Papaya Leaves: రోజుకో స్పూను బొప్పాయి ఆకుల రసం తాగితే డెంగ్యూతో పాటూ డయాబెటిస్ కూడా అదుపులో
Papaya Leaves: డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు రోగుల ప్లేట్ లెట్స్ తగ్గిపోతాయి. అటువంటి పరిస్థితిలో బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల రోగి ప్లేట్ లెట్స్ త్వరగా కోలుకుంటారు. బొప్పాయి ఆకుల రసం వల్ల మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
బొప్పాయి పండు, బొప్పాయి ఆకులు కూడా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలే. వీటిలో ఉండే సహజమైన భేది మందు లక్షణం మలబద్ధకం నుంచి ఉపశమనం కలిగిస్తాయి. బొప్పాయిని ఖాళీ కడుపుతో తినడం వల్ల ప్రేగు కదలిక మెరుగుపడుతుంది. దీని వల్ల మలబద్ధకం సమస్యలు రాకుండా ఉంటాయి. అలాగే పొట్ట ఉబ్బరంతో బాధపడేవారు బొప్పాయి పండును ఆహారంలో భాగం చేసుకుంటే ఎంతో మంచిది. ఈ పండుతో పాటూ దాని ఆకులు కూడా ఆరోగ్యానికి అద్భుతమైన ప్రయోజనాలను అందిస్తాయి. ఆయుర్వేదంలో బొప్పాయి ఆకులను ఔషధంగా వినియోగిస్తారు.
బొప్పాయి ఆకుల రసంతో ఉపయోగాలు
బొప్పాయి ఆకుల్లో ఫైబర్, ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫోలేట్, పొటాషియం, విటమిన్-ఎ, విటమిన్-సి పుష్కలంగా ఉంటాయి. ఫైబర్ అధికంగా ఉండే బొప్పాయి ఆకుల రసాన్ని తాగడం వల్ల బ్లడ్ షుగర్ కంట్రోల్ లో ఉంటుంది, జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తుంది. ఇది రక్తాన్ని శుభ్రపరుస్తుంది. అంతే కాదు డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు పేషెంట్ల ప్లేట్ లెట్స్ పడిపోతాయి. ఇలాంటి పరిస్థితుల్లో బొప్పాయి ఆకుల రసం తాగడం వల్ల రోగి ప్లేట్ లెట్స్ పెరిగి త్వరగా కోలుకునే అవకాశం ఉంది.
బొప్పాయి ఆకుల్లో విటమిన్ సి వంటి పోషకాలతో పాటు ఇమ్యునో మోడ్యులేటరీ ప్రభావాలను కూడా కలిగి ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని బలంగా ఉంచడంలో సహాయపడుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. బొప్పాయి ఆకులలో ఫ్లేవనాయిడ్లు, ఆల్కలాయిడ్లతో సహా అనేక యాంటీవైరల్ లక్షణాలు వీటిలో ఉన్నాయి. ఇవి శరీరానికి వైరల్ ఇన్ఫెక్షన్లతో పోరాడటానికి సహాయపడతాయి.
బొప్పాయి ఆకుల్లో పాపైన్, ఫైబర్ వంటి పోషకాలు ఉంటాయి, ఇవి జీర్ణక్రియను సక్రమంగా ఉంచడం ద్వారా గ్యాస్, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను తొలగించడంలో సహాయపడుతుంది. ఫైబర్ ప్రేగులకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే పాపైన్ ప్రోటీన్ విచ్ఛిన్నానికి సహాయపడుతుంది.
బొప్పాయి ఆకుల రసంలో ఉండే విటమిన్ ఎ, సి, ఇ రోగనిరోధక శక్తిని పెంచడానికి పనిచేస్తాయి. ఈ ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గించడం ద్వారా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి.
మధుమేహం అదుపులో
బొప్పాయి ఆకుల రసాన్ని రోజుకో స్పూను తాగడం వల్ల మధుమేహాన్ని నియంత్రించవచ్చు. ప్యాంక్రియాస్‌లో ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలను రక్షించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడంలో సహాయపడతాయి. కాబట్టి డయాబెటిస్ తో బాధపడుతున్నవారు ప్రతిరోజూ ఉదయం ఒక స్పూను బొప్పాయి ఆకులరసాన్ని తాగడం అలవాటు చేసుకోవాలి.
చర్మానికి…
బొప్పాయి జ్యూస్ తాగడం వల్ల అనేక చర్మ సంబంధిత సమస్యలు తొలగిపోతాయి. ఇందులో ఉండే విటమిన్ సి, విటమిన్ ఇ వంటివి వృద్ధాప్య లక్షణాలను తగ్గిస్తాయి. చర్మంపై ముడతలు పోవడానికి ఈ రసం ఎంతో ఉపయోగపడుతుంది.
డెంగ్యూతో బాధపడుతున్న రోగుేల్లో ప్లేట్లెట్లు తగ్గిపోతూ ఉంటాయి. దీనివల్ల ఒక్కోసారి వ్యక్తి ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు మూడు పూటలా ఒక్కో స్పూను బొప్పాయి ఆకులు రసాన్ని రోగికి తాగించడం మంచిది. ఇది పెంచడం ద్వారా డెంగ్యూ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి.