ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది జీవక్రియ స్థితి. శరీరంలోని కణాలు ఇన్సులిన్ కు తక్కువ ప్రతిస్పందిస్తాయి. ఇన్సులిన్ రక్తంలో చక్కెర స్థాయిలను నియత్రించే కీలకమైన హార్మోన్. ఇన్సులిన్ నిరోధకతను మెరుగుపరచడానికి 9 ఆహారాలు తెలుసుకుందాం.
pexels
By Bandaru Satyaprasad Jul 15, 2024
Hindustan Times Telugu
పాల ఉత్పత్తులు - ఎముకల బలానికి అవసరమైన కాల్షియం, ప్రోటీన్ ను పాల ఉత్పత్తులు అందిస్తాయి. ఇన్సులిన్ నిరోధకతను తగ్గించడానికి గ్రీక్ యోగర్ట్, స్కిమ్ మిల్క్ ఎంచుకోండి.
pexels
లీన్ ప్రోటీన్ - చికెన్, టర్కీ లీన్ కట్స్ అధిక కొవ్వు లేదా కార్బోహైడ్రేట్స్ లేకుండా శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలను అందిస్తుంది. ఇది రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడుతుంది.
pexels
పండ్లు - బెర్రీస్, యాపిల్స్, సిట్రస్ పండ్లలో ఫైబర్ అధికంగా ఉంటుంది. అలాగే తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ కలిగి ఉంటాయి. పండ్ల రసాలు తాగడం మానుకోండి. వాటిల్లో చక్కెర ఎక్కువగా ఉంటుంది.
pexels
ఆరోగ్యకరమైన కొవ్వులు - అవోకాడోస్, డ్రై ఫ్రూట్స్, గింజలు, ఆలివ్ ఆయిల్ వంటివి మీ ఆహారంలో చేర్చుకోవడం వల్ల మోనోఅన్ శాచురేటెడ్, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు లభిస్తాయి. ఇవి మితంగా తీసుకుంటే ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
pexels
కూరగాయలు - ఆకు కూరలు, బ్రోకలీ, కాలీఫ్లవర్, బెల్ పెప్పర్స్ వంటి కూరగాయలలో కేలరీలు తక్కువగా ఉంటాయి. వీటిలో ఫైబర్, విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి.
pexels
కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు - వోట్స్, క్వినోవా, బ్రౌన్ రైస్, వీట్ ప్రొడక్ట్స్ ఫైబర్ ను కలిగి ఉంటాయి. ఇవి జీర్ణ క్రియను నెమ్మదిస్తాయి. రక్తంలో చక్కెరను బాగా నియంత్రించడంతో సహాయపడతాయి.
pexels
హై ఫైబర్ ఫుడ్స్ - ఫైబర్ బరువు తగ్గడానికి మాత్రమే కాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తుంది. చిక్కుళ్లు, చియా గింజలు, అవిసె గింజలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరీకరించడంలో సహాయపడతాయి.
pexels
చేపలు - సాల్మన్, సార్డినెస్, హెర్రింగ్ వంటి చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ సెన్సిటివిటీని మెరుగుపరుస్తాయి.
pexels
తృణ ధాన్యాలు -తృణ ధాన్యాల్లో విటమిన్లు, ఖనిజాలు, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించేందుకు సహాయపడతాయి.
pexels
గుండెకు మేలు చేసే పొటాషియం పుష్కలంగా ఉండే ఫుడ్స్ ఇవి