Punjabi Lassi: వేసవి వేడిని తట్టుకోవాలంటే చల్లని పంజాబీ లస్సీ, ఇలా చేసుకుని తాగండి, ప్రాణం లేచొస్తుంది-punjabi lassi recipe in telugu know how to make this drink ,లైఫ్‌స్టైల్ న్యూస్
తెలుగు న్యూస్  /  లైఫ్‌స్టైల్  /  Punjabi Lassi: వేసవి వేడిని తట్టుకోవాలంటే చల్లని పంజాబీ లస్సీ, ఇలా చేసుకుని తాగండి, ప్రాణం లేచొస్తుంది

Punjabi Lassi: వేసవి వేడిని తట్టుకోవాలంటే చల్లని పంజాబీ లస్సీ, ఇలా చేసుకుని తాగండి, ప్రాణం లేచొస్తుంది

Haritha Chappa HT Telugu
May 31, 2024 11:57 AM IST

Punjabi Lassi: వేసవి పెరిగిపోయింది. వేడి గాలులకు ప్రజలు అల్లాడిపోతున్నారు. చల చల్లని పానీయాలు తాగేందుకు అందరూ ఇష్టపడుతున్నారు. ఒకసారి పంజాబీ లస్సీ తాగి చూడండి మీకు ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది.

చల్లచల్లని పంజాబీ లస్సీ
చల్లచల్లని పంజాబీ లస్సీ

Punjabi Lassi: వేడి వాతావరణం కారణంగా ఆహారం ఏదీ తినాలనిపించదు. చల్లని ద్రవపదార్థాలు మాత్రమే తాగాలనిపిస్తుంది. మజ్జిగ, పండ్ల రసాలు తాగాలని ఎక్కువగా అనిపిస్తుంది. అయితే శరీరానికి చలువ చేయడంతో పాటు శక్తిని అందించే పానీయాలను అందించాలి. ఒకసారి పంజాబీ లస్సీని ప్రయత్నించండి. దీన్ని ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇది తాగితే శరీరానికి చలువ చేయడమే కాదు శక్తి కూడా అందుతుంది. దీన్ని ఒకసారి చేసి ఫ్రిజ్ లో పెట్టుకుంటే రోజంతా నచ్చినప్పుడల్లా తాగొచ్చు.

పంజాబీ లస్సీ రెసిపీకి కావాల్సిన పదార్థాలు

పంచదార - నాలుగు స్పూన్లు

కుంకుమ పువ్వు - మూడు రేకులు

పెరుగు - ఒకటిన్నర కప్పు

ఐస్ క్యూబ్స్ - కొన్ని

చల్లటి నీళ్లు - రెండు గ్లాసులు

యాలకుల పొడి - పావు స్పూను

పంజాబీ లస్సీ రెసిపీ

1. పెరుగును బ్లెండర్లో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి.

2. ఈ పెరుగులో పంచదార, కుంకుమపువ్వు రేకులు, యాలకుల పొడి వేసి బాగా కలపాలి.

3. ఐస్ క్యూబ్స్ కూడా వేసి పక్కన పెట్టాలి.

4. అందులోనే చల్లటి నీళ్లను వేసి కవ్వంతో మరొక్కసారి చిలుకాలి.

5. ఇప్పుడు వాటిని గ్లాసుల్లో పోసుకొని తాగాలి.

6. మండే ఎండల్లో నుంచి ఇంటికి వచ్చేవారికి ఈ పంజాబీ లస్సీని అందిస్తే వారికి ప్రాణం లేచి వచ్చినట్టు అనిపిస్తుంది.

7. సాధారణ మజ్జిగతో పోలిస్తే ఈ లస్సీ తాగడం మంచిది.

8. ఇందులో కాస్త చిటికెడు ఉప్పు కూడా వేసుకుంటే మంచిది.

ఈ పంజాబీ లస్సీలో ముఖ్యంగా మనం వాడినది పెరుగు. ఆ తర్వాత నీటిని కలిపి దాన్ని మజ్జిగగా మార్చాము. మజ్జిగ అద్భుతమైన పానీయంగా చెప్పుకోవాలి. ఇది శరీరాన్ని రిఫ్రెష్ చేస్తుంది. శరీరానికి వెంటనే శక్తిని అందిస్తుంది. మజ్జిగలో క్యాలరీలు, కొవ్వు చాలా తక్కువగా ఉంటాయి. 

వీటిలో ఉండే ప్రోటీన్, క్యాల్షియం మన శరీరానికి అత్యవసరం. కాపాడడానికి కూడా ఈ లస్సి ఉపయోగపడుతుంది. మన పొట్టలో ఉన్న మంచి బ్యాక్టీరియాను కాపాడుకునేందుకు ఇందులో ఉండే ప్రోబయోటిక్ సహాయపడతాయి. కాబట్టి పంజాబీ లస్సీని వారానికి నాలుగైదు సార్లు చేసుకుని తాగితే చాలా మంచిది. ప్రతిరోజూ తాగినా ఎలాంటి నష్టమూ లేదు.

Whats_app_banner