగా కలిపిన తర్వాత ముఖానికి సమానంగా అప్లై చేసి 15-20 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. బొప్పాయి మృతకణాలను తొలగించడంలో సహాయపడుతుంది. తేనె చర్మాన్ని తేమ చేస్తుంది. వేసవిలో మీ చర్మాన్ని అందంగా ఉంచుతుంది.
మామిడి, పెరుగు ఫేస్ ప్యాక్
మామిడిలో ఉండే విటమిన్ సి, ఇ చర్మాన్ని UV కిరణాల నుండి రక్షిస్తాయి. కణాల పునరుత్పత్తిని ప్రోత్సహిస్తాయి. ఇది చర్మ స్థితిస్థాపకతను పెంచడానికి కూడా పనిచేస్తుంది. పెరుగులో కలిపి తీసుకుంటే మొటిమల సమస్య తొలగిపోతుంది. ఈ ఫేస్ ప్యాక్ సిద్ధం చేయడానికి, పండిన మామిడి గుజ్జును తీసుకుని, పెరుగుతో కలపండి. దీన్ని నేరుగా ముఖంపై రుద్దండి. ఇది ముఖంలోని మురికిని తొలగిస్తుంది, అడ్డుపడే రంధ్రాలను కూడా శుభ్రపరుస్తుంది.
అరటిపండ్ల ఫేస్ ప్యాక్
అరటిపండ్లలో విటమిన్ బి6, సి, సిలికా, పొటాషియం, ఇతర పోషకాలు ఉన్నాయి. ఇవి చర్మానికి చాలా మేలు చేస్తాయి. ఇది UV కిరణాల వల్ల కలిగే నష్టం, హైపర్పిగ్మెంటేషన్ నుండి చర్మాన్ని రక్షిస్తుంది. అరటిపండు, అర చెంచా తేనె, చెంచా నిమ్మరసం కలిపి ఈ ప్యాక్‌ను తయారు చేసుకోవాలి. బాగా కలపండి, ముఖం మీద సమానంగా అప్లై చేయండి. ఈ ప్యాక్ ఆరిపోయే వరకు ఉంచి తర్వాత కడిగేయాలి.
యాపిల్ నారింజ ఫేస్ ప్యాక్
కొన్ని యాపిల్, నారింజ ముక్కలను కలపండి. దానికి కొంచెం పసుపు, పాలు మిక్స్ చేయాలి. ఈ ప్యాక్‌ని ముఖం, మెడపై రాసుకోవాలి. 15-20 నిమిషాల తర్వాత కడగాలి. ఇది యాంటీఆక్సిడెంట్ రిచ్ ఫేస్ ప్యాక్, చర్మానికి పోషణనిస్తుంది. ఇది చర్మానికి మెరుపు కూడా తెస్తుంది.