Severe cough: వారానికి మించి దగ్గు తీవ్రంగా వేధిస్తుంటే ఈ పని చేయండి, తేలికగా మాత్రం తీసుకోకండి-severe cough do this if you have a severe cough for more than a week dont take it lightly ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Severe Cough: వారానికి మించి దగ్గు తీవ్రంగా వేధిస్తుంటే ఈ పని చేయండి, తేలికగా మాత్రం తీసుకోకండి

Severe cough: వారానికి మించి దగ్గు తీవ్రంగా వేధిస్తుంటే ఈ పని చేయండి, తేలికగా మాత్రం తీసుకోకండి

Haritha Chappa HT Telugu
Feb 16, 2024 12:52 PM IST

Severe cough: ఈ మధ్యకాలంలో తీవ్రమైన దగ్గు, జలుబు ఎక్కువ మందిని వేధిస్తోంది. ఇన్ఫెక్షన్ల కారణంగా గాలి నాణ్యత తక్కువగా ఉండడం వల్ల ఇలా తీవ్రమైన దగ్గు జలుబు దేశమంతటా వ్యాపిస్తున్నట్టు తెలుస్తోంది.

తీవ్రమైన దగ్గును తగ్గించుకోవడం ఎలా?
తీవ్రమైన దగ్గును తగ్గించుకోవడం ఎలా? (Pixabay)

Severe cough: సాధారణ దగ్గు, జలుబే తీవ్రంగా మారి వారాలు, నెలలు తరబడి వేధిస్తున్నాయి. ఈ మధ్యన దేశమంతటా తీవ్రమైన దగ్గు, జలుబు వ్యాపిస్తోంది. ఇది ఒక వైరస్ వేవ్‌గా భావిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. దగ్గు, జలుబు వారానికంటే ఎక్కువ కాలం వేధిస్తుంటే అది వైరస్ కారణంగానే అని భావించాలి. యాంటీబయోటిక్స్, ఇతర మందులు ఎంత వాడుతున్నా కూడా దగ్గు అదుపులోకి రాకపోవడమే దీని లక్షణం. ఈ దగ్గు తీవ్రంగా మారి తగ్గడానికి సమయం పడుతుంది.

ఈ రోజుల్లో ఎక్కువ మంది తీవ్రమైన దగ్గు బారిన పడడానికి అనేక కారణాలు ఉన్నాయి. దానికి ఫ్లూ, శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు, కోవిడ్ 19, అలెర్జీ, గాలి నాణ్యత తగ్గడం, విపరీతమైన కాలుష్యం ఇవన్నీ కారణాలుగానే చెప్పుకోవచ్చు. ఒకటి రెండు రోజుల్లోనే సాధారణ దగ్గులా వచ్చి అది తీవ్రంగా మారుతుంది. మందులు తీసుకున్నా కూడా దగ్గు తీవ్రంగానే ఉంటుంది. ఈ దగ్గు తగ్గడానికి ఒక్కోసారి నెల రోజులు సమయం పట్టవచ్చు. దగ్గు తీవ్రత ఎక్కువగా ఉంటే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి.

దగ్గు వేధిస్తుంటే ఇలా చేయండి

తీవ్రంగా దగ్గు వేధిస్తున్నప్పుడు నెబ్యులైజేషన్ తీసుకోవడం చాలా అవసరం. నెబ్యులైజేషన్ అనేది ఒక వైద్య చికిత్స. ఇది మందులను పీల్చడం ద్వారా నేరుగా ఊపిరితిత్తుల్లోకి వెళ్తాయి. నెబ్యులైజర్ పరికరాన్ని ఉపయోగించి శ్వాసకోశ వ్యవస్థలోకి సులభంగా ద్రవరూపంలో ఉన్న మందులను పొగ మంచుగా మార్చి పంపిస్తారు. ముఖ్యంగా ఆస్తమా, క్రానిక్ అబ్స్ట్రాక్టివ్ పల్మనరీ డిసీజ్, సిస్టిక్ ఫైబ్రోసిస్ వంటి శ్వాసకోశ సమస్యలు ఉన్నవారికి నెబ్యులేజేషన్ చాలా ముఖ్యం.

నెబ్యులైజేషన్ పద్ధతిలో శ్వాసనాళాలకు నేరుగా మందులు పంపిణీ చేయడం జరుగుతుంది. దీనివల్ల అవి సమర్థవంతంగా పనిచేస్తాయి. కాస్త తక్కువ కాలంలోనే దగ్గు, శ్వాసకోశ వ్యవస్థ అదుపులోకి వస్తాయి.

దగ్గు అధికంగా ఉన్నప్పుడు నోరు, ముక్కు కప్పి ఉంచేలా మాస్కులు ధరించండి. ఇతరులకు అది వ్యాప్తి చెందకుండా ఉంటుంది.

చేతులను కనీసం 20 సెకండ్ల పాటు సబ్బుతో కడుగుతూ ఉండండి. దగ్గు ,తుమ్ములు వచ్చాక, ముక్కు చీదిన తర్వాత చేతులు శుభ్రం చేసుకోవడం కచ్చితంగా మర్చిపోవద్దు. చేతులు శుభ్రపరిచేందుకు 60 శాతం ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ ని ఉపయోగించండి.

దగ్గు, తుమ్ములతో బాధపడుతున్న వారికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి. లేకుంటే ఆ దగ్గు మీకు వ్యాప్తి చెందే అవకాశం ఉంది. మీకు తీవ్రమైన దగ్గు వంటి అనారోగ్య లక్షణాలతో ఉంటే ఇంట్లోనే ఉండడానికి ప్రయత్నించండి. అది ఇతరులకు సోకకుండా ఉంటుంది. ముఖ్యంగా సమతుల్య ఆహారం తీసుకోవడం, వ్యాయామం చేయడం, నీరు అధికంగా తాగడం వంటి పద్ధతులతో రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయవచ్చు. దీనివల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు.

ప్రతిరోజూ వేడినీళ్లు తాగడం అలవాటు చేసుకోండి. వేడినీళ్ల వల్ల గొంతు చికాకు తగ్గుతుంది. దగ్గును కూడా తగ్గిస్తుంది. తీవ్రంగా దగ్గు వేధిస్తున్నప్పుడు వేడి నీళ్లు మాత్రమే తాగండి. అలాగే వ్యాయామం చేయడం మర్చిపోవద్దు. కనీసం రోజుకు అరగంట పాటూ వేగంగా నడవాలి. వ్యాయామం వల్ల కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి.

WhatsApp channel