బొప్పాయి పండులో చాలా పోషకాలు ఉంటాయి. ఆరోగ్యానికి మేలు చేస్తుంది. అలాంటి బొప్పాయి పండును ఉదయాన్నే పరగడుపున (ఖాళీ కడుపు) తింటే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. అవేంటో ఇక్కడ చూడండి.
Photo: Pexels
పొద్దున పరగడుపునే బొప్పాయి పండు తినడం వల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది. మలబద్దకం లాంటి సమస్యలు తగ్గేందుకు ఉపకరిస్తుంది.
Photo: Pexels
బొప్పాయిలో విటమిన్ సీ, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అందుకే దీన్ని తింటే రోగ నిరోధక శక్తి మెరుగవుతుంది. శరీరంలోని వ్యర్థాలు బయటికి వెళ్లేందుకు కూడా ఇది సహకరిస్తుంది.
Photo: Pexels
బొప్పాయిలో విటమిన్ కే ఎక్కువగా ఉంటుంది. దీంతో ఇవి తింటే కాల్షియమ్‍ను శరీరం మెరుగ్గా శోషించుకుంటుంది. దీంతో ఎముకల దృఢత్వం పెరుగుతుంది.
Photo: Pexels
బొప్పాయిలో ఫైబర్ ఎక్కువగా, షుగర్ తక్కువగా ఉంటుంది. దీంతో ఖాళీ కడుపుతో ఈ పండు తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరగకుండా ఫైబర్ నియంత్రిస్తుంది.
Photo: Pexels
బొప్పాయిలో క్యాలరీలు చాలా తక్కువగా ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారు ఖాళీ కడుపుతో ఈ పండును తింటే మేలు. ఎక్కువ సేపు కడుపు నిండుగా ఉన్న ఫీలింగ్‍ను ఈ పండు కలిగించగలదు.
Photo: Unsplash
శరీరంలో యూరిక్ యాసిడ్‍ను సహజంగా తగ్గించగల ఆహారాలు ఇవి