Good Friday 2024: గుడ్ ఫ్రైడే రోజున చేపలు తినడం సంప్రదాయంగా ఎలా మారింది?
Good Friday 2024: గుడ్ ఫ్రైడే రోజున క్రైస్తవ సోదరులు చేపలు కచ్చితంగా తింటారు. ఇది ఆచారంగా ఎలా మారిందో తెలుసుకుందాం.
Good Friday 2024: ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవ సోదరులు నిర్వహించుకునే ముఖ్యమైన పర్వదినం గుడ్ ఫ్రైడే. యేసు క్రీస్తును శిలువ వేసినది ఇదే రోజు. శిలువ పైనే 6 గంటల పాటు సజీవంగా ఉన్న యేసు ప్రభువు తర్వాత మరణించారు. అందుకే గుడ్ ఫ్రైడే రోజు క్రైస్తవ సోదరులు ఆనందంగా ఉండరు.
ఈరోజు అంతా గంభీరంగానే వారు ఉంటారు. అయితే గుడ్ ఫ్రైడే రోజు కొంతమంది క్రైస్తవ సోదరులు కచ్చితంగా చేపలను తింటారు. శతాబ్దాలుగా ఇది ఆచారంగా వస్తుంది. గుడ్ ఫ్రైడే రోజున చేపలు తినే సాంప్రదాయానికి కొన్ని కారణాలు ఉన్నాయని చెబుతారు.
గుడ్ ఫ్రైడే రోజు చాలామంది క్రైస్తవులు ఉపవాసం ఉంటారు. చికెన్, మటన్ వంటి మంసాలను తినకుండా ఉంటారు. అయితే ఈరోజు చేపలను తినే వారి సంఖ్య ఎక్కువే. ఆ మాంసాలకు ఇది ప్రత్యామ్నాయంగా భావిస్తారు. గుడ్ ఫ్రైడే రోజు చేపలు తినే సాంప్రదాయానికి కొన్ని లోతైన చారిత్రక మూలాలు ఉన్నాయి. పురాతన కాలంలో చేపలు... తీర ప్రాంత ప్రజలకు ప్రధాన ఆహారంగా ఉండేవి. క్రైస్తవ మతం యూరోప్ అంతటా వ్యాపించడంతో తీరప్రాంతాల్లో ఉండే వారికి గుడ్ ఫ్రైడే రోజు చేపలు వినియోగం ఖచ్చితంగా మారింది.
గుడ్ ఫ్రైడే సాధారణంగా లెంట్ సీజన్లో వస్తుంది. గుడ్ ఫ్రైడే వచ్చేవరకు ప్రతిరోజు ఉపవాసం ఉంటారు. లెంట్ ముగిసిందంటే శీతాకాలం ముగిసిందని అర్థం... వసంతకాలం ప్రారంభం అవుతుందని అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో మంచినీటి చేపలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే గుడ్ ఫ్రైడే రోజు చేపలు తినడం అనేది ఒక అలవాటుగా మారింది.
ఇటీవల కాలంలో గుడ్ ఫ్రైడే రోజు సముద్రపు చేపలను ఆహారంగా తినే వారి సంఖ్య పెరిగింది. ఇతర మాంసాలను తినడం వల్ల పర్యావరణ క్షీణత ఎక్కువవుతుంది. అందుకే సముద్రపు ఆహారాన్ని ఎంచుకుంటున్నారు. గుడ్ ఫ్రైడే రోజు వివిధ దేశాల్లో రకరకాల చేపలను అనేక రకాలుగా వండుకొని తింటారు. ఇది ఎన్నో సాంస్కృతిక వారసత్వాలను ప్రతిబింబిస్తుంది.
టాపిక్