Year Ender 2024 : ఈ ఏడాది మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తోపు కార్లు.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ ఉందా?-year ender 2024 top five cars launched in india in this year maruti suzuki dzire to skoda kylaq check out list ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Year Ender 2024 : ఈ ఏడాది మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తోపు కార్లు.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ ఉందా?

Year Ender 2024 : ఈ ఏడాది మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తోపు కార్లు.. ఈ లిస్టులో మీ ఫేవరెట్ ఉందా?

Anand Sai HT Telugu
Dec 10, 2024 09:44 AM IST

Year Ender 2024 : ఈ ఏడాది చివరికి వచ్చేసింది. నిజానికి 2024లో చాలా కొత్త కార్లు లాంచ్ అయ్యాయి. మార్కెట్‌లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాయి. 2024లో వచ్చిన టాప్ కార్లలో కొన్నింటి గురించి చూద్దాం..

స్కోడా కైలాక్ కారు
స్కోడా కైలాక్ కారు

2024లో కొన్ని అత్యుత్తమ బడ్జెట్ కార్లు విడుదల అయ్యాయి. ఆటోమెుబైల్ పరిశ్రమలో అందరి దృష్టిని ఆకర్శించాయి. అనేక కంపెనీల నుంచి మంచి మంచి కార్లు మార్కెట్‌లోకి వచ్చాయి. ఎస్‌యూవీలు, హ్యాచ్‌బ్యాక్‌లు, ఎలక్ట్రిక్ కార్ల సందడితో ఇండియాలో ఆటోమెుబైల్ మార్కెట్ దూసుకెళ్లింది. ఈ ఏడాది విడుదలైన కొన్ని ముఖ్యమైన కార్లపై ఓ లుక్కేద్దాం..

yearly horoscope entry point

మారుతి సుజుకి డిజైర్ 2024

మారుతి సుజుకి ఇటీవలే డిజైర్‌ను కొత్తగా విడుదల చేసింది. ఈ సెడాన్ ఎక్స్ షోరూమ్ ధర రూ. 6.79 లక్షల నుండి రూ. 10.14 లక్షల మధ్య ఉంటుంది. కొత్త డిజైర్ 1.2-లీటర్ పెట్రోల్, సీఎన్జీ ఇంజన్‌లతో వస్తుంది. ఇది 22 నుండి 32 కిమీల మైలేజీని ఇస్తుంది. కొత్త మారుతి డిజైర్‌లో 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్‌ప్లే కనెక్టివిటీ, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, ఆటో ఫోల్డింగ్ ORVMలు, పుష్ బటన్ ఇంజన్ స్టార్ట్ స్టాప్, రియర్ ఏసీ వెంట్‌లతో పాటు 6 ఎయిర్‌బ్యాగ్‌లు వంటి సేఫ్టీ ఫీచర్లు ఉన్నాయి. .

మహీంద్రా థార్ రోక్స్

మహీంద్రా 14 ఆగస్టు 2024న 5 డోర్ల థార్ రోక్స్‌ను విడుదల చేశారు. ఈ ఆఫ్ రోడింగ్ ఎస్‌యూవీ ధర రూ. 12.99 లక్షల నుండి మొదలవుతుంది. టాప్ మోడల్ ధర రూ. 22.49 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. మహీంద్రా థార్ రోక్స్ అనేది పెట్రోల్, డీజిల్ ఇంజన్‌లలో వచ్చే ఏకైక ఆఫ్ రోడ్ ఎస్‌యూవీ. 2 లీటర్ పెట్రోల్, 2.2-లీటర్ డీజిల్ ఇంజన్లు ఇందులో వస్తాయి. ఇందులో పనోరమిక్ సన్‌రూఫ్, 6-వే పవర్డ్ డ్రైవర్ సీట్, వెంటిలేటెడ్ సీట్లు, హై-క్వాలిటీ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్, 10.25-అంగుళాల డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ వంటి ఫీచర్లు ఉన్నాయి.

టాటా కర్వ్

టాటా మోటార్స్ ఈ ఏడాది మొదటిసారిగా కొత్త కర్వ్ ఎస్‌యూవీని పరిచయం చేసింది. ఇది కూపే స్టైల్ విభాగంలోకి వస్తుంది. ఐసీఈ, ఎలక్ట్రిక్ వేరియంట్‌లలో తీసుకువచ్చారు. దాని ఐసీఈ వేరియంట్ ధర రూ. 9.99 నుండి రూ. 17.69 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంటుంది. టాటా కర్వ్ ఈవీ ధర రూ. 17.49 లక్షల నుండి రూ. 21.99 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. ఇందులో 45 KWh, 55 KWh కెపాసిటీ గల రెండు బ్యాటరీ ప్యాక్‌లు వస్తాయి. ఈ ఈవీ పరిధి 500 కిలో మీటర్ల వరకు ఉంటుంది.

హోండా అమేజ్

హోండా అమేజ్‌ను కొత్త అవతార్‌లో తీసుకువచ్చారు. ఈ సెడాన్ ఏడీఎఎస్ ఫీచర్‌తో విడుదల అయింది. కొత్త హోండా అమేజ్ వీ, వీఎక్స్, జెడ్ఎక్స్ వేరియంట్‌లలో వస్తుంది. దీని ధర రూ. 7.99 లక్షల నుండి రూ. 10.90 లక్షల ఎక్స్-షోరూమ్ వరకు ఉంటుంది. కొత్త హోండా అమేజ్ 1.2-లీటర్ న్యాచురల్లీ యాస్పిరేటెడ్ 4-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది. ఈ సెడాన్‌లో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టీపీఎంఎస్, 3 పాయింట్ సీట్ బెల్ట్‌లు ఉన్నాయి.

స్కోడా కైలాక్

స్కోడా కైలాక్ కాంపాక్ట్ ఎస్‌యూవీని విడుదల చేసింది. ఈ కారు ధర రూ. 7.89 లక్షల నుంచి రూ. 14.40 లక్షల ఎక్స్ షోరూమ్ వరకు ఉంటుంది. కొత్త కైలాక్ 1 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో పరిచయం చేశారు. ఇందులో 6 ఎయిర్‌బ్యాగ్‌లు, టీపీఎంఎస్(టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్), ఈబీడీతో కూడిన ఏబీఎస్, ఈఎస్‌సీ, హిల్-హోల్డ్ అసిస్ట్, సెన్సార్‌లతో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరాతో పాటు 10 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో వస్తుంది.

Whats_app_banner