Cauliflower Upma Recipe।కాలీఫ్లవర్ ఉప్మా.. కీటోజెనిక్ డైట్ ఫాలో అయ్యే వారికి ఇది గొప్ప బ్రేక్‌ఫాస్ట్!
Cauliflower Upma Recipe: కీటోజెనిక్ డైట్ పాటించే వారికి కాలీఫ్లవర్ ఉప్మా మంచి శాకాహార అల్పాహారం అవుతుంది. కాలీఫ్లవర్ ఉప్మా రెసిపీని ఇక్కడ అందిస్తున్నాము
Healthy Breakfast Recipes: ఉప్మా చేయడానికి మీకు రవ్వ అవసరం అవుతుంది. కానీ, కాలీఫ్లవర్ ఉప్మా చేయటానికి అసలు రవ్వ అవసరమే ఉండదు. అందుకే ఇది కీటోజెనిక్ డైట్ పాటించేవారికి మంచి శాకాహార అల్పాహారం అవుతుంది. బరువు తగ్గాలనుకునే వారు తప్పకుండా తినాల్సిన ఆహరం. కాలీఫ్లవర్ అనేది ఏ సీజన్‌లోనైనా లభించే ఒక కూరగాయ. దీనితో వండే ఎలాంటి వంటకమైన ఎంతో రుచిగా ఉంటుంది.
కాలీఫ్లవర్ ఫైబర్ ఉంటుంది, బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి ఫైబర్ కలిగిన ఆహారాలు ఎక్కువ తినాలి. ఇంకా ఇందులో బి-విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లను కూడా అందిస్తుంది, ఇవి క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధిస్తాయి. అంతేకాకుండా జ్ఞాపకశక్తికి, మెదడు చురుకుదనానికి అవసరమైన కోలిన్ వంటి ముఖ్యమైన పోషకాలను కూడా కలిగి కాలీఫ్లవర్ ఉంటుంది.
కాలీఫ్లవర్ ఉప్మా రెసిపీని ఇక్కడ అందిస్తున్నాము, ఇది చేయడం చాలా సులభం, ఎంతో రుచికరంగానూ ఉంటుంది. కాలీఫ్లవర్ ఉప్మా ఎలా చేయాలో ఈ కింద తెలుసుకోండి.
Cauliflower Upma Recipe కోసం కావలసినవి
- 1.5 కప్పు కాలీఫ్లవర్ ముక్కలు
- 1/4 కప్పు టమోటా ముక్కలు
- 1/4 కప్పు ఉల్లిపాయ ముక్కలు
- 1 tsp తరిగిన అల్లం
- 1 టేబుల్ స్పూన్ నెయ్యి లేదా వెన్న లేదా నూనె
- 4-5 కరివేపాకు
- 1/4 టీస్పూన్ ఆవాలు
- 1/4 tsp జీలకర్ర
- 1 స్పూన్ పసుపు పొడి
- 1-2 చిటికెడు నల్ల మిరియాల పొడి
- 1 టేబుల్ స్పూన్ వేరుశనగ
- 1 పచ్చి మిరపకాయ
- రుచికి తగినంత ఉప్పు
- 1 టీస్పూన్ రుచికి నిమ్మరసం
- కొత్తిమీర గార్నిషింగ్ కోసం
కాలీఫ్లవర్ ఉప్మా తయారీ విధానం
- ఒక పాన్‌లో నెయ్యి వేసి, మీడియం మంట మీద వేడిచేయాలి, నెయ్యి వేడి అయ్యాక, అందులో ఆవాలు, జీలకర్ర, అల్లం, కరివేపాకు, వేరుశనగలను వేసి వేయించండి.
- ఆపైన ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసి అవి అపారదర్శకంగా కనిపించే వరకు వేయించాలి. అనంతరం టమోటాలు వేసి అవి మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి.
- ఇప్పుడు కాలీఫ్లవర్ పువ్వు భాగాన్ని రవ్వలాగా తురుముకొని వేయాలి, ఆపైన ఉప్పు వేసి బాగా కలుపండి.
- ఇప్పుడు మూతపెట్టి కాలీఫ్లవర్ ఉడికేంత వరకు బాగా ఉడికించుకోవాలి.
- అనంతరం స్టవ్ ఆఫ్ చేసి మిరియాల పొడి, నిమ్మరసం, అవసరమైతే ఉప్పు వేసి రుచిని సర్దుబాటు చేసుకోండి.
చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేస్తే, కాలీఫ్లవర్ ఉప్మా రెడీ.. వేడి వేడిగా సర్వ్ చేసుకోండి.
సంబంధిత కథనం
టాపిక్