Fridge Water Problems : ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏం అవుతుంది?-side effects of drinking fridge water in summer details inside ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Fridge Water Problems : ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏం అవుతుంది?

Fridge Water Problems : ఫ్రిడ్జ్ వాటర్ తాగితే ఏం అవుతుంది?

HT Telugu Desk HT Telugu
Mar 18, 2023 01:45 PM IST

Cool Water : ఎండాకాలంలో చాలామంది కూల్ వాటర్ తాగుతారు. చల్లటి నీళ్లు నోట్లో పడితే.. హాయిగా అనిపిస్తుంది. వాటితో ఏదో తాత్కాలిక ఉపశమనం ఉంటుంది. అయితే.. ఆరోగ్య సమస్యలు వస్తాయి.

ఫ్రిడ్జ్ వాటర్
ఫ్రిడ్జ్ వాటర్ (unsplash)

వేసవి కాలంలో చల్లటి నీటి(Cool Water)ని ఎక్కువగా తాగడానికి ఇష్టపడతాం. అయితే చల్లని నీరు తాగడం తప్పు కాదు. అయితే ఫ్రిజ్‌లో ఉంచిన నీటిని తాగడం తప్పు. ఇది మన శరీర ఆరోగ్యానికి అంత మంచిది కాదు. చల్లటి నీరు వడదెబ్బకు ఉపశమనం కలిగిస్తుంది. కానీ ఫ్రిజ్‌లో ఉంచిన నీరు ఆరోగ్యానికి హానికరం.

ఆహారం తిన్న వెంటనే చల్లటి నీరు తాగడం వల్ల జీర్ణక్రియకు ఆటంకం కలుగుతుంది. ఇది జీవక్రియపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. ఎప్పుడూ చల్లటి నీరు(Cool Water) తాగడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి(Immunity) తగ్గుతుంది. చల్లటి నీళ్లు తాగడం వల్ల మలబద్ధకం, గ్యాస్‌ సమస్యలు(Gas Problems) వస్తాయి. దీని వల్ల కడుపు నొప్పి వస్తుంది. చల్లని నీరు గుండెలోని వాగస్ నరాల మీద ప్రభావం చూపుతుంది. ఇది హృదయ స్పందన రేటును తగ్గిస్తుంది. ఇది గుండెపోటుకు దారి తీస్తుంది.

చల్లటి నీరు తాగడం వల్ల చిగుళ్ల నొప్పి వస్తుంది. దంతాలు వదులుగా మారే అవకాశం ఉంది. చల్లని నీరు తాగడం వల్ల గొంతులోని రక్షిత పొరపై ప్రతికూల ప్రభావం పడుతుంది. దీని వల్ల గొంతు ఇన్ఫెక్షన్(Infections) వస్తుంది. మట్టి కుండలోని నీళ్లు తాగితే మంచిది. కూల్ వాటర్ ఏ సీజన్ లోనూ ఆరోగ్యానికి మంచిది కాదు.

చల్లని నీళ్లు తాగితే.. జీర్ణవ్యవస్థ మీద ప్రభావం పడుతుంది. ఫుడ్‌‌ సరిగ్గా జీర్ణం కాదు. పోషకాలు శరీరానికి అందవు. కడుపునొప్పి, వికారం, మలబద్ధకం, గ్యాస్‌‌ ట్రబుల్ లాంటి సమస్యలు వస్తాయి. కూల్ వాటర్ ఎక్కువగా తాగితే.. తలనొప్పి(Headche), సైనస్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి.

కూల్ వాటర్ తాగితే.. నాడీ వ్యవస్థ చల్లబడి హార్ట్ రేట్, పల్స్ రేట్ తగ్గి, హార్ట్ ఎటాక్ వచ్చే అవకాశం ఉంది. తిన్న వెంటనే చల్లని నీళ్లు తాగకూడదు. శరీరం లోని కొవ్వు బయటికి పోదు. ఈ కారణంగా బరువు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎండాకాలంలో ఎక్కువ కూల్ వాటర్ తాగే బదులు ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి నీళ్ల తాగడం బెటర్. ఇలా చేస్తే.. ఆరోగ్యంగా ఉంటారు.

Whats_app_banner