Black Cardamom: నల్ల యాలకులను ఎప్పుడైనా చూశారా.. వీటిని తింటే ఆరోగ్యానికి మంచిదేనా?
Black Cardamom: తోలు నల్లగా ఉండే యాలకులు కూడా ఉంటాయి. వీటి గురించి చాలా మందికి తెలియదు. చూసినా వాటిని యాలకులు అని కొందరు అనుకోరు. మరి ఈ యాలకులు తినడం ఆరోగ్యానికి మంచిదేనా అనేది ఇక్కడ తెలుసుకోండి.
సాధారణంగా యాలకుల తొక్క ఆకుపచ్చటి రంగులో ఉంటుంది. లోపల యాలకుల గింజలు ఉంటాయి. మార్కెట్‍లో ఎక్కువగా ఇవే దొరుకుతాయి. చాలా మంది ఈ ఆకుపచ్చ తొక్క ఉన్న యాలకులే వాడతారు. యాలకుల్లో ఇదొక్క రకమే అనుకుంటారు. అయితే, నల్ల యాలకులు కూడా ఉంటాయి. వీటి పై తొక్క కూడా నల్లగానే ఉంటుంది. సైజ్ కూడా పెద్దగా ఉంటాయి.
నల్ల యాలకుల్లోనూ ఔషధ గుణాలు మెండుగా ఉంటాయి. వీటిని కూడా రెగ్యులర్‌గా తీసుకోవచ్చు. సువాసన ఇవ్వడంతో పాటు ఆరోగ్యానికి కూడా ఈ యాలకులు మంచివి. నల్ల యాలకులతో ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాలు ఏవో ఇక్కడ చూడండి.
యాంటీబ్యాక్టీరియల్ గుణాలు
నల్లయాలకుల్లో యాంటీబ్యాక్టీరియల్, యాంటీసెప్టింగ్ గుణాలు మెండుగా ఉంటాయి. ఇవి తీసుకుంటే శరీరంలో బ్యాక్టీరియా, ఫంగస్‍లను నాశనం చేసేందుకు తోడ్పడతాయి. రోగ నిరోధక శక్తిని కూడా ఇవి పెంచుతాయి. వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ల నుంచి నల్ల యాలకులు రక్షణ కల్పించగలవు.
కాలేయానికి మేలు
కాలేయానికి నల్ల యాలకులు ఎంతో మేలు చేస్తాయి. శరీరంలో పేరుకుపోయిన వ్యర్థాలు మెరుగ్గా బయటికి వెళ్లేలా ఇవి తోడ్పడతాయి. ఇది కాలేయానికి చాలా ముఖ్యమైన ప్రయోజనంగా ఉంటుంది. కాలేయం పనితీరును నల్లయాలకులు మెరుగుపరుస్తాయి. మూత్ర పిండాలకు కూడా ఇవి మంచివి.
గుండె పనితీరు మెరుగ్గా..
నల్ల యాలకులు గుండె పనితీరు మెరుగ్గా ఉండేందుకు తోడ్పడుతుంది. హృదయ స్పందన నియంత్రణలో ఉండేందుకు సహకరిస్తుంది. బ్లడ్ ప్రెజర్ కంట్రోల్‍లో ఉండేలా చేయగలదు. ఓవరాల్‍గా గుండె ఆరోగ్యానికి నల్ల యాలకులు ఉపయోగపడతాయి.
దంతాలకు మంచిది
నల్ల యాలకులను తరచూ తీసుకుంటే దంతాలు ఆరోగ్యంగా ఉండేలా చేయగలవు. క్రిములను నాశనం చేయడం సహా నోటి ఆరోగ్యానికి ఈ యాలకులు ఉపయోగపడతాయి. నీటి దుర్వాసనను కూడా ఇవి తగ్గిస్తాయి. తాజా శ్వాసను పెంచుతాయి.
జీర్ణం మెరుగు
జీర్ణ సంబంధిత సమస్యలను నల్ల యాలకులు తగ్గించగలవు. అజీర్తి, గ్యాస్, ఉబ్బరం లాంటి సమస్యల నుంచి ఈ యాలకులు ఉపశమనం కలిగించగలవు. ఆహారం మెరుగ్గా జీర్ణం అయ్యేలా చేయగలవు. ఆకలిని కూడా మెరుగుపరుస్తాయి.
నల్ల యాలకుల వాడకం ఇలా..
ఆకుపచ్చ యాలకుల్లాగానే ఈ నల్ల వాటిని కూడా వాడుకోవచ్చు. నల్ల యాలకులను పలావ్, బిర్యానీ, ఫ్రైడ్ రైస్‍ల్లో వేసుకోవచ్చు. ఈ నల్ల యాలకులు పొడిని సూప్‍ల్లో వేసుకోవచ్చు. మంచి ఫ్లేవర్ ఇస్తాయి. పాయసాలు సహా వివిధ స్వీట్లలోనూ ఈ యాలకులను వాడుకోవచ్చు. నల్ల యాలకులను టీల్లో, వివిధ పానియాల్లో వేసుకోవచ్చు. తొక్క తీసి నేరుగా ఈ యాలకుల గింజలను నమలవచ్చు.
టాపిక్