Varieties of Naans: 12 రకాల నాన్‍లు ఇవి.. వీటిలో మీకెన్ని తెలుసు?-know about 12 varieties of naans how many you ate ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Varieties Of Naans: 12 రకాల నాన్‍లు ఇవి.. వీటిలో మీకెన్ని తెలుసు?

Varieties of Naans: 12 రకాల నాన్‍లు ఇవి.. వీటిలో మీకెన్ని తెలుసు?

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 10, 2024 08:30 AM IST

12 Varieties of Naans: నాన్‌ల్లో చాలా రకాలు ఉంటాయి. అనేక వెరైటీలు దొరుకుతాయి. అయితే, కొన్ని మాత్రమే చాలా మందికి తెలుసు. 12 రకాల నాన్‍ల గురించి ఇక్కడ చూడండి. వీటిలో మీరు ఎన్ని తిన్నారో గుర్తు చేసుకోండి.

Varieties of Naans: 12 రకాల నాన్‍లు ఇవి.. వీటిలో మీకెన్ని తెలుసు?
Varieties of Naans: 12 రకాల నాన్‍లు ఇవి.. వీటిలో మీకెన్ని తెలుసు?

రెస్టారెంట్‍కు వెళ్లే దాదాపు అందరూ నాన్‍లు తప్పనిసరిగా తింటారు. ఎందుకంటే ఏ కర్రీ, గ్రేవీ తీసుకున్నా నాన్‍తోనే ఎక్కువగా మంది తినేస్తారు. అయితే, నాన్‍లలో చాలా వెరైటీలు ఉంటాయి. సాధారణంగా నాన్‍లను మైదాపిండి, పెరుగు, బేకింగ్ సోడా కలిపి చేస్తారు. అయితే, వీటిలో నింపే డిఫరెంట్ స్టఫింగ్స్, వివిధ పదార్థాలతో వెరైటీలు ఉంటాయి. డిఫరెంట్ టేస్టులతో ఇవి అలరిస్తాయి. 12 రకాల నాన్‍ల గురించి ఇక్కడ చూడండి.

yearly horoscope entry point

బటర్ నాన్

ఎక్కువ మంది ఫేవరెట్ ‘బటర్ నాన్’. ఈ పాపులర్ నాన్‍నే ఎక్కువ మంది తింటుంటారు. రెస్టారెంట్లలో వీటినే ఎక్కువగా ఆర్డర్ చేస్తుంటారు. తందూర్‌పై కాల్చి.. బటర్ పూసి ఇచ్చే నాన్‍ల టేస్ట్ సూపర్‌గా ఉంటుంది. చాలా మంది బటర్ నాన్‍లను ఇష్టపడతారు.

గార్లిక్ నాన్

గార్లిక్ నాన్ కూడా ఫేమస్ వెరైటీనే. అల్లం ఫ్లేవర్ ఇష్టపడే వారికి ఇది తెగ నచ్చేస్తుంది. సాధారణ నాన్ చేసే ప్రాసెస్‍లోనే చేసినా ఇందులో అల్లాన్ని కలుపుతారు. కాస్త ఘూటుగా మంచి వాసనతో ఈ గార్లిక్ నాన్ అదిరిపోతుంది.

పన్నీర్ నాన్

పన్నీర్ కలిపి ఈ నాన్ తయారు చేస్తారు. పన్నీర్ అంటే ఇష్టమైన వారికి ఈ నాన్ మంచి అనుభూతి ఇస్తుంది. కర్రీల్లోనే కాకుండా ఇలా నాన్‍తోనే పనీర్ తింటే డిఫరెంట్‍గా ఉంటుంది. పిల్లలు కూడా దీన్ని ఎక్కువగా ఇష్టపడతారు.

చీజ్ నాన్

సాధారణ నాన్‍లో కరిగించిన చీజ్ కలిపి ఈ నాన్‍ను తయారు చేస్తారు. అద్భుతమైన ఫ్లేవర్‌తో సాఫ్ట్‌గా ఈ నాన్ ఉంటుంది. కర్రీలో నంచుకొని తింటే టేస్ట్ మరింత పెరుగుతుంది. చీజ్‍లోనే పచ్చిమిర్చీ ముక్కులను కూడా వేసి.. చిల్లీ చీజ్ నాన్‍ను కూడా తయారు చేస్తుంటారు.

పుదీనా నాన్

సాధారణ నాన్‍లో పుదీన కలిపి దీన్ని తయారు చేస్తారు. పుదీనా నాన్‍లో పుదీనను స్టఫ్ చేస్తారు. పైన కొన్ని పుదీన ఆకులు కూడా వేస్తారు. మిగిలిన పదార్థాలు నాన్‍లో వేసేవే ఉంటాయి. పుదీన ఫ్లేవర్ ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్.

అలూ మటర్ నాన్

బంగాళదుంప, బఠానీల స్టఫ్‍తో ఈ ఆలూ మటర్ నాన్ ఉంటుంది. ఇది ఎలాంటి కర్రీ లేకుండా నేరుగా కూడా తినవచ్చు.

ఆనియన్ నాన్

చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను స్టఫ్ చేసి ఈ ఆనియన్‍ నాన్‍ను తయారు చేస్తారు. పంటి కింద ఉల్లి ముక్కలు తగులుతూ ఈ నాన్ డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది.

ఎగ్ నాన్

నాన్‍పై గుడ్డును పగులకొట్టి సగం ఫ్రై చేసి దీన్ని తయారు చేస్తారు. ఎగ్ అంటే ఇష్టపడే వారికి ఇది మంచి ఆప్షన్‍గా డిఫరెంట్ టేస్టుతో ఉంటంది.

కీమా నాన్

కీమా నాన్… వెజ్, నాన్ వెజ్‍ రకాల్లో ఉంటుంది. నాన్ వెజ్ కీమా నాన్‍లో మటన్ లేదా చికెన్ స్టఫింగ్ ఉంటుంది. వెజిటేరియన్ కీమా నాన్‍లో ఎక్కువగా క్యాలిఫ్లవర్ స్టఫింగ్ ఉంటుంది. మరికొన్ని కూరగాయలను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తారు.

పెషావరీ నాన్

డ్రైఫ్రూట్స్, కొబ్బరి తురుము స్టఫింగ్‍తో తియ్యగా ఈ పెషావరీ నాన్ ఉంటుంది. డిఫరెంట్ నాన్‍ను తినాలంటే దీన్ని ట్రై చేయవచ్చు. రుచికరంగా ఉంటుంది.

లచ్చా నాన్

పొరలు పొరలుగా వచ్చేలా చేసేదే లుచ్చా నాన్. దీన్ని తయారు చేసే విధానం కాస్త డిఫరెంట్‍గా ఉంటుంది. ఎక్కువ పొరలతో విభిన్నమైన టేస్టుతో లచ్చా నాన్ ఉంటుంది. పరోటా ఫీలింగ్ ఇస్తుంది.

అమృత్‍సర్ నాన్

అమృత్‍సర్‌లో ఈ నాన్ చాలా పాపులర్. దీని తయారీలో చాలా ఎక్కువగా బటన్ వాడతారు. లోపల సాఫ్ట్‌గా, బయటి క్రిస్టీగా అదిరిపోయే టేస్టుతో అమృత్‍సర్ నాన్ వావ్ అనిపిస్తుంది.

Whats_app_banner

సంబంధిత కథనం