ఖర్జూరాల్లో చాలా విటమిన్స్, మినరల్స్ లాంటి పోషకాలు ఉంటాయి. దీంతో వీటిని తింటే చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. అయితే, వీటి వల్ల చర్మానికి కూడా మేలు జరుగుతుంది. ఖర్జూరాలు తింటే చర్మానికి కలిగే ముఖ్యమైన ప్రయోజనాలు ఏవో ఇక్కడ చూడండి.
Photo: Pexels
ఖర్జూరాల్లో విటమిన్ బీ5, ప్రొటీన్, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో వీటిని రెగ్యులర్‌గా తింటే మొటిమలు, మచ్చలు తగ్గేందుకు ఉపయోగపడతాయి.
Photo: Pexels
ఖర్జూరాల్లో విటమిన్ ఏ, ఐరన్ కూడా మెండుగా ఉంటుంది. దీంతో ఇవి తింటే చర్మపు మెరుపు పెరుగుతుంది.
Photo: Pexels
ఖర్జూరాల్లో విటమిన్ సీ, డీ ఎక్కువగా ఉంటాయి. ఇవి కొలీజన్ ఉత్పత్తిని పెంచుతాయి. దీని ద్వారా చర్మంపై ముడతలు తగ్గుతాయి.
Photo: Pexels
పెదవులపై పగుళ్లు తగ్గడంలో కూడా ఖర్జూరాలు తోడ్పడతాయి. వీటిలో ఉండే విటమిన్ ఏ ఇందుకు సహకరిస్తుంది. ఇవి తింటే పెదాలు తరచూ పొడిబారడం తగ్గుతుంది.
Photo: Pexels
ఖర్జూరాల్లో యాంటిఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. దీంతో కణాలు డ్యామేజ్, మంట కలగకుండా కాకుండా ఇది చేస్తుంది. దీంతో చర్మం మృధుత్వం, మెరుపు పెరుగుతుంది.
Photo: Pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి