Leftover Oil: ఊరగాయల్లో మిగిలిన నూనెను తిరిగి ఇలా ఉపయోగించుకోండి, టేస్టీగా ఉంటుంది-reuse the remaining oil in pickles its tasty ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Leftover Oil: ఊరగాయల్లో మిగిలిన నూనెను తిరిగి ఇలా ఉపయోగించుకోండి, టేస్టీగా ఉంటుంది

Leftover Oil: ఊరగాయల్లో మిగిలిన నూనెను తిరిగి ఇలా ఉపయోగించుకోండి, టేస్టీగా ఉంటుంది

Haritha Chappa HT Telugu
May 25, 2024 01:29 PM IST

Leftover Oil: ఊరగాయలు, ఆవకాయలు పెడితే వాటిలో ఎక్కువగా వేసేది నూనె. ఆవకాయ ముక్కలు అయిపోయినా కూడా నూనె మిగిలిపోతూ ఉంటుంది. దాన్ని తిరిగి ఉపయోగించుకోవచ్చు.

ఊరగాయల్లో మిగిలిపోయిన నూనె
ఊరగాయల్లో మిగిలిపోయిన నూనె

Leftover Oil: ఆవకాయలు, ఊరగాయలు, పచ్చళ్ళు భారతీయ వంటకాలలో ముఖ్యమైనవి. సంపూర్ణ భోజనంలో వీటి స్థానం కూడా ఉంది. ఎంతో మంది ఇప్పటికీ మొదటి ముద్దను ఆవకాయ లేదా ఏదైనా పచ్చడితో తినేందుకు ఇష్టపడతారు. ఊరగాయలు, ఆవకాయలు పెట్టేటప్పుడు అధికంగా నూనె వేస్తారు. అయితే అందులోని ముక్కలు అయిపోయినా ఆ ఎర్రటి నూనె మాత్రం మిగిలిపోతూ ఉంటుంది. దీన్ని చాలా మంది పడేస్తూ ఉంటారు. నిజానికి ఆ నూనెను తిరిగి ఉపయోగించుకోవచ్చు. ఆ నూనెలో ఎన్నో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. తిరిగి వాటిని వాడడం వల్ల ఆరోగ్యానికి మేలే జరుగుతుంది.

ఊరగాయల్లో మిగిలిన నూనెలో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఎక్కువ. ఇది పులిసే ప్రక్రియలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు పుట్టుకొస్తాయి. ఇవి శరీరంలోని హానికరమైన ఫ్రీ రాడికల్స్ తో పోరాడేందుకు కావలసిన శక్తిని ఇస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. అలాగే ఈ ఊరగాయలోని నూనెలో యాంటీ ఇన్ఫ్లమేటరి గుణాలు ఎక్కువే. ఎందుకంటే ఆ ఊరగాయల్లో వెల్లుల్లి, పసుపు వంటివి వేస్తాము. ఇవన్నీ బాగా పులిసి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలను ఆ నూనెకు అందిస్తాయి. కాబట్టి ఈ నూనెను తీసుకోవడం వల్ల శరీరంలో ఇన్ ఫ్లమ్మేటరీ లక్షణాలు తగ్గుతాయి.

ఆవకాయ, ఊరగాయల్లో నూనెను పడేయకుండా తిరిగి వాడడం వల్ల జీర్ణ ఎంజైములు ఉత్పత్తి అవుతాయి. పేగుల ఆరోగ్యం రెట్టింపు అవుతుంది. జీర్ణక్రియకు సహాయపడుతుంది. పులియబెట్టిన ఆహారాల జాబితాలోకే ఈ ఊరగాయలు కూడా వస్తాయి. కాబట్టి ఆ నూనెలో ప్రోబయోటిక్ బ్యాక్టీరియా అధికంగా ఉంటుంది. ఇది ఆరోగ్యకరమైన గట్ బ్యాక్టీరియాకు సహాయపడుతుంది. అంటే పొట్టలో ఉన్న మంచి బాక్టీరియాను ఇది కాపాడుతుంది. దీనివల్ల శరీరం పోషకాలను సూచించుకుంటుంది. రోగనిరోధక పని తీరు కూడా మెరుగుపడుతుంది.

కూరగాయ నూనెలో వెల్లుల్లి సాధారణంగా ఉంటుంది. కూరగాయల్లో వెల్లుల్లి కూడా వేస్తాము. కాబట్టి అందులోని గుణాలు నూనెలో ఇంకిపోతాయి. ఆ నూనెను తినడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలాగే రక్తపోటు అదుపులో ఉంటుంది. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. కాబట్టి ప్రతి సంబంధం వ్యాధులు రాకుండా ఉంటాయి. ఆవాలు, మెంతులు వంటివి కూడా ఊరగాయ నూనెలో ఇంకిపోయి ఉంటాయి. అలాంటి నూనెను మిగిలిపోయిందని పడేయకుండా తిరిగి వినియోగించుకోవచ్చు. దీనివల్ల ఆ పోషకాల్ని శరీరంలో చేరుతాయి.

ఆవకాయలలో మిగిలిపోయిన ఎర్రని నూనెలో వెల్లుల్లి, పసుపు గుణాలు మిళితమైపోయి ఉంటాయి. ఆ నూనెను తిరిగి ఆహారంగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ నిరోధక లక్షణాలు శరీరంలో చేరుతాయి. అంటే ఎన్నో రకాల క్యాన్సర్లు వచ్చే అవకాశం తగ్గుతుంది. చర్మానికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్ పదార్థాలు చర్మ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడం జుట్టు కుదుళ్లను బలంగా చేయడం వంటి ప్రయోజనాలు కలుగుతాయి. దీని వాసన చాలా రుచిగా ఉంటుంది. కాబట్టి ఈ నూనెను తిరిగి వంటల్లో వినియోగించుకోవచ్చు. ఎలా వినియోగించాలో తెలుసుకోండి .

సలాడ్‌లు తయారు చేసేటప్పుడు ఈ నూనెను పైన చల్లుకొని స్పూన్‌తో ఒకసారి కలుపుకొని తింటే కొత్త రుచి వస్తుంది. అలాగే చికెన్, చేపలు, రొయ్యలు వంటివి వండేటప్పుడు ఈ నూనెను మ్యారినేషన్ కోసం కలిపితే బాగుంటుంది. అలాగే వేపుళ్లకు ఈ నూనెను చివరిలో ఒక స్పూను జల్లి కలిపితే కొత్త రుచి వస్తుంది. ఆమ్లెట్లు వంటివి కూడా ఈ నూనెతో జత చేసి వండితే రుచి అదిరిపోతుంది. బంగాళాదుంపల ఫ్రై చేసేటప్పుడు ఈ నూనెను కాస్త వేయండి చాలు. రుచి అమోఘంగా ఉంటుంది. అలాగే చేపల ఫ్రై కి కూడా ఈ నూనెను వినియోగించవచ్చు.

Whats_app_banner