Coffee and Heart: కాఫీ తాగి గుండె ఆరోగ్యాన్ని పాడుచేసేయకండి, రోజుకు ఎన్ని కప్పులు తాగొచ్చంటే-dont ruin your heart health by drinking coffee how many cups a day can you drink ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Coffee And Heart: కాఫీ తాగి గుండె ఆరోగ్యాన్ని పాడుచేసేయకండి, రోజుకు ఎన్ని కప్పులు తాగొచ్చంటే

Coffee and Heart: కాఫీ తాగి గుండె ఆరోగ్యాన్ని పాడుచేసేయకండి, రోజుకు ఎన్ని కప్పులు తాగొచ్చంటే

Haritha Chappa HT Telugu
Aug 31, 2024 10:30 AM IST

Coffee and Heart: రోజులో కాఫీ రెండు మూడు సార్లు తాగేవారు ఉన్నారు. కాఫీ ఎక్కువగా తాగడం వల్ల శరీరంలో కెఫీన్ అధికంగా చేరుతుంది. ఇది గుండె సమస్యలకు కారణం అవుతుంది.

కాఫీతో గుండె సమస్యలు
కాఫీతో గుండె సమస్యలు (Pixabay)

కాఫీతోనే మీరు రోజును ప్రారంభిస్తారా? అయితే మీరు కచ్చితంగా కొన్ని ముఖ్యమైన విషయాలు తెలుసుకోవాల్సిందే. ఒక కప్పు కాఫీ మిమ్మల్ని రోజంతా ఉత్సాహంగా ఉంచుతుంది. కానీ రోజుకు మూడు, నాలుగు కప్పుల కాఫీ తాగితే మాత్రం గుండెకు చేటు జరుగుతుంది. ఈ విషయం తెలియక ఆఫీసుల్లో పనిచేసేవారు కాఫీ మెషీన్ దగ్గరకు వెళ్లి తరచూ కాఫీ తాగేస్తూ ఉంటారు. ఇక ఇంట్లో ఉన్న ఖాళీ ఉన్నవాళ్లు కూడా కాఫీని తాగేస్తూ ఉంటారు. ఎవరైనా చుట్టాలు వస్తే వారితో పాటూ తామూ కూడా తాగేస్తూ ఉంటారు. కానీ ఇలా తాగడం వల్ల గుండె కొన్ని రోజుల్లోనే బలహీనంగా మారిపోతుంది.

ఒక భారతీయ అధ్యయనంలో కెఫిన్ వినియోగం గురించి ఒక కొత్త విషయం వెలుగులోకి తెచ్చింది. ప్రతిరోజూ 400 మి.గ్రా కంటే ఎక్కువ కెఫిన్ తీసుకోవడం వల్ల గుండెకు చాలా ప్రమాదం. 400 మి.గ్రా కెఫీన్ అంటే దాదాపు నాలుగు కప్పుల కాఫీతో సమానం. లేదా రెండు ఎనర్జీ డ్రింక్స్ తాగడంతో సమానం. ఇలా తరచూ కాఫీ తాగుతూ ఉంటే తీవ్రమైన హృదయ సంబంధ సమస్యలను అభివృద్ధి చేసే ప్రమాదం ఉంది. కాఫీ మాత్రమే కాదు సోడా, ఎనర్జీ డ్రింక్స్ వంటి ఇతర కెఫిన్ ఉత్పత్తులు వల్ల గుండె ఆరోగ్యం క్షీణిస్తుంది.

కెఫిన్ గుండెను ఎలా ప్రభావితం చేస్తుంది?

కాఫీ శరీరంలోని పారాసింపథెటిక్ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. ఈ వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తే శరీరం విశ్రాంతిగా ఉంటుంది. ఇది హృదయ స్పందన రేటును శాంతపరుస్తుంది. శ్వాసను నెమ్మదించేలా చేస్తుంది. అయితే కాఫీ తాగగానే పరిస్థితి మారుతుంది. కాఫీ ఒక ఉద్దీపన అని చెప్పుకోవాలి. ఇది పారాసింపథెటిక్ వ్యవస్థకు అంతరాయం కలిగిస్తుంది. హృదయ స్పందన రేటును పెంచుతుంది.

ఇలా కాఫీ వల్ల పారాసింపథెటిక్ వ్యవస్థకు అంతరాయం కలుగుతూ ఉంటే అధిక రక్తపోటు, ఇతర హృదయ సంబంధ వ్యాధులకు దారితీస్తుంది. గుండెలో అధిక పీడనం అనేది నిశ్శబ్ద ప్రమాదంగా మారుతుంది. ఇది నెమ్మదిగా కొరోనరీ ఆర్టరీ డిసీజ్, హార్ట్ ఫెయిల్యూర్, క్రానిక్ కిడ్నీ డిసీజ్, చిత్తవైకల్యం వంటి ప్రమాదకరమైన వ్యాధులుగా మారుతుంది.

ఎవరికి ప్రమాదం?

మహిళలు, వ్యాపారం చేసేవాళ్లు, వర్కింగ్ ప్రొఫెషనల్స్ అధికంగా కాఫీ తాగుతున్నట్టు అధ్యయనాలు చెబుతున్నాయి. సుదీర్ఘ పని గంటలు చేయడం, ఒత్తిడితో కూడిన పని ప్రదేశాలు, బిజీ, వేగవంతమైన జీవనశైలితో కూడిన ఉద్యోగాలు, లెక్కలేనన్ని కాఫీ షాపులు, ఆఫీస్ కాఫీ యంత్రాలు… ఇవన్నీ కాఫీ ఎక్కువ తాగేలా చేస్తున్నాయి. ఇలా కొంతమంది రోజులో 600 మి.గ్రా కంటే ఎక్కువ కెఫీన్ గుండెపై ప్రభావం బలంగా పడుతుంది.

మీకు ఇష్టమైన కాఫీని వదులుకోమని మేం చెప్పడం లేదు. కాకపోతే మితంగా కాఫీ తాగండి. కాఫీ కోరికను చంపేయడానికి అధికంగా నీరు తాగండి. అలాగే తగినంత నిద్ర అవసరం. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా కాపీ కోరికను తగ్గించుకోవచ్చు.

టాపిక్