Beetroot Cutlet Recipe। బీట్‌రూట్ కట్‌లెట్.. అద్భుతమైన టేస్ట్, మాన్‌సూన్‌కి పర్‌ఫెక్ట్!
Beetroot Cutlet Recipe: ఇక్కడ మీకోసం మిల్లెట్ బీట్‌రూట్ కట్‌లెట్ రెసిపీని అందిస్తున్నాం. ఇది మీకు పర్ఫెక్ట్ మాన్సూన్ ట్రీట్ అవుతుంది.
Beetroot Cutlet Recipe (istock)
Monsoon Recipes: గత కొన్ని రోజులుగా మీరు ఉదయం లేచేటపుడు వర్షమే, సాయంత్రం అయిమప్పుడు కూడా వర్షమే. నిరంతరాయంగా కురుస్తున్న వర్షాలు, చల్లటి వాతావరణం మిమ్మల్ని బద్ధకస్తులుగా చేస్తుండవచ్చు, సూర్యుడు కనిపించకపోవడంతో వెచ్చదనం కోల్పోతుండవచ్చు. అయితేనేం, వేడివేడి స్నాక్స్ తింటూ యాక్టివ్ అయిపోండి. ఇక్కడ మీకోసం మిల్లెట్ బీట్‌రూట్ కట్‌లెట్ రెసిపీని అందిస్తున్నాం. ఇది మీకు పర్ఫెక్ట్ మాన్సూన్ ట్రీట్ అవుతుంది.
ఈ కట్‌లెట్‌లను బీట్‌రూట్, క్వినోవా మిల్లెట్లతో తయారు చేస్తాము. అందువల్ల ఇవి రుచికరమైనవే కాకుండా, ఆరోగ్యకరమైనవి కూడా. ఎలా చేయాలో ఈ కింద సూచనలు చదవండి.
Quinoa Beetroot Cutlet Recipe కోసం కావలసినవి
- 1 కప్పు క్వినోవా
- 1 కప్పు ఉడికించిన బంగాళాదుంప
- ½ కప్పు తురిమిన బీట్‌రూట్
- 1 tsp అల్లం తురుము
- ½ tsp వెల్లుల్లి తురుము
- 1 స్పూన్ గరం మసాలా
- 1 tsp దాల్చిన చెక్క పొడి
- 1 కప్పు బ్రెడ్ ముక్కలు
- కొద్దిగా మైదాపిండి
- రుచికి సరిపడా ఉప్పు
- వేయించడానికి నూనె
క్వినోవా బీట్‌రూట్ కట్‌లెట్స్ తయారీ విధానం
- ముందుగా క్వినోవాను కడిగి బాగా ఉడికించాలి. ఆపైన చల్లబరచండి.
- అనంతరం ఒక మిక్సింగ్ గిన్నెలో, ఉడికించిన క్వినోవా, బంగాళాదుంప గుజ్జు, తురిమిన బీట్‌రూట్, తరిగిన అల్లం, తరిగిన వెల్లుల్లి, గరం మసాలా, దాల్చిన చెక్క పొడిని వేసి బాగా కలపండి, ఆపై చిన్న కట్‌లెట్‌లుగా మార్చండి.
- ఇప్పుడు మైదాపిండిలో కొన్ని నీళ్లు కలిపి, సిద్ధం చేసుకున్న ప్రతి కట్‌లెట్‌ను ఆ పిండిలో ముంచండి.
- అలాగే కట్లెట్లను బ్రెడ్ ముక్కల్లో రోల్ చేసి పూతగా పూయండి. ఆపైన కట్లెట్‌లను 15 నిమిషాలు రిఫ్రిజిరేటర్‌లో ఉంచండి.
- అనంతరం మీడియం మంట మీద పాన్లో నూనెను వేడి చేయండి. కట్లెట్లను వేడి నూనెలో రెండు వైపులా బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి.
- అనంతరం పాన్ నుండి తీసిన కట్లెట్ల నుంచి నూనెను పీల్చుకోవడానికి వాటిని కాగితపు టవల్ మీద ఉంచండి.
అంతే, క్వినోవా బీట్‌రూట్ కట్‌లెట్‌లు తినడానికి సిద్ధంగా ఉన్నాయి. వీటిని పుదీనా చట్నీతో వేడిగా సర్వ్ చేయండి.
సంబంధిత కథనం
టాపిక్