Dengue and Heart attack: షాకింగ్ అధ్యయనం, కోవిడ్ రోగుల కంటే డెంగ్యూ బారిన పడిన వారిలోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం-shocking study finds dengue sufferers more likely to develop heart disease than covid patients ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Dengue And Heart Attack: షాకింగ్ అధ్యయనం, కోవిడ్ రోగుల కంటే డెంగ్యూ బారిన పడిన వారిలోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం

Dengue and Heart attack: షాకింగ్ అధ్యయనం, కోవిడ్ రోగుల కంటే డెంగ్యూ బారిన పడిన వారిలోనే గుండె జబ్బులు వచ్చే అవకాశం

Haritha Chappa HT Telugu
Sep 03, 2024 04:30 PM IST

Dengue and Heart attack: వానాకాలంలో డెంగ్యూ వంటి జ్వరాలు తీవ్రంగా వ్యాపిస్తున్నాయి. చాలామంది డెంగ్యూ వచ్చిన వెంటనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని అనుకుంటారు. నిజానికి ఇది భవిష్యత్తులో ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుందని చెబుతోంది కొత్త అధ్యాయనం.

డెంగ్యూతో గుండె జబ్బులు వస్తాయా?
డెంగ్యూతో గుండె జబ్బులు వస్తాయా? (Pixabay)

Dengue and Heart attack: మనదేశంలో డెంగ్యూ బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా పిల్లలు ఎక్కువగా డెంగ్యూకు బలవుతున్నారు. డెంగ్యూ వచ్చిన వారిలో రోగనిరోధక శక్తి చాలా వరకు తగ్గిపోతుంది. ఆడ ఈజిప్ట్ దోమ కాటు వల్ల డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. దీనివల్ల ఎముకలు విరిగి, అంతర్గత అవయవాల్లో రక్తస్రావం కలిగి అవకాశం ఉంటుంది. కాబట్టి డెంగ్యూని తేలిగ్గా తీసుకోకూడదు. అయితే కోవిడ్ వచ్చి తగ్గిన వారి కంటే డెంగ్యూ బారిన పడి కోలుకున్న వారికే భవిష్యత్తులో తీవ్రమైన గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని చెబుతోంది ఈ అధ్యయనం.

డెంగ్యూతోనే డేంజర్

కోవిడ్ 19 వ్యాప్తి చెందినప్పటినుండి కోవిడ్ గురించి ఎన్నో అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. కోవిడ్ బారిన పడిన వారిలో భవిష్యత్తులో గుండె జబ్బులు అధికంగా వస్తున్నట్టు ఎన్నో వాదనలు వినిపించాయి. అయితే కొత్త అధ్యయనం మాత్రం కోవిడ్ కంటే డెంగ్యూనే చాలా డేంజర్ అని చెబుతోంది. ఎవరైతే డెంగ్యూ జ్వరం బారినపడి తేరుకున్నారో.. వారు భవిష్యత్తులో తీవ్రమైన గుండె జబ్బుల బారిన పడే అవకాశం 55 శాతం ఉంటుందని చెబుతోంది. ఈ అధ్యయనం డెంగ్యూ మానవ గుండెపై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తుందని ఈ అధ్యయనంలో తేలింది.

సింగపూర్ శాస్త్రవేత్తలు చెబుతున్న ప్రకారం కోవిడ్‌తో పోలిస్తే డెంగ్యూ బాధితులకు గుండె సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. డెంగ్యూ ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత రోగుల్లో గుండె సమస్యలు వచ్చే ప్రమాదంపెరిగే అవకాశం ఉందని సింగపూర్ పరిశోధకులు కనుగొన్నారు. ముఖ్యంగా హృదయపూర్వక డెంగ్యూ వచ్చి తగ్గిన వారిలో కనిపిస్తున్నాయి. ఇవే జబ్బులు కోవిడ్ వచ్చి తగ్గిన వారిలో కూడా గుర్తిస్తున్నారు.

దాదాపు 12 లక్షల మందిపై చేసిన ఈ అధ్యయనంలో ఈ డెంగ్యూ బాధితులు గుండెజబ్బుల బారిన పడే అవకాశం ఉన్నట్టు కనుగొన్నారు. డెంగ్యూ శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. డెంగ్యూ వల్ల ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోతుంది. అంతర్గత రక్తస్రావం కావడం, అవయవాలు దెబ్బ తినడం వంటివి జరుగుతాయి. డెంగ్యూ వల్ల కొంతమంది ‘డెంగ్యూ షాక్ సిండ్రోమ్’ కూడా గురి కావచ్చు. ఇదే రక్తపోటును అమాంతం పెంచేస్తుంది. డెంగ్యూ వచ్చి తగ్గాక నిరంతరంగా అలసటగా అనిపించినా, కండరాల నొప్పి పెడుతున్నా, కీళ్ల నొప్పులుగా ఉన్న వెంటనే చెక్ చేయించుకోవాలి. ఇది పోస్ట్ డెంగ్యూ ఫాటిగ్ సిండ్రోమ్ గా చెప్పుకుంటారు. దీనివల్ల కొన్ని సందర్భాల్లో కాలేయం దెబ్బతింటుంది. నరాల సమస్యలు కూడా వస్తాయి.

డెంగ్యూ బారిన పడకుండా ఉండాలంటే కలుషిత వాతావరణానికి దూరంగా ఉండాలి. ఇంట్లో దోమలు లేకుండా చూసుకోవాలి. వర్షాలు పడుతున్నప్పుడు ఎక్కడా నీరు నిలిచిపోకుండా జాగ్రత్తపడాలి. నీరు ఎక్కడ నిలిచిపోకుండా చూసుకోవాలి. అక్కడే డెంగ్యూ దోమలు వ్యాప్తి చెందుతూ ఉంటాయి.