Mokshada Ekadashi: రేపే మోక్షద ఏకాదశి, ఆ రోజున ఈ పరిహారాలు చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి-do these remedies on mokshada ekadashi for lord vishnu and lakshmi devi blessings ,రాశి ఫలాలు న్యూస్
తెలుగు న్యూస్  /  రాశి ఫలాలు  /  Mokshada Ekadashi: రేపే మోక్షద ఏకాదశి, ఆ రోజున ఈ పరిహారాలు చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి

Mokshada Ekadashi: రేపే మోక్షద ఏకాదశి, ఆ రోజున ఈ పరిహారాలు చేస్తే మీ సమస్యలు తొలగిపోతాయి

Peddinti Sravya HT Telugu
Dec 10, 2024 09:51 AM IST

Mokshada Ekadashi: ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిధిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఉపవాసం చేయడంతో పాటుగా విష్ణుమూర్తిని, తులసి మొక్కని ప్రత్యేకించి ఆరాధించాలి. తులసి మొక్కని ఆరాధించడం వలన విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు. అలాగే తులసిని ఆరాధిస్తే ఆయన అనుగ్రహం కలుగుతుందని నమ్మకం.

Mokshada Ekadashi: రేపే మోక్షద ఏకాదశి, ఆ రోజున ఈ పరిహారాలు చేస్తే మంచిది
Mokshada Ekadashi: రేపే మోక్షద ఏకాదశి, ఆ రోజున ఈ పరిహారాలు చేస్తే మంచిది (pinterest)

మోక్షద ఏకాదశిని మోక్షాన్ని ఇచ్చే ఏకాదశి అని అంటారు. హిందువులు మోక్షద ఏకాదశి నాడు మహావిష్ణువుని ఆరాధిస్తారు. అలాగే లక్ష్మీదేవిని కూడా మోక్షద ఏకాదశి నాడు ఆరాధించడం జరుగుతుంది. తులసి మొక్కని ఈ ఏకాదశి నాడు ఆరాధించడం వలన అనుకున్న కోరికలు తీరడంతో పాటుగా కొన్ని ప్రయోజనాలను పొందవచ్చు.

yearly horoscope entry point

ప్రతి సంవత్సరం మార్గశిర మాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశి తిధిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఉపవాసం చేయడంతో పాటుగా విష్ణుమూర్తిని, తులసి మొక్కని ప్రత్యేకించి ఆరాధించాలి. తులసి మొక్కని ఆరాధించడం వలన విష్ణుమూర్తి ప్రసన్నమవుతాడు. ఆయన అనుగ్రహం కలుగుతుందని, హిందువుల నమ్మకం.

విష్ణుని, తులసిని ఎందుకు ఆరాధించాలి?

ఏకాదశి రోజున తులసి మొక్కని పూజించడం వలన విష్ణు, లక్ష్మీదేవి మన కోరికలను తీరుస్తారు. అందుకని చాలా మంది హిందువులు ఈ ఏకాదశి నాడు ప్రత్యేకించి తులసి మొక్కని ఆరాధించడం జరుగుతుంది. ఆనందం, శ్రేయస్సు కలగాలంటే ప్రత్యేకించి మోక్షద ఏకాదశి నాడు తులసి మొక్కని పూజించాలి. అలాగే తులసి మొక్కకి సంబంధించి కొన్ని పరిహారాలను కూడా ఈరోజు చేస్తారు. చాలామంది అనేక సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎలాంటి సమస్య ఉన్నా కూడా మోక్షద ఏకాదశి నాడు తొలగించుకోవచ్చు. ఆర్థిక ఇబ్బందుల్ని కూడా తొలగించుకోవడానికి అవుతుంది.

ఈ పరిహారాలు తప్పక పాటించండి:

మహావిష్ణువు అనుగ్రహాన్ని పొందడానికి మోక్షద ఏకాదశి నాడు కొన్ని పరిహారాలని తప్పకుండా చేయడం మంచిది. అప్పుడు మీ సమస్యలు అన్నీ తీరినట్టే.

విష్ణువుని ప్రసన్నం చేసుకోవాలంటే

విష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి బియ్యంతో చేసిన పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి. అలాగే పాయసాన్ని నైవేద్యంగా పెట్టేటప్పుడు కొన్ని తులసి దళాలను కూడా సమర్పించండి. విష్ణు అనుగ్రహం లభించి, అనుకున్న పనులు జరుగుతాయి. కోరికలు తీరుతాయి.

ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలంటే

ఈరోజు తులసి మొక్కకి నీళ్లు సమర్పించాలి. తరవాత తులసికి పచ్చి ఆవుపాలతో అర్ఘ్యం సమర్పించి, తులసి మొక్క చుట్టూ ఏడు ప్రదక్షణలు చేయాలి. అప్పుడు ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి.

అడ్డంకులు, బాధలు తీరాలంటే

అడ్డంకులు, బాధలు తొలగిపోవాలంటే మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవాలి. అందుకోసం మోక్షద ఏకాదశి నాడు తులసి జపమాలతో విష్ణు నామాలని జపించాలి. ఇలా చేయడం వలన అదృష్టం కూడా కలుగుతుంది.

ఆర్థిక కష్టాలు తీరి సంతోషంగా ఉండాలంటే

ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడడానికి, ధనం కలగడానికి మోక్షద ఏకాదశిని చెరుకు రసంలో తులసి ఆకుల్ని వేసి విష్ణుమూర్తికి అభిషేకం చేయాలి.

Whats_app_banner

సంబంధిత కథనం